విశాఖపట్నం

‘రైల్వే’ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధన అంశం అధికార తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలను తేటతెల్లం చేసింది. రైల్వేజోన్ అంశాన్ని ఎటూ తేల్చని కేంద్రం తీరుపై మండిపడ్డ టిడిపి తన అసంతృప్తి వెళ్లగక్కింది. జైట్లీ ప్రసంగం అనంతరం విశాఖ రైల్వేజోన్‌పై సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో ఉద్యమం తప్పదని విశాఖ బంద్‌కు సిద్ధపడ్డ మంత్రి అయ్యన్నపాత్రుడి వర్గాన్ని కౌంటర్ చేస్తూ మరో మంత్రి గంటా వర్గం గురువారం ప్రత్యక్ష ఆందోళనకు తెర తీసింది. దీనిలో భాగంగా ఎంపి ముత్తంశెట్టి ఒకరోజు దీక్ష చేస్తూ డిఆర్‌ఎంకు వినతిపత్రం ఇచ్చారు. ఇదే సందర్భంలో ఎంపిని ఇరుకున పెడుతూ ప్రత్యర్థివర్గం ప్రధాని మోదీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేసింది. దీంతో జోన్ రాజకీయం టిడిపిలో ఆద్యం పోసినట్లు అయింది
విశాఖపట్నం, సెప్టెంబర్ 8: జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎపికి ప్రత్యేక హోదా స్థానే ప్యాకేజీ ప్రకటించడంతోపాటు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ అంశంలో ప్రతిష్టంభనకు పాల్పడిన కేంద్ర వైఖరికి నిరసనగా అధికార టిడిపి ఆధ్వర్యంలో గురువారం జరిగిన నిరసన ప్రదర్శనే దీనికి సాక్ష్యం. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించలేదు. దీనికి ముందు విజయవాడ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఉంటుందంటూ కేంద్రం సూచనప్రాయంగా తెలిపింది. దీంతో విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోసం ఎన్నో ఏళ్ళుగా ఉద్యమిస్తున్న రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు, ఉద్యమానికి తెరతీసాయి. రాబోయేది విశాఖ కేంద్రంగా జివిఎంసి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అర్జుంటుగా టిడిపి కూడాజోన్ అంశంపై తీవ్రంగా స్పందించింది. అర్ధరాత్రివేళ కొంతమంది ఎమ్మెల్యేలతో మంత్రి అయ్యన్నపాత్రుడు చర్చించి విశాక కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించాలన్న డిమాండ్‌ను తెరమీదకుతెచ్చారు. అసెంబ్లీ సమావేశాలు అనంతరం విశాఖ రైల్వేజోన్ కోరుతూ విశాఖ బంద్ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణేశ్‌కుమార్ కార్యకర్తలకు సంక్షిప్ల సమాచారాన్ని పంపారు. ఇదే అంశాన్ని ఆలస్యంగా గుర్తించిన మంత్రి అయ్యన్న ప్రత్యర్ధివర్గం జోన్ ఉద్యమంలో తామే ముందుండాలని నిర్ణయించింది. ప్రత్యర్ధివర్గం జోన్‌పై ఉద్యమం అంశంలో తామే ముందుండాలని నిర్ణయించింది. ప్రత్యర్ధివర్గ కీలకనేత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉండటంతో ముఖ్య అనుచరుడు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావును రంగంలోకి దింపారు. కేంద్రం ప్యాకేజీ సహా జోన్ అంశంపై ప్రకటన వెలువరిస్తుందని బుధవారం నాటికి స్పష్టత రాగా అప్పటికే కలెక్టరేట్‌లో విద్యుత్ సమీక్షలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ శ్రీనివాస్ రైల్వేజోన్ ఏపీకే వస్తుంది కదా అంటూ సర్దిచెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేరోజు అర్ధరాత్రి మంత్రి అయ్యన్న జోన్ కోసం బంద్‌కు సిద్ధం అంటూ ప్రకటించగానే ప్రత్యర్ధివర్గం గత్యంతరంలేని పరిస్థితుల్లో ఎంపీ అవంతిని ముందుంచి అర్జుంటు ఉద్యమానికి శ్రీకారంచుట్టింది. దీనిలోభాగంగానే ఎంపీ అవంతి గురువారం ఒకరోజు దీక్ష చేపట్టారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించకపోతే పార్లమెంటు గడప తొక్కనంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఈనేపధ్యంలో మంత్రి అయ్యన్న వర్గానికి చెందిన కొంతమంది కార్యకర్తలు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని జోన్ కోసం ఎంపీ పోరాడాలని అవసరమైతే రాజీనామాకైనా సిద్ధపడాలంటూ నినాదాలు చేశారు. అయితే ఎంపీ అవంతి దీక్షలో భీమిలి, పెందుర్తి, నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతోపాటు విద్యార్ధులు పాల్గొన్నారు.