విశాఖపట్నం

సరిహద్దుల్లో అగ్రనేతలు! వారోత్సవాలకు హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీది, జూలై 30: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సిపిఐ మావోయిస్టుల అమర వీరుల వారోత్సవాలు విజయవంతం చేసేందుకు లోతట్టు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తుంటే వాటిని అడ్డుకునేందుకు ఆంధ్రా ఒడిశా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. విశాఖ మన్యంలో మావోయిస్టు పార్టీని అభివృద్ధి చేసిన కుడుమల రవి, ఆజాద్, ఆనంద్, శరత్ జ్ఞాపకార్థం గూడెంకొత్తవీధి మండలం కుంకుంపూడి, ఒడిశా ప్రాంతాల్లో స్మారక స్థూపాలను నిర్మించి ఘనంగా నిర్వహించారు. దీంతో పాటు సరిహద్దు ప్రాంతంలో అగ్రనాయకులు మకాం వేసారన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అగ్రనాయకులే లక్ష్యంగా ఆంధ్రా - ఒడిశా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. గూడెంకొత్తవీధి, చింతపల్లి, సీలేరు, కొయ్యూరు, ముంచింగ్‌పుట్, మల్కన్‌గిరి సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యగా పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మావోయిస్టు అగ్రనేతలు సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నారనడానికి ఇటీవల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర డిజిపి ఇంద్రజిత్, ఐజి ఈ ప్రాంతంలో పర్యటించడం బలం చేకూరుతుంది. దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.

ప్రజలను మోసం చేశారు
* ప్రత్యేక హోదా కోరుతూ 2న రాష్ట్ర వ్యాప్త బంద్ * బిజెపి, టిడిపిపై ఎమ్మెల్యే బూడి విమర్శ
కె.కోటపాడు, జూలై 30: ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రజలకు వాగ్ధానాలు చేసి, అధికారంలోకి రాగానే కేం ద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. శనివారం ఆయన మండల వైసిపి అధ్యక్షుడు రెడ్డి జగన్‌మోహన్ ఇంట్లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూడి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్, వైసిపిలు దోబూచులాడుతున్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేక హోదా సాధించడంలో చిత్తశుద్ధి ఉంటే వారి కేంద్ర మంత్రులను రాజీనామా చేయించి మాట్లాడాలన్నారు. రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడిన ప్రకారం ఆంధ్రాకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం కన్పించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వచ్చే ఆగస్ట్ 2వ తేదీన వైసిపి రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చిందన్నారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ, ఈర్లె గంగునాయుడు, తర్రా శేషు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రుల ఆదేశాలు బేఖాతరు!
ఎమ్మెల్యే మాటకు విలువలేదు?
ప్రభుత్వ ఉత్తర్వులు పట్టవు?
నల్లబెల్లం రైతులపై వివక్ష
అధికారులపై వర్తకసంఘ కార్యదర్శి పెదబాబు ఆగ్రహం
అనకాపల్లి, జూలై 30: ముఖ్యమంత్రుల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యే మాటలకు విలువ లేకుండా, ప్రభుత్వం ఉత్తర్వులు పట్టించుకోకుండా కేవలం నల్లబెల్లం రైతులపైనే వివక్ష చూపుతున్న అధికారులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రవర్తిస్తున్న తీరుపై వర్తకసంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వర్తకసంఘ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో అనకాపల్లి వర్తక సంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) మాట్లాడుతూ నల్లబెల్లంపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఎన్ని పర్యాయాలు ఆదేశాలు జారీచేసినా నల్లబెల్లం వ్యాపారులపై దాడులు చేయడం అధికారులు విరమించుకోలేదని ఆయన అన్నారు. నల్లబెల్లంపై నిషే ధం విధించడం ద్వారా లక్షలాది రైతు కుటుంబాలు రోడ్డున పడతాయని, వారిని ఇబ్బంది పెట్టకూడదని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను వర్తకసంఘం తరఫున కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో నల్లబెల్లం నిషేధం వలన కలిగే ఇబ్బందులను దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దృష్టికి అప్పట్లో వర్తకసంఘం తీసుకెళ్ళింది. దీంతో నిషేధం ఎత్తివేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే దేశ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా అధికారులు వ్యవహరించడం బాధాకరమైన విషయమన్నారు. ఇక్కడి వ్యాపారులు ముఖ్యంగా రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వ్యాపారాలు చేస్తున్నారే తప్ప వారి స్వప్రయోజనాల కోసం వ్యాపారాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో రోజుకు లక్ష నుండి లక్షా 50వేలు వరకు బెల్లం దిమ్మలు దిగుమతి అయ్యేవని, ప్రస్తు తం 30వేల నుండి 50వేల లోపు కూడా బెల్లం దిగుమతులు కావడం లేదన్నా రు. మరోమాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలో కూడా నిషేధం ప్రవేశపెట్టారని అప్పటి ఎంపీ కొణతాల రామకృష్ణ నిషేధం ఎత్తివేయకపోతే తాను రాజీనామా చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వానికి హుకుం జారీచేశారని దీంతో దిగివచ్చిన ప్రభు త్వం నిషేధాన్ని ఎత్తివేసినట్లు హుటాహుటిన ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అలాగే 2002లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న సమయంలో కూడా నిషేధం మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. దీంతో భారీస్థాయిలో ఆందోళనా కార్యక్రమాలు చేయడంతో మళ్లీ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. అయితే దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కర రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసినా ఈ ప్రాంత ఎక్సైజ్ అధికారులకు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వర్తకులతో కలసి ఎక్సైజ్ కమిషనర్‌ను కలిసినప్పటికీ కూడా శాఖాపరంగా ఈ ఉత్తర్వుల వివరాలను వెల్లడించారన్నారు. అయినప్పటికీ అధికారుల్లో మార్పు లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్ని ఆర్డర్లున్నా అధికారులు వ్యాపారులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం, లేని పోని నిబంధనలు ఎందుకు తీసుకువస్తున్నారో తమకు తెలియడం లేదన్నారు. ఈ నల్లబెల్లం అనేది నిషేధించదగినది కాదని, ప్లాస్టిక్ వస్తువులు అంతకంటే కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా విధానం ఒకలా, ఎక్సైజ్ అధికారుల విధానం మరోలా ఉండటానికి గల తేడా ఏమిటో బహిరంగంగా చెప్పాలని పెదబాబు డిమాండ్ చేశారు. వర్తకులపై కక్షసాధింపు చర్యలు అధికారులకు ఉంటే రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మార్క్‌ఫెడ్ ద్వారా ఇబ్బంది లేని రీతిలో కొనుగోలు చేయాలని, దాడులు ఆపాలని పెదబాబు కోరారు. ఈ విలేఖర్ల సమావేశంలో ప్రముఖ వర్తకులు కర్రి సన్యాశినాయుడు, యిమ్మిడిశెట్టి శరత్‌కుమార్, శరగడం నాగబాబు, దొడ్డి నూక అప్పారావు, ఆళ్ల నాయుడు, శరగడం నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసాధికార సర్వే సకాలంలో పూర్తి చేయాలి
* జివిఎంసి కమిషనర్ హరినారాయణన్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 30: రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వే సకాలంలో పూర్తి చేయాలని అధికారులను జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ తెలిపారు. జివిఎంసి కాన్ఫరెన్సు హాల్ లో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తి చేయాలని, దీనిని విజయవంతం చేసందుకు సహకరించాలని కోరారు. యుసిడి పిఒ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ 1051 బృందాలతో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆశించినంత వేగం గా సర్వే జరగడం లేదన్నారు. లోపాలను సవరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ ఎడిసి జెన్ జివివిఎస్ మూర్తి, ఎడిసి ఫైనాన్స్ ఎస్‌ఎస్ వర్మ, ఎడిసి ప్రాజెక్టు మోహనరావు, మ్యూజి యం క్యూరేటర్ పాత్రుడు, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
పూడికతతకు చర్యలు
క్షేత్ర పర్యటనలో భాగంగా ఆయన శనివారం సీహార్స్ జంక్షన్, జగదాంబ, కుమ్మరి వీధి, పూర్ణామార్కెట్, శాలిపేట, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీహార్స్ కూడలిలో ఎస్‌ఎల్ కాలువలో పూడిక తీత చేపట్టాలన్నారు. 10 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. తాడివీధి, శాలిపేటల్లో చెత్త కింద పడి ఉండటం, డంపర్‌బిన్‌లను ఖాళీ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏరోజుకు ఆరోజు బిన్‌లను ఖాళీ చేసి ఫొటోలను అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ చక్రధరరావు, ఇఇ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
* బీసీ జనసభ అధ్యక్షుడు గంగాధర్
అనకాపల్లి(నెహ్రూచౌక్), జూలై 30: ఎన్నికల ముందు బీసీ కులాలకు ఇచ్చిన హామీలను సిఎం చంద్రబాబునాయుడు అమలు చేయాలని బిసి జనసభ అధ్యక్షుడు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక గోవిందరావు సమావేశం హాలులో శనివారం వాయిబోయిన శేఖర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్టస్థ్రాయి కార్పొరేషన్‌లు, పట్టణాభివృద్ధి సంస్థలు, మార్కెటింగ్ కమిటీలు, దేవాలయాలు, ట్రస్టీబోర్డులు మొదలగు ప్రభుత్వ నామినేటెడ్ పదవులను 33.3శాతం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సదుపాయాలు, కొత్త రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమస్యలన్నింటిపై సిఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ముం దు బీసీ కులాలకు ఇచ్చిన హామీలని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసారు. ఈ సమస్యలను పరిష్కరించని యెడల రాష్టవ్య్రాప్తంగా ఆందోళన చేసేందుకు బీసీ కులాల సభ్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా కన్వీనర్ యు. రాజారావు, బోడి వెంకట్రావు, సూదికొండ మాణిక్యాలరావు, అండబోయిన అప్పలరాజు, కోన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రుణమాఫీపై ప్రభుత్వం చిత్తశుద్ధి
* ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు
చోడవరం, జూలై 30: రైతుల రుణమాఫీ అమలు పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అన్నారు. శనివారం చోడవ రం పిఎసిఎస్ సభ్యరైతులకురుణమాఫీ, బీమా సొమ్మును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోడవరం పిఎసిఎస్ సభ్యరైతులకు ఇప్పటివరకు రెండుకోట్ల 20 లక్షల 31 వేల రూపాయలను రుణమాఫీ సొమ్ము ను అందజేయడం జరిగిందన్నారు. 2014-15 సంవత్సరంలో 1310మంది సభ్యరైతుల రుణా లు కోటి 82లక్షల 54 వేల రూపాయలు రుణమాఫీ జరగగా ప్రస్తుతం 463 మంది సభ్యులకు 37 లక్షల 74వేల రూపాయలు మాఫీ సొమ్మును చెల్లిస్తున్నామన్నారు. ప్రభు త్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు చిత్తశుద్ధితోనే రుణమాఫీ అమలు చేస్తుందని ఆయన తెలిపారు. అలాగే మరణించిన 11మంది సభ్యరైతులకు లక్షా 67 వేల రూపాయల బీమా సొమ్ము ను అందజేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు బొడ్డపాటి లక్ష్మణ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరణించిన సభ్యరైతుల కుటుంబానికి 20 వేల రూపాయల వంతున బీమా సొమ్మును అందజేయడానికి పాలకవర్గం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో గూనూరు లక్ష్మీనారాయణ, గుమ్మిడి శ్రీను, కె.సూర్యకాంతం, కామిరెడ్డి శ్రీరామ్మూర్తి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

గంజాయి పట్టివేత
* వేర్వేరు చోట్ల ఐదుగురి అరెస్టు * కారు, రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ ఫోన్లు సీజ్
జి.మాడుగుల, జూలై 30: పర్యాటకుల ముసుగులో మన్యం నుండి మైదానప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్థానిక పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏజెన్సీలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరుగుతుండటంతో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి 11 గంటల సమయం లో అన్నవరం వైపు నుండి వచ్చిన కారును పోలీసులు నిలుపుచేసి అందు లో ఉన్న వారి వివరాలు అడిగేసరికి తడబడతు సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి కారును సోదా చేయడంతో గంజాయి బయటపడింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం దుర్గంపేట గ్రామానికి చెందిన కర్నాటకం రామ కృష్ణ (20), చర్లపల్లికి చెందిన బ్లెరగేని మధు (22), గూడూరు మండలం పాలకుర్తికి చెందిన ఓలం రమేష్ (22) విశాఖ మన్యంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు వచ్చారని ఎస్‌ఐ వి.శ్రీనివాసరావు చెప్పారు. అరుకులోయ, బొర్రా, కొత్తపల్లి జలపాతం వంటి పర్యాటక ప్రాంతాలను చూసిన తర్వా త కొత్తపల్లి గ్రామంలో 80 కిలోల గం జాయిని వీరు కొనుగోలు చేసి శుక్రవారం వరంగల్‌కు ప్రయానమయ్యారు. గతంలో కూడా వీరు ఇదేమాదిరిగా కొన్ని సార్లు గంజాయిని తరలించడం తో ధైర్యంగా వెళ్లిపోవచ్చని భావిం చి మరోసారి గంజాయి రవాణాకు పాల్పడినట్టు ఎస్.ఐ. చెప్పారు. వీరిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశామని, వీరి నుంచి రూ. 5 వేల 200, మూడు సెల్ ఫోన్స్ స్వాధీ నం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అరెస్ట్ చేసిన వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఆయన చెప్పారు.
పెదబయలులో
పెదబయలు: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి పది కిలోల గంజాయిని, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ లాగబూసి గ్రామానికి చెందిన కూడ సత్యనారాయణ, మహమ్మద్ నాసిన్ కుజభంగి నుంచి రెండు ద్విచక్ర వాహనాలతో గంజాయిని తరలిస్తుండగా సీతగుంట పంచాయతీ రోగులపేట గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. గం జాయి రవాణా చేస్తున్న వీరితో పాటు మరో ఇద్దరు పరారైనట్టు ఎస్.ఐ. ఉమామహేశ్వరరావు చెప్పారు. అరెస్ట్ చేసిన వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్టు ఆయన తెలిపారు.

ఒక్క ఫోన్ కాల్‌తో వైద్యం
* ఐటిడిఎ ఇన్‌చార్జి పిఒ శివశంకర్
పాడేరు, జూలై 30: గిరిజన గ్రామాలలో వ్యాధులు ప్రబలినపుడు ఫోన్‌కాల్ చేస్తే వైద్య బృందాలను పంపిస్తామని పాడేరు ఐటిడిఎ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ చెప్పారు. ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్త్ కాల్ సెంటర్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని ఈ కాల్ సెంటర్‌కు ఫొన్ చేసి గ్రామాలలో వ్యాధుల విషయమై సమాచారం అందించాలని ఆయన సూచించారు. అతిసార వ్యాధి సోకినపుడు రోగులకు సకాలంలో వైద్యం అందించేందుకు ఆసుపత్రులకు తరలించేందుకు హెల్త్ కాల్ సెంటర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. సమాచారం అందించిన వెంటనే వైద్య సిబ్బందిని, అంబులెన్స్‌ను ఆయా గ్రామాలకు పంపించనున్నట్టు ఆయన చెప్పారు. గిరిజనులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ సురక్షిత నీటిని సేవించాలని ఆయన కోరారు. తాగునీటి వనరులు కలుషితమైతే అతిసార, మలేరియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. గ్రామాలలోని తాగునీటి వనరులను సర్పంచ్‌లు క్లోరినేషన్ చేయించాలని ఆయన సూచించారు. పంచాయతీలకు మంజూరైన పారిశుద్ధ్య నిధులతో మెరుగైన పారిశుధ్యపు పనులు చేపట్టాలని ఆయన ఆదేశించా రు. వారపు సంతల్లో నిల్వ ఉన్న చేప లు, మాంసం కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. గిరిజన గ్రామాల్లో వైద్య సిబ్బంది నిరంతరం పర్యటిస్తూ గిరిజనుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని, క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయని వారిపై చర్యలు తీసుకుంటామని శివశంకర్ హెచ్చరించారు.