విశాఖపట్నం

మన్యం అభివృద్ధిని అడ్డుకున్న ప్రభుత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 10: విశాఖ గిరిజన ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వమే అడ్డుకుందని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆరోపించారు. పాడేరులోని తన నివాస గృహంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం మంజూరైన పనులను రద్దుచేసి గిరిజనులకు తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. మన్యాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల పనులను ప్రస్తుత టిడిపి ప్రభుత్వం రద్దు చేసిందని బాలరాజు ఆరోపించారు. అభివృద్ధి పనులను, నిధులు మంజూరు చేయించామని, వీటిని ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వ హయాంలో చేసిన కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. తాను మంత్రిగా ఉన్నకాలంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి, వౌళిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయించామని చెప్పారు. పాడేరు నుంచి లోతుగెడ్డ వరకు 58 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ, అరకులోయలో రూ.5 కోట్లతో మోడల్ కమ్యూనిటీ భవనం, పాడేరు మండలం కిండంగిలో 3 కోట్ల 80 లక్షలు, చింతపల్లి మండలం తాజంగిలో ఎనిమిది కోట్లు, బైలుకించంగిలో నాలుగు కోట్లు, బాలారంలో నాలుగు కోట్ల్లతో రక్షిత మంచినీటి పథకాలు, గూడెంకొత్తవీధిలో గురుకుల బాలికల డిగ్రీ కళాశాల, చింతపల్లిలో వంద పడకల ఆసుపత్రి, పాడేరులో బి.ఇడి. కళాశాల, అరకులోయ, చింతపల్లిలో స్టేడియంలు, చింతపల్లిలో 133.కె.వి. సబ్‌స్టేషన్, కోటి రూపాయలతో పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానం అభివృద్ది విశాఖలో పోస్టుమెట్రిక్ వసతి గృహాలు ఎన్నో ముఖ్యమైన వాటిని మంజూరు చేయించడమే కాకుండా వీటి నిర్మాణాలకు నిధులు విడుదల చేయించామన్నారు. గత ఎన్నికల నాటికి తాము మంజూరు చేసిన పనుల్లో కొన్ని ప్రారంభం కాగా, మరికొన్ని ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు కాంగ్రెస్ మంజూరు చేసిన ముఖ్యమైన పనులను అర్థాంతరంగా రద్దు చేశారని, ప్రారంభమైన వాటిని నిలిపివేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావచ్చినా ఇంతవరకు ఏ ఒక్కటి చెప్పుకోదగ్గ కార్యక్రమాన్ని చేయలేకపోయారని ఆయన విమర్శించారు. గిరిజనులకు ఎంతో ఉపయోగపడే పనులను ప్రభుత్వం ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పడమే కాకుండా చంద్రబాబు రెండేళ్లలో చేసిన ఘనకార్యాలను వివరిస్తూ శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి నిలదీస్తున్న వారిపై వివక్ష చూపిస్తూ అక్రమ కేసులు బనాయి ంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తాము చూస్తూ ఊరుకోజాలమని, ఎన్ని నిర్బంధాలు విధించినా, కేసులు బనాయించినా రోడ్డెక్కి పోరాటం చేస్తామన్నారు. జిల్లా అధికార యం త్రాంగం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేసే వారిని నిర్బంధించడం ఎక్కడ ప్ర జాస్వామ్యమని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై, ప్రభుత్వ చేతకాని విధానాలను చాటి చె ప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.
తమ పార్టీ జాతీయ నాయకుడు రాహూల్ గాంధీ ఈ నెలలో విశాఖ ఏజెన్సీలో పర్యటించనున్నట్టు బాలరాజు చెప్పారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.