నల్గొండ

31న కానిస్టేబుల్ పరీక్షకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 26 : ఈ నెల 31న నిర్వహించే టిఎస్‌పిఎస్‌సి కానిస్టేబుల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లకు సిద్దం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ పరీక్షలను అబ్జెక్టీవ్ టైపులో నిర్వహించడం జరగుతుందని తెలిపారు. ఈ పరీక్షలను జిల్లాలోని 71 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఈ పరీక్షకు 30,239 మంది అభ్యర్ధులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అదికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, అభ్యర్ధుల కోసం అదనపు ఆర్టీసి బస్సులు నడపాలని సూచించారు. ఈసమావేశంలో ఏజేసి వెంకట్రావు, డి ఆర్ ఓ రవినాయక్, టి ఎస్ పి ఎస్‌సి అదికారులు, ఆర్ డి ఓలు తదితరులు పాల్గొన్నారు.