విశాఖపట్నం

జివిఎంసి ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూన్ 3: ప్రభుత్వం ఇచ్చిన జీవో 279ని రద్దు చేయాలని కోరుతూ మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు జివిఎంసి కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు జి.సుబ్బారావు అధ్యక్షత వహించారు. కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఈ జీవోనిచ్చి పారిశుద్ధ్య కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తోందన్నారు. కార్మికులు చేస్తున్న పనిని కాంట్రాక్టర్‌కి అప్పగించి, కాంట్రాక్టర్ వర్కర్ బదిలీ, వర్క్ కాంట్రాక్టర్‌కి అప్పగించాలని చూస్తుందన్నారు. దీనివలన కార్మికులను తగ్గించడంతో పాటు యంత్రాలతో పనులు చేయించి, కార్మికులను తొలగించి ప్రజలపై భారీగా పన్ను రూపంలో భారం వేయాలని చూస్తుందన్నారు. కార్మికులు, ప్రజలకు నష్టదాయకమైన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యూనియన్ గౌరవ అధ్యక్షులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు కార్మికలు, ఉద్యోగులు వద్దకు వచ్చి తాను మారానంటూ చెప్పుకున్నారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో అధికారంలోకి వచ్చి, ఇచ్చిన మాట మరిచారన్నారు. ఇపుడు ఉన్న ఉద్యోగాలను ఊడదీసే పనిలో ఉన్నారన్నారు. ఇందులో భాగంగానే ఈ జీవో విడుదలగా పేర్కొన్నారు. దీనిపై పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వేలాది మంది కార్మికులు ఇందులో పాల్గొన్నారు. యూనియన్ ప్రతినిధులు టి.నూకరాజు, ఎస్.రమణ, యు.రాజు, ఎం.ఈశ్వరరావు, నాయుడు, లక్ష్మణరావు, శశిరేఖ, సూరిబాబు, రత్నం పాల్గొన్నారు.