విశాఖపట్నం

కోస్టల్ కారిడార్‌తోనే ఎపి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: విశాఖ-చెన్నై కోస్టల్ కారిడర్ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ పటం ఛాంబర్ ఆఫ్ కామర్స్, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటుచేసిన ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫెయిర్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ-చెన్నై కారిడార్ దేశానికి తలమానికం కానుందన్నారు. ఈ పారిశ్రామిక కారిడార్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం మారిపోతుందన్నారు. విశాఖ నగరం వ్యాపార అభివృద్ధికి అనువైన ప్రాంతంగా అభివర్ణించారు. విశాఖలో విమానాశ్రయం, పోర్టు, రైల్వే రవాణాకు అనువైందన్నారు. ఆయన ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావించే కంపెనీలకు ఇటువంటి ట్రేడ్ ఫెయిర్‌లు ఉపకరిస్తాయన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పలు సంస్థలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం వారి ఉత్పత్తులు ప్రదర్శించడం శుభపరిణామమన్నారు. దేశ ప్రధాని మోదీ పాలన తయారీరంగానికి, పారిశ్రమీకరణకు, డిజిటల్‌లైజేషన్‌కు పెద్దపీట వేస్తుందన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచిత తొమ్మిది శాతం ఆర్ధికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఒకే జాతి, ఒకే బడ్జెట్, ఒకే పన్ను విదానాన్ని బీజెపి ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందన్నారు. దేభాభివృద్ధికి, ప్రపంచీకరణ పోటికి అనుగుణంగా కాలం చెల్లిన చట్టాలకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. ఇప్పటి రూ.2.25 లక్షల కోట్లు ప్రయోజనాలు కల్పిస్తున్నటుట వెల్లడించారు. కేంద్ర, వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆసియామార్కెట్‌లో 40 శాతం లావాదేవీలు భారత్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. మోదీ పాలనతో ప్రపంచ దేశాల్లో భారత్ ధృవతారగ నిలుస్తుందన్నారు. విశాఖ, చెన్నై కారిడర్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని భావిస్తున్నామన్నారు. ఇందుకోసం ఏసియన్ బ్యాంకు రుణం తీసుకోనున్నట్టు భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, విశాఖ పటం ఛాంబర్ కామర్స్ అధ్యక్షు సుధీప్ గోష్, విశాఖ పటం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలుత కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్‌లు ట్రేడ్ ఫెయిర్‌ను ప్రారంభించారు.