విశాఖపట్నం

స్మార్ట్ పల్స్ సర్వేకు ఏర్పాట్లు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆర్థిక, సామాజిక సర్వే (స్మార్టు పల్స్ సర్వే)కు అవసరమైన ట్యాబ్లెట్లు, సిబ్బందిని సత్వరమే సమకూర్చాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. స్మార్టు ఫల్స్ సర్వేపై సిసిఎల్‌ఏ, ఐటి శాఖల ఉన్నతాధికారులు సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి సర్వేను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే డాటా ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేందుకు ఎన్‌ఐసి అధికారులపైనే పూర్తిగా ఆధార పడకుండా, ఒక ప్రైవేటు ఏజెన్సీని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ఈ డాటాను సేకరించేందుకు ఒక నిర్ణీత ప్రొఫార్మాను, సాప్టువేర్‌ను జిల్లాలకు అందజేయాలన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశమై బ్లాక్‌ల విభజన, ఎన్యూమరేషన్ బృందాల ఏర్పాట్లు, ట్యాబ్లెట్లు, సిబ్బందిని సిద్ధం చేయడం తదితర అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడతూ ఎన్యూమరేషన్ బృందాల ఏర్పాటు అవసరమైన సిబ్బందిని అన్ని శాఖల నుండి సేకరించాలని ఆదేశించారు. శాఖల వారీగా సిబ్బంది పేర్లు, హోదా తదితర వివరాలతో ఎన్యూరేటర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. జివిఎంసి పరిధిలో సర్వేకు 1150 ట్యాబ్లెట్స్ వెంటనే ఎన్యూమరేషన్ బృందాలకు సమకూర్చేందుకు విద్య, ప్రణాళికా, వైద్య, ఆరోగ్యం, మెప్మా, డిఆర్‌డిఏ తదితర శాఖల నుండి వెంటనే సేకరించి ఎన్యూమరేషన్ బృందాలకు అందజేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఒక సాప్టువేర్‌ను రూపొందించడం జరిగిందని, దానిని సేకరించాలని ఎన్‌ఐసి అధికారి పాషాను కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జె.నివాస్, జెసి-2 డివి రెడ్డి, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, జివిఎంసి డిప్యూటీ కమిషనర్ వి.రవీంద్ర, ముఖ్య ప్రణాళికా అధికారి శాస్ర్తీ, డ్వామా పిడి శ్రీరాములు నాయుడు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.