విశాఖపట్నం

బ్లాక్‌లో క్రికెట్ టికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 28: భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరగనున్న చివరి వనే్డ బ్లాక్ మార్కెటీర్లకు కాసులు కురిపిస్తోంది. సిరీస్ ఫలితం తేలే మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. దీన్ని ఆసరా చేసుకుని బ్లాక్‌లో టికెట్ల విక్రయం జోరందుకుంది. ఎసిఎ - విడిసిఎ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం జరిగే డేనైట్ వనే్డకు ఈనెల 25 నుంచి టికెట్ల విక్రయం ప్రారంభించారు. టికెట్ల విక్రయం ప్రారంభించిన తొలి రోజు రూ.400, రూ.1000, రూ.1,500, మినహా రూ.2వేలు, రూ.3వేలు, రూ.5వేల టికెట్ల టికెట్ల విక్రయం కాస్త మందకొడిగానే మొదలైంది. ఇదే సందర్భంలో పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కయాంత్ తుపాన్ ప్రభావం వల్ల 27 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చివరి వనే్డ మ్యాచ్ టికెట్ల విక్రయంలో తడబాటు ఎదురైంది. అయితే అనూహ్యంగా తుపాను ప్రభావం నుంచి విశాఖ బయటపడటంతో క్రికెట్ మ్యాచ్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఇక రాంచీలో జరిగిన నాలుగవ వనే్డలో భారత్ గెలుపు ముంగిట దోబూచులాడి చివరకు ఓటమి పాలైంది. దీంతో ఐదు వనే్డల సిరీస్ 2-2తో సమం కావడంతో ఆఖరి వనే్డకు ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ఫలితం తేలే మ్యాచ్ కావడం, విశాఖలో భారత్‌కు మంచి రికార్డు ఉండటంతో మ్యాచ్‌పై అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. దీంతో మ్యాచ్ టికెట్లకు గిరాకీ పెరిగింది. తొలి రోజే అయిపోయిన రూ.400, రూ.వెయ్యి టికెట్లతో పాటు మిగిలిన టికెట్లు ఇప్పుడు బ్లాక్ మార్కెట్ దర్శనమిస్తున్నాయి. రూ.400 విలువైన టికెట్లు 2000 విక్రయించడగా, ఇప్పుడు కొంతమంది బ్లాక్‌లో విక్రయించేందుకు సిద్ధ పడుతున్నారు. రూ.400 విలుచేసే టికెట్ ధర బ్లాక్‌లో రూ.1000 పలుకుతోంది. ఇక రూ.1000 టికెట్లు 5,900 విక్రయించారు. వీటిలో కూడా కొన్ని టికెట్లు బ్లాక్‌లో దర్శనిమస్తున్నాయి. వీటిని రూ.2వేలకు విక్రయిస్తున్నారు. అయితే తొలి రోజు టికెట్ల విక్రయంలోనే ఈ సేవ నిర్వాహకులు పలు అవకతవకలకు పాల్పడినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. బ్లాక్ చేసిన టికెట్లను ఇప్పుడు రెండింతలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు.