విశాఖపట్నం

చురుగ్గా సాధికార సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే రెండో రోజు గ్రామీణ విశాఖ, నగర పరిధిలో శనివారం చురుకుగా సాగింది. తొలి రోజు సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొంతమేర గందరగోళం ఏర్పడగా, సర్వే అనుకున్న విధంగా సాగలేదు. కేవలం ప్రముఖుల వివరాలను మాత్రం నమోదు చేసిన ఎన్యుమరేటర్లు సాంకేతిక వైఫల్యంతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయారు. వివరాల సేకరణతో పాటు ఎన్యుమరేటర్లకు ఇచ్చిన ట్యాబ్‌లలో అన్ని అంశాలను పొందుపరచి, యాప్ అందుబాటులో ఉంచడంతో రెండో రోజు నమోదు ప్రక్రియ ఆశాజనకంగా జరిగింది. సంయుక్త కలెక్టర్ జె నివాస్ ఎన్యుమరేటర్ల అనుమానాలు స్వయంగా అడిగి తెలుసుకుని నివృత్తి చేశారు. తన కుటుంబ సభ్యుల వివరాలను ఆయనే స్వయంగా ట్యాబ్‌లో నమోదు చేశారు. అయితే చంద్రన్న బీమా యోజన పథకం కింద బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు సాధికార సర్వేలో పేర్కొన్నప్పటికీ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఎన్యుమరేటర్లు తికమకపడ్డారు. దీంతో జెసి నివాస్ కల్పించుకుని లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. సీతమ్మధారలోని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తన కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యుమరేటర్లకు అందజేశారు. ఐరిష్ తీసుకుని, ఎమ్మెల్యే కుటుంబీకుల వివరాలను జోన్ 2 కమిషనర్ నల్లనయ్య ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లు సేకరించారు. రెండో రోజు జిల్లాలో 1,025 కుటుంబాలను సందర్శించిన సాధికార సర్వే ఎన్యుమరేటర్లు 2,098 మంది సభ్యుల వివరాలు సేకరించారు. గ్రామీణ జిల్లాలో 591 కుటుంబాలకు సంబందించి 1,345 మంది సభ్యుల వివరారు, పట్టణ పరిధిలో 434 కుటుంబాలకు సంబందించి 1,053 మంది వివరాలను నమోదు చేశారు.