విశాఖపట్నం

తెలుగుభాష శ్వాస కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (కల్చరల్) ఆగస్టు 30: తెలుగుభాషా ప్రజలశ్వాస కావాలని పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఫణిశయన సూరి అన్నారు. తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన తెలుగు భాషాదీక్ష మంగళవారంతో రెండోరోజుకు చేరుకుంది. తెలుగుభాషా పండితులు, అభిమానులు, ఏయు తెలుగు విభాగం విద్యార్ధులు తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
ఆదివారం తెలుగువారంగా పాటించాలనే లక్ష్యసాధనకు చేపట్టిన లక్ష సంతకాల కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యవహర భాష ఉద్యమానికి అద్యుడైన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నిర్వహించే తెలుగుభాషా దినోత్సవం వస్తుందన్నారు. అన్ని భాషల్లోకెల్లా తెలుగు చాల ప్రాచీనమైనదన్నారు. ఫణిశయన సూరి దీక్షకు వచ్చిన వారితో తెలుగుభాష ప్రతిజ్ఞను చేయించారు. ప్రస్తుత తరం అంతా ఇంగ్లీష్ మీడియంతోలోనే చదువులు కొనసాగించడం వలన తెలుగుభాష ఔన్నత్యం విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తల్లిదండ్రులు కూడా తమను మమీ, డాడీ అని పిలిపించుకుంటూ మురిసిపోతున్నారని అమ్మా,నాన్న అన్న కమ్మని మాటలు పిలుపించుకోవడం లేదన్నారు. ఇక అధిక శాతం మంది ప్రజలు కూడా తమ సంతకాలను కేవలం ఇంగ్లీష్‌లోనే చేస్తున్నారన్నారు. ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన వారిలో ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్, విశ్రంతాచార్యులు ఇంద్రగంటి రామచంద్రమూర్తి, నండూరి రామకృష్ణ, భట్రాజుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.రవికుమార్, శివకుమార్, ఎల్.అనుసూయాదేవి, ఎన్.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.