విశాఖపట్నం

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 3: రానున్న కృష్ణా పుష్కరాలకు విశాఖ నుంచి తగినన్ని రైళ్ళు నిర్వహించాలని ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ నిర్ణయించింది. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల మాదిరి ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నుంచి 12 రోజులపాటు జరగనున్న కృష్ణా పుష్కరాలకు కాస్తంత ముందుగానే భక్తులకు రైళ్ల సదుపాయం కల్పించాలని డివిజన్ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాయగడ తదితర ప్రాంతాల నుంచి కృష్ణా పుష్కరాలకు వెళ్ళాలంటే విశాఖ మీదుగా నడిచే రైళ్ళపైనే ఆధారపడాలి. అందువల్ల విశాఖ నుంచి ఎక్కువ సంఖ్యలో ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ళను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకు తగినన్ని రైళ్ళను సకాలంలో నడపడటం ద్వారా ప్రయాణికులు నుంచి రైల్వే అధికారులు మన్ననలు పొందగలిగారు. ప్రశంసల జల్లు కురిపించారు. అన్ని వర్గాల ప్రజానీకం రైళ్ళ సౌకర్యంపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అదే క్రమంలో ఈ ఏడాది జరిగే కృష్ణా పుష్కరాలకు తగినన్ని రైళ్ళను నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దేశ నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇదే తరహాలో పలు రాష్ట్రాల నుంచి విశాఖ మీదుగా కృష్ణా పుష్కరాలకు తరిలి వెళ్ళే భక్తుల కోసం 70 నుంచి 90 ప్రత్యేక రైళ్ళను నిర్వహించాలని వాల్తేరు డివిజన్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భక్తుల నుంచి లభించే ఆదరణను బట్టి మరికొన్నింటిని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న పాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో కొన్నింటికి అదనపు కోచ్‌లు తగిలించడంపై అధికారులు చర్చిస్తున్నారు. కృష్ణా పుష్కారాలకు నడిపే ప్రత్యేక రైళ్ళకు సంబంధించి త్వరలో అధికారులతో డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ సమావేశమవుతున్నట్టు తెలిసింది.
వందకు పైగానే ఆర్టీసీ బస్సులు
విశాఖ నుంచి విజయవాడకు కనీసం వంద ప్రత్యేక బస్సులు నిర్వహించేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ ఆలోచన చేస్తోంది. తొలిదశలో వంద ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించి భక్తుల నుంచి తగిన ఆదరణ లభిస్తే మరికొన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలని సంబంధితాధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్లతో పాటు మరిన్ని ఏర్పాటు చేయడం, నగరంలోని ఎంవిపి కాలనీ, మధురవాడ, గాజువాక, సింహాచలం, ఎన్‌ఎడి జంక్షన్, మద్దిలపాలెం తదితర ప్రధాన కూడళ్ళ నుంచి వీటిని నిర్వహించాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రైవేటు బస్సులకు ధీటుగా వీటిని నడపాలని కూడా అధికారులు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. కాగా గత ఏడాది గోదావరి పుష్కరాలకు దాదాపు కోటిన్నర మంది భక్తులు తరలి వెళ్ళగా, కృష్ణా పుష్కరాలకు దీని కంటే ఎక్కువుగానే వెళ్లే అవకాశాలపై ఆర్టీసీ రైల్వే అధికారులు అంచనాలు వేస్తున్నారు.