విశాఖపట్నం

రాష్ట్భ్రావృద్ధికి ఉద్యోగులు కసితో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 3: ఆంధ్ర రాష్ట్భ్రావృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు కసితో పని చేయాలని విశాఖపట్నం ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎయు ప్లాటినం జూబ్లీ సెనేట్ హాలులో ‘అశాస్ర్తియ విభజన, రాష్ట్రంపై దాని ప్రభావం, తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులు కడుతున్నందున రాష్ట్రంలో రైతులు పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు పరిశోధన, ప్రయోగశాలలు, ఇక్రిశాట్ సంస్థలు హైదరాబాద్‌లో ఉండటం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కరవుభత్యం, ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నామన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఉద్యోగులు రాష్ట్భ్రావృద్ధికి కసితో పనిచేయాలన్నారు. అమరావతి రాజధానికి రైతులు భూములను స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. ఈ నెల 27వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులు అమరావతి తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమరావతికి వచ్చే ఉద్యోగులకు వౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో రాష్ట్భ్రావృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగి దాలినాయుడు మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసమే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై నియమించిన శ్రీ కృష్ణకమిటీ నివేదికను బుట్టదాఖలు చేయడం రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందనడానికి నిదర్శనమన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రిని రోల్‌మోడల్‌గా తీసుకుని, కసితో పనిచేసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అధిగమించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. తెలంగాణలో రాష్ట్ర ఉద్యోగులకు పని వాతావరణం లేనందున, అమరావతి రాజధానికి తరలిరావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. విశాఖ ఎపీఎన్జీవో పట్టణ అధ్యక్షుడు కూర్మారావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీఎన్‌జీవోలు ముందు ఉంటూ ఉద్యమం నడిపించారన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. కేంద్రం విశాఖకు రైల్వేజోన్ మంజూరు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, స్పెషల్ ప్యాకేజీకి నిధులు, హుదుద్ తుపానుకు ఇస్తామన్న నిధులు, రెవెన్యూ లోటుకి నిధులు మంజూరు చేయాలన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు, ప్రయోజనాలు పొందేందుకు ప్రజా ప్రతినిధులు కేంద్రంతో పోరాడి తమ వంతు కృషి చేయాలన్నారు. మలేరియా సబ్ డివిజన్ ఉద్యోగి జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన విద్యార్థులు తాము అనుకన్న ప్రముఖ యూనివర్సిటీల్లో చదవడానికి అవకాశం కోల్పోయారన్నారు. రాష్ట్ర మనుగడకు ప్రతిఒక్కరు పోరాడాలన్నారు. తెలుగువాళ్ళు ఉమ్మడి రాష్ట్రాల్లో మద్రాస్‌ను, హైదరాబాద్‌ని అభివృద్ది చేసారన్నారు. ముఖ్యమంత్రి విజన్‌తో 2050 నాటికి రాష్ట్భ్రావృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేసారన్నారు. రాష్ట్రానికి అర్టికల్ 371-డి కింద ప్రత్యేక కేటగిరీ కింద కేంద్రం నుండి వచ్చే ప్రయోజనాలు పొందడానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు.