విశాఖపట్నం

ఎడ్యుకేషన్ హబ్‌గా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, జూన్ 10: విద్యా హబ్‌గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోగల లా రెస్ ల్యాబ్స్ యాజమాన్యం సుమా రు 35లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించి న మార్కెట్ యార్డ్‌లో షెడ్లును శుక్రవా రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వి ద్యా సంస్థలకు జిల్లా వ్యాప్తంగా 1100 ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. ఇప్పటికే 800 ఎకరాల స్థలాల్లో వివిధ యూనివర్సిటీల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 200 ఎకరాల స్థలంలో పెట్రో యూనివర్సిటీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాను అ భివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేలు పూర్తి స హాయ సహకారాలను అందిస్తున్నారన్నారు. వేసవిలో ప్రజల నీటిఎద్దడి నివారణకు జిల్లా వ్యాప్తంగా 45 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు కలెక్టర్ తెలిపా రు. పారిశ్రామికంగా విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రధానంగా పరవాడ ప్రాంతం పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు దూసుకు వెళ్తుందన్నారు.
అనకాపల్లి- ఆనందపురం రహదారి అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధికి అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. అనకాపల్లి- ఆనందపురం ర హదారి విస్తరణ పనులకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహాయ సహకారాలను అందించాలని కోరారు. స్వచ్ఛ్భారత్‌లో పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చే స్తామన్నారు. పెందుర్తి నియోజకవర్గా న్ని స్మార్ట్ నియోజకవర్గం అభివృద్ధి చే సేందుకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి అధికంగా పారిశ్రామిక వేత్తలు సిఎస్‌ఆర్ నిధులు మం జూరు చేస్తున్నారన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో పలు పరిశ్రమలు పరిసర గ్రామాల అభివృద్ధికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. ఫార్మాసిటీలోగల అన్ని పరిశ్రమలు గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లారెస్ ల్యాబ్స్ సిఇఓ డాక్టర్ సి.సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్‌లో లారెస్ ల్యాబ్స్ యాజమాన్యం ముందు ఉంటుందన్నారు. పరవాడ సర్పంచ్ చుక్క రామునాయుడు మాట్లాడుతూ పరవాడలో మంచినీటి ఎద్దడి ఉందని, దీనిని నివారణకు ఎమ్మెల్యే బండారు, జిల్లా కలెక్టర్ యువరాజ్ చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మార్కెట్ యార్డ్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటిసి సభ్యులు పయిల జగన్నాధరావు, తహశీల్దార్ మల్లేశ్వరరావు, ఎంపిటిసిలు పయిల శ్రీనివాసరావు, సిరపురపు అప్పలనాయుడు, లారెస్ ల్యాబ్స్ ప్రతినిధి రవికుమార్, సి.నర్సింగరావు పాల్గొన్నారు.