విశాఖపట్నం

29 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 9: విశాఖ నగరం నాల్గవ వార్డు పోతినమల్లయ్యపాలెం గిరిపై 13 ఏళ్ళ కిందట వెలసిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతోంది. స్వామి వారి చతుర్ధశ వార్షికోత్సవ సహిత పరిత్రోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవోతపేతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు ప్రధాన అర్చకులు ఫణిహారం వేంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్త తమ్మన వెంకట రమణమూర్తి పర్యవేక్షణలో జరిగే బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మానవ వనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాసరావులు ముఖ్యఅతిథులుగా పాల్గొంటారు. 29న సాయంత్రం ఆరు గంటలకు ఆలయ ప్రదక్షిణ, మంగళ ద్రవ్యాలతో విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణలు, మంగళాశాసనం, తీర్ధప్రసాదవితరణ, 30న ఉదయం ఆరు గంటలకు తొలిపూజ, స్వామివారి ఊరేగింపు బేడా సేవ, యాగశాల ప్రవేశం, అవాహనాలు, అర్చన, పవిత్ర ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠ, ద్వాదవస్వపనం, పంచామృతాభిషేకాలు, ద్వజారోహణం, తీర్థ ప్రసాద ఘోష్ఠి వంటి కార్యక్రమాలు వరుసగా జరుగుతాయని ఆలయ అధికారి గురువారం ప్రకటనలో తెలిపారు. అలాగే వచ్చేనెల ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటలకు తొలిపూజ, బేడాసేవ, యాగశాల అర్చన, కళ్యాణోత్సవ సంబరాలు, మంగళాశాసనం, తీర్ధప్రసాద వినియోగం, సాయంత్రం నాలుగు గంటలకు స్వామి తిరువీధి (ఊరేగింపు) శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి తిరుక్కళ్యాణాలుంటాయన్నారు. వీటితోపాటు 2, 3తేదీల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు స్వామి వారి సుప్రభాతం, తొలిపూజ, ప్రధానార్చన, ద్విఅర్చన, రాత్రి ఏడుగంటలకు సాయంకాలార్చన, ప్రతి శుక్రవారం విశేష పంచామృతాభిషేకం ఉంటాయన్నారు. ఈ మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.