విశాఖపట్నం

స్మార్ట్ రైల్వేస్టేషన్‌కు కొత్త కళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 10: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరిధిలోకి వచ్చే వాల్తేరు డివిజన్ ప్రాధాన్యత రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్ర విభజన తదుపరి గత రెండేళ్ళ కాలంలో ఊహించని విధంగా అభివృ ద్ధి చెందిన ఈ స్టేషన్‌కు త్వరలో హైస్పీడ్ రైలు రానుంది. ఇది రానున్న కొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. దీనిపై ఇటీవల కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేశ్ ప్రభాకర్ ప్రభు విజయవాడలో అధికారిక ప్ర కటన చేశారు. ఇదేతరహాలో గత కొనే్నళ్ళుగా పెండింగ్‌లోనున్న అరకు అద్దాల రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. బహు శా వచ్చేనెలాఖరి లోపు దీనిని ప్రారంభిస్తారని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ రైల్వే టూరిజం డెవలెప్‌మెం ట్ కార్పొరేషన్(ఐఆర్‌సిటిసి) ఆధ్వర్యం లో నిర్వహించే ఈ రైలు ఏసి అద్దాలతో ఉంటుంది. ప్రస్తుతం నడిచే అరకు రైలు కు రెండు లేక మూడు అద్దాలతో కూ డిన ఏసి కోచ్‌లు తగిలిస్తారు. ఈ విధం గా ఉండే కోచ్‌ల్లో కనీసం 150 మంది ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉంటుం ది. దేశ, విదేశీ పర్యాటకులను విశేషం గా ఆకర్షించే దీని ద్వారా తూర్పు కనుమల అందాలను పర్యాటకులు ప్రత్యక్ష ంగా వీక్షిస్తూ అనుభూతిని పొందవ చ్చు. అలాగే అరుకు పరిసర ప్రాంతాలను తిలకించవచ్చును. అలాగే విశాఖ నుంచి రాజధాని అమరావతికి మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ విధంగా విశాఖ రైల్వేస్టేషన్ ఇపుడు ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. గత రెండేళ్ళుగా రైల్వేవర్గాలు సైతం ఊహించని విధంగా అనేక రకాలైన అభివృద్ధిని సాధిస్తుంది. వాల్తేరు డివిజన్‌లో ప్రధానమైన విశాఖ రైల్వేస్టేషన్ స్మార్ట్ స్టేషన్‌ను పురోభివృద్ధి సాదిస్తోంది.
లాగే విమానాశ్రయాల తరహాలో ముఖ్యమైన రైల్వేస్టేషన్లను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తున్నట్టుగా చేసిన ప్రకటన మరింత ఉత్సవాన్ని నింపుతోంది. పుష్కలమైన నిధులున్నా ఏనాడూ కనీస వసతులకు సైతం నోచుకోని విశాఖ రైల్వేస్టేషన్ ఇపుడు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ప్రగతి పథంలో పరుగులు పెడుతుంది. స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారం నుంచి ఎనిమిదో ప్లాట్‌ఫారం వరకు ఇప్పటికే విస్తరింపబడగా, వారం రోజుల కిందటనే జ్ఞానాపురం మార్గంలో ప్రధానమైన మార్గాన్ని విశాఖ ఎంపీ హరిబాబు ప్రారంభించారు. రెండు ఎస్కేలేటర్లు, నాలుగు ఫ్లైఓవర్లు బ్రిడ్జిలతో 50కిపైగా సిసి కెమెరాలు కలిగి ఉన్న ఈ రైల్వేస్టేషన్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్-స్వచ్ఛ స్టేషన్ పేరుతో నిరంతరం పరిశుభ్రంగా ఉంచగలుగుతున్నారు. పరిశుభ్రతను పాటించడం కోసం రైల్వే ఉద్యోగులు, కార్మికులు, అధికారులు భాగస్వాములు కావడం విశేషం. పరిశుద్ధ తాగునీరు, పటిష్ట భద్రతా చర్యలు, అవసరమైనన్ని జనరల్ బుకింగ్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి.