విశాఖపట్నం

లావణ్య మృతిపై లోతైన దర్యాప్తు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 3: ఇటీవల అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లావణ్య మృతిపై పోలీసులు మరింత లోతైన విచారణ జరిపించాలని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అతిథిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సంఘటనపై పోలీసులు నిష్పక్షపాత విచారణ జరిపించాలన్నారు. అలాగే ఇప్పటి వరకూ పోలీసులు జరిపిన విచారణపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివరాలు వెల్లడించాలన్నారు. ఒక మహిళగా లావణ్య మృతిపై తాను స్పందించానని ఆమె పేర్కొన్నారు. మృతురాలి సమీప బంధువు దివ్య మొదటిసారిగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకుని, విచారణలో ముందుకు సాగాలని సూచించారు. అలాగే జరిగిన సంఘటనపై ప్రజల వద్ద ఉన్న సాక్ష్యాలను పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దేవాలయాల వద్ద మహిళలపై పెరుగుతున్న వేధింపులు, ఇతర అంశాలపై పోలీసులు దృష్టి సారించాలన్నారు.