నల్గొండ

గ్రీవెనె్సస్‌డేలో వెల్లువెత్తిన వినతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 25 : జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయం నందు నిర్వహించే గ్రీవెనె్సస్‌డేలో వినతులు అధిక సంఖ్యలో వెల్లువెత్తాయి. తమ తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆయా శాఖల అదికారులకు వివిధ మండలాల్లోని గ్రామాల ప్రజలు వినతులను సమర్పించారు. ఎలాంటి టెండరు ప్రకటన లేకుండా అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీగా జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పట్టణంలో కొనసాగుతూ పదే పదే అదే ఏజేన్సీని రెన్యూవల్ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పిజె ఆర్ ఎంటర్‌ప్రైజెస్ పెరుమల్ల జనార్ధన్ ఏజేసి వెంకటరావుకు వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ బీబీనగర్ సబ్‌రిజిస్ట్రేషన్ లో పనిచేస్తే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను అక్రమంగా నల్లగొండ సబ్‌రిజిస్ట్రేషన్‌లో పనిచేయిస్తున్నారని, ఈఎస్‌ఐ, ఈపిఎఫ్ సర్వీసు టాక్సీలలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పట్టణ మున్సిపాలిటీలో సి ఓగా పనిచేస్తున్న నర్సింహ్మ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎస్సీ కార్పోరేషన్ లోన్ల విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని టి ఆర్ ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు కత్తుల రమేష్ ఏజేసికి వినతిని అందించారు. ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులకు తీసిపోని విధంగా అభివృద్ది పేరుతో రైతులను, ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారని టిపి ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింత నర్సింహ్మ ఏజేసికి వినతిని అందించారు. ప్రాజెక్టుల పేరుతో పెట్టుబడిదారులకు, పరిశ్రమలకు నీరు అందించాలనే తలంపుతో ప్రాజెక్టులను నిర్మిస్తూ బలవంతంగా భూములు గుంజుకోవడం అన్యామన్నారు. దీన్ని నిరసిస్తూ ర్యాలీలు చేస్తుంటే ఆ ప్రజలపై లాఠీచార్జీ చేయడం అమానుషమని ఏజేసికి వివరించారు.