విశాఖపట్నం

సిఎం వరాల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక/అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబర్ 23: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరవాడ పర్యటనలో వరాలు కురిపించారు. పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి జరుగుతున్న పరవాడలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. యలమంచలి-గాజువాక రహదారిని దేశపాత్రునిపాలెం నుండి అచ్యుతాపురం వరకు అభివృద్ధి చేసేందుకు చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో భాగస్వామ్యం చేస్తామన్నారు. ముత్యాలమ్మపాలెం సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.వాడచీపురుపల్లి నుండి ముత్యాలమ్మపాలెం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణకు చర్యలు తీసుకుంటామన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పెదగంట్యాడ మండలంలో గల వక్ఫ్‌బోర్డు భూసమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హుధుద్ తుపాన్‌లో భాగంగా మంజూరైన 630 ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మధువాడ, శంఖరం, నేరళ్లవలస వద్ద అసంపూర్తిగా ఉన్న గృహసముదాయాలను పూర్తి చేసేందుకు సుమారు 13కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కురిపించిన వరాలు జల్లుకు పరవాడ ప్రాంతం టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.