నల్గొండ

పుష్కర భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 29: కృష్ణా పుష్కరాల కోసం వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కృష్ణా పుష్కర ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతు గోదావరి పుష్కరాలు ఐదు జిల్లాల్లో జరిగితే కృష్ణా పుష్కరాలు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే జరుగుతున్నందున ఈ జిల్లాకు భక్తుల రద్దీ కోటిన్నర మేరకు ఉండవచ్చన్నారు. గతంలో కృష్ణా పుష్కరాలకు జిల్లాలో 11ఘాట్‌లు ఏర్పాటు చేయగా ఈ దఫా 28ఘాట్‌లు ఏర్పాటు చేస్తున్నామని పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆగస్టు 2వ తేదిలోపునే నూటికి నూరుశాతం పనులు పూర్తి చేయాలని, పార్కింగ్, హోల్డింగ్, మరుగుదొడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎంసిఆర్‌డి సంస్థ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ పుష్కర భక్తుల రద్ధీ నియంత్రణ, నిర్వాహణపై అధికార యంత్రాంగానికి సూచనలందించారు. పుష్కర ఘాట్‌లలోని భక్తులు బయటకు వెళ్లడం మేరకు ఇతర భక్తులను లోనికి అనుమతించాలన్నారు. ఘాట్‌ల నుండి వెళ్లే భక్తులకు విస్తృత ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. స్నానాల అనంతరం దైవ దర్శనాల ఏర్పాటునుభక్తులు త్వరితగతిన పూర్తి చేసుకుని వెళ్లేలా చర్యలుండాలన్నారు. క్యూలైన్ల నిండా భక్తులను పంపకుండా ఖాళీ పాటించాలన్నారు. ఘాట్‌ల వద్ధ కొబ్బరికాయలు కొట్టనియవద్ధన్నారు. పుష్కర ప్రాంతాల్లో మంచినీరు, మరుగుదొడ్లు విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్‌ల వద్ధ ఇన్‌చార్జిలు పాటించాల్సిన పద్ధతులు, ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు పాటించాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, జెసి ఎన్. సత్యనారాయణ, ఎజెసి వెంకట్రావు, డిఆర్‌వో రవినాయక్ పాల్గొన్నారు.