నల్గొండ

సూర్యాపేట ఆర్డీవో హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 28: ఇటీవలే సూర్యాపేట ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన సి.నారాయణరెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపేడుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండోరోజే ఏరియా ఆసుపత్రిని, ఫైలేరియా విభాగాన్ని తనిఖీచేసి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉద్యోగులకు మోమో జారీచేశారు. కాగా గురువారం ఆర్డీవో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తనిఖీలు, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వివిధవర్గాలతో సమావేశాలు నిర్వహించి మార్పుదిశగా ముందుకు సాగుతున్నారు. పట్టణంలో ఇష్టారాజ్యంగా వాటర్‌ప్లాంట్లు నిర్వహిస్తున్న విషయం తన దృష్టికి రావడంతో పట్టణంలోని పలు వాటర్‌ప్లాంట్లను తనిఖీచేశారు. మంజీరా, త్రివేణి, సన్ వాటర్‌ప్లాంట్లతో పాటు మరికొన్ని ప్లాంట్లను తనిఖీచేసి నీటిని శుద్దిచేస్తున్న తీరును, ప్లాంట్లలో పారిశుధ్యాన్ని పరిశీలించారు. కొన్ని ప్లాంట్లలో అపరిశుభ్ర వాతావరణం కనిపించడంతో నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత పట్టణంలోని మీసేవా కేంద్రాలను తనిఖీచేసి వివిధ సేవలకు వసూళ్లు చేస్తున్న మొత్తంపై ఆరా తీశారు. నిబంధనలకు విరుద్దంగా అధిక మొత్తంలో ప్రజలనుండి డబ్బులు వసూళ్లుచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత సంక్షేమ వసతిగృహాలను తనిఖీ చేశారు. మధ్యాహ్నం తన కార్యాలయానికి చేరుకొని పట్టణంలోని వాటర్‌ప్లాంట్ల యాజమానులతో సమావేశం నిర్వహించారు. వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు అధికధరలు వసూళ్లు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఇక నుండి అక్రమ వసూళ్లు ఆపకపోతే ప్లాంట్లు సీజ్‌చేస్తానని హెచ్చరించారు. 20లీటర్ల క్యాన్‌ను ప్లాంట్ల వద్ద రూ.5కు విక్రయించాలని, ఇండ్లకు సరఫరాచేస్తే రూ.8చొప్పున వసూళ్లు చేయాలని ఆదేశించారు. వాటర్‌ప్లాంట్ల యాజమానులు మినరల్ అనే పదాన్ని తొలగించి ప్యూరిఫైడ్ పేరుతో విక్రయాలు జరపాలని సూచించారు. నీటిని సక్రమంగా శుద్దిచేసి సరఫరా చేయాలని ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రెడ్‌క్రాస్ సోసైటి సేవలపై సమీక్షించారు. రెడ్‌క్రాస్ సోసైటి ద్వారా సామాజిక సేవాకార్యక్రమాలను విస్తృతం చేయాలని కోరారు. ప్రతినెల విధిగా రెండు రక్తదాన శిభిరాలు నిర్వహించాలన్నారు. వైద్య శిభిరాలు ఏర్పాటుచేసి గ్రామీణ ప్రాంత పేదలకు వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో తహశీల్దార్ మహమూద్ అలీ, మున్సిపల్ కమీషనర్ వడ్డె సురేందర్, రెడ్‌క్రాస్ సోసైటి వైస్‌చైర్మన్ ఇరిగి కోటేశ్వరి, రెడ్‌క్రాస్ డాక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు.