విశాఖపట్నం

గ్రేట్ ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా చెయ్యాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాపట్నం, సెప్టెంబర్ 23 : రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేందుకు అందరూ కష్టపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల వరకు అందరు కలసి కట్టుగా పని చెయ్యాలన్నారు. ఏ స్థాయి వారైనా నియంతలా వ్యవహరిస్తే సహించేది లేదదన్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. ప్రజలతో మమేకమై పని చేయాలన్నారు.
స్వాగతం, వీడ్కోలు
విశాఖలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు విశాఖ చేరుకున్నారు. మంత్రి గంటా, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, వంగలపూడి అనిత, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ ఎంవివి ఎస్ మూర్తి, సర్వేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుండి చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు.