విశాఖపట్నం

ప్రభుత్వ పథకాల పనితీరుపై ఇంటెలిజెన్స్ ఆరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల పనితీరుపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పథకాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? అర్హులకు అందుతున్నాయా? లేదా తదితర వివరాలను ఫొటోలతో సహా ఆధారాలు తీసుకెళుతున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు జిల్లాలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ, చంద్రన్న బీమా పథకం, సంచార వైద్యసేవ తదితర పథకాలతో పాటు ఉద్యోగులు, పింఛనుదారులకు అమలు చేస్తున్న నగదు రహిత ఉచిత వైద్య సేవలు తదితర అంశాలపై నేరుగా వారితో మాట్లాడి చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఆయా విభాగాల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాల కోసం ఇంటెలిజెన్స్ అందజేసే నివేదిక ఆధారంగా ఆయా శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి అధికారులు అందజేసే నివేదికలకు, జిల్లా స్థాయిలో ఉన్న నివేదికలకు సంబంధించి పలు రకాలైన వ్యత్యాసాలు ఉండడంతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు రకాల పథకాల కోసం కూడా సర్వే నిర్వహిస్తున్నట్టు సమాచారం. బృందంగా వచ్చి ఈ ఆకస్మిక తనిఖీల మాదిరిగా ఆరా తీయడంతో ఏ శాఖపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారోనన్న భయంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.