విశాఖపట్నం

హరితవనాలుగా ఆలయ భూములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూలై 29 : రాష్ట్రంలోని దేవాదాయ, దేవాలయాలకు చెందిన భూములను హరిత వనాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ వై.వి. అనురాధ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వనం- మనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కృష్ణాపురం ఉద్యాన వనం (గోశాల)లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనం - మనం కార్యక్రమంలో దేవాదాయశాఖ ప్రధాన పాత్ర పోషించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. దేవాదాయ, దేవాలయాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల ఏభైవేల ఎకరాల భూములున్నాయని ఆమె చెప్పారు. ఇందులో ఒక లక్షా ఏభైవేల ఎకరాలు వ్యవసాయ భూములు లీజుల్లో ఉన్నాయని, లక్ష ఎకరాలు బీడు భూములు, కొండలు, గుట్టల కింద మరో డెబ్భై వేల ఎకరాల భూములు ఉన్నాయని ఆమె తెలియజేసారు. ఈ నేపథ్యంలో ప్రధాన దేవాలయాల ఆధ్వర్యంలో సొంతంగా నర్సరీలు అభివృద్ధి చేసుకోవాలని ఆదేశించడం జరిగిందని ఆమె అన్నారు. గోశాలలు నిర్వహించుకుని గో వ్యర్థాలతో వనాలను సాగు చేసుకునేలా సూచనలు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. వనాల అభివృద్ధిలో సింహాచలం దేవస్థానం అన్నింటి కంటే ముందుండడం హర్షనీయమని ఆమె అన్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు లడ్డూ, పుస్తక ప్రసాదాలతో పాటు మొక్కలను ప్రసాదంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె ప్రకటించారు. శివాలయాల్లో మారేడు, విష్ణు ఆలయాల్లో తులసి మొక్కలను భక్తులకు ప్రసాదంగా పంపిణి చేస్తామని ఆమె చెప్పారు. దేవస్థానాలలో నక్షత్ర, పవిత్ర వనాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఆమె చెప్పారు. అన్నవరం దేవాలయంలో భక్తులకు ప్రసాదంగా మొక్కలు ఇవ్వడం ఇప్పటికే ప్రారంభమైందని ఆమె అన్నారు. దేవస్థానాలలో నర్సరీలు అభివృద్ధి చేసి వనాలు పెంచాలనుకునేవారికి అటవీశాఖ తరహాలో దేవాలయాలే మొక్కలు అందించేలా ప్రయత్నం చేస్తామని ఆమె అన్నారు. మొక్కలను నాటడం ఒక ఎతైతే వాటిని సంరక్షించుకోవడం ఎంతో ప్రధానమని ఆమె చెప్పారు. పసిపాపల్లా మొక్కలను పెంచి భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సెప్టెంబర్ మాసాంతానికి దేవాదాయశాఖ ఆధ్యర్యంలో ఎన్ని ఎకరాల్లో, ఎన్ని మొక్కలను సంరక్షించుకోగలిగామో లెక్కలుతోసహా ప్రకటిస్తామని కమిషనర్ ఆత్మవిశ్వాసంతో చెప్పారు.