నల్గొండ

నిర్లక్ష్యం నీడన మాతాశిశు సంరక్షణ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 19: మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలకు కేంద్రాలుగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు అరకొర వసతులకు నెలవుగా మారగా పట్టించుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పక్కా భవనాల మంజూరైనా నిర్మాణాలు పూర్తి చేయించడంలో తీవ్ర జాప్యం సాగిస్తుంది. గర్బిణిలు, చిన్నారులు, బాలింతల సంక్షేమ పథకాల పోషకాహార పథకాలను అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందినే పర్యవేక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలపై ప్రచారపటోపం చేస్తున్న ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల భవాలను మాత్రం సకాలంలో పూర్తి చేయించడంలో ఉదాసీనత చూపుతుంది. మునుముందు ఫ్రీ నర్సరీ, నర్సరీ కేంద్రాలుగా అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తామంటున్న ప్రభుత్వం అందుకు కీలకమైన భవనాల నిర్మాణాలపై శ్రద్ధ వహించాల్సివుంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరిజిల్లాల్లో ఉన్న 4,202 అంగన్‌వాడి కేంద్రాలకు కేవలం 927 కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. 2,181 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న తీరు అంగన్‌వాడీల సమస్యలకు నిదర్శనం. మిగతా వాటిలో సైతం మెజార్టీ కేంద్రాలు పాఠశాలల్లో, దాతల అందించిన గదుల్లో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, మంచినీటి వసతి లేక చిన్నారుల పరిశుభ్రత అవసరాలు తీర్చడంలో అరకొర చర్యలు సాగుతున్నాయి.
పక్కా భవనాల
నిర్మాణంలో తీవ్ర జాప్యం
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వివిధ పథకాల కింద సొంత భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన వాటి నిర్మాణ పనుల్లో ఐదేళ్లుగా జాప్యం సాగుతుంది. 4.40లక్షలు, 5.90లక్షలతో రెండుగదులు, మూత్రశాల, మరుగుదొడ్డితో నిర్మించాల్సిన అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకే ఇనే్నళ్లు పడుతుంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పూర్తికి ఇంకెన్నాళ్లు పడుతుందోనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాబార్డు కింద 208, ఏపిఐపి ద్వారా 250, ఉపాధి హామీ పథకం కింద 382 అంగన్‌వాడీ భవనాలు మొత్తం 840 భవనాలు మంజూరు చేయగా 179 మాత్రమే పూర్తవ్వగా 279వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరో 383 భవనాల పనులు నేటికి ప్రారంభంకాలేదు. నల్లగొండ జిల్లాలో 213 కేంద్రాలకు పక్కా భవనాలు మూంజరుకాగా 74 పూర్తవ్వగా 50పురోగతిలో ఉండగా 89 భవనాల పనులు ప్రారంభంకాలేదు. జిల్లాలో 133 భవనాలు మంజూరయ్యాయ.
కమలం ‘పేట’ సారథి ఎవరో..?
సూర్యాపేట, నవంబర్ 19: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్ష పదవీకి పోటాపోటి నెలకొంది. గత ఉమ్మడి నల్లగొండ జిల్లా మూడుజిల్లాలుగా విడిపోవడంతో కొత్తగా జిల్లా నూతన కమిటీలను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. కాగా నల్లగొండ, యాదాద్రి జిల్లాల నూతన అధ్యక్షులను అధిష్టానం ప్రకటించగా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడి ఎన్నికను వాయిదా వేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాకు జిల్లా బిజెపి అధ్యక్షునిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు సూర్యాపేట జిల్లావాసి కావడంతో కొత్త జిల్లా అధ్యక్షుని ఎన్నికలో ఆయన నిర్ణయమే కీలకంగా మారనుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాకు తొలి అధ్యక్షునిగా తమ పేరు చరిత్రలో నిలిచి ఉంటుందని భావిస్తున్న ఆ పార్టీ నేతలు జిల్లా సారధ్యం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. సూర్యాపేటకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు రంగరాజు రుక్మారావు, నాయకులు జీడి భిక్షం, నల్లకుంట్ల అయోధ్యలతో పాటు కోదాడ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు కనగాల వెంకట్రామయ్యలు పదవీ దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మహిళల భాగస్వామ్యంతో బాలల వికాసానికి కృషి
* కలెక్టర్ సురేంద్రమోహన్ వెల్లడి
సూర్యాపేట, నవంబర్ 19: సూర్యాపేట జిల్లాను బాలల సంపూర్ణ వికాసానికి తీర్చిదిద్దే ప్రక్రయలో భాగంగా స్వయం సహయక సంఘాల మహిళలను జిల్లాస్థాయి నుండి గ్రామస్థాయి వరకు భాగస్వామ్యులను చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సామాజిక, ఆర్దిక పరిస్థితుల నేపథ్యంలో బడిబయట ఉన్న పిల్లల స్థితి గతులపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. నేటి సమాజంలో వివక్షకు, నిరాధరణకు, దోపిడికి గురవుతున్నది బాలికలే అన్నారు. బాలల సంరక్షణకు ప్రభుత్వం రూపొందించిన చట్టాల అమలును మానిటరింగ్ చేసేందుకు మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి మున్నయ్యను ఆదేశించారు. జిల్లాపరిధిలో గతంలో గుర్తించిన 5వేల మంది బాలకార్మికుల పునారావానికి చేపట్టిన చర్యలను తిరిగి పరిశీలించాలని సూచించారు. పిల్లలతో పనిచేయించే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. వలస కార్మికుల పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్పి పరిమళ హనా నూతన్ మాట్లాడుతూ బాల్య వివాహలను ప్రోత్సహించే వ్యక్తులపై కేసులు నమోదుచేస్తామన్నారు. బాలల హక్కులను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో సబ్ ఇన్స్‌స్పెక్టర్లను, గ్రామస్థాయిలో కానిస్టేబుల్‌ను, జిల్లాస్థాయిలో అదనపు ఎస్పిని నియమిస్తున్నట్లు తెలిపారు.

పర్యాటక కేంద్రాలుగా చారిత్రాత్మక ఆలయాలు
* కలెక్టర్ సురేంద్రమోహన్
సూర్యాపేట, నవంబర్ 19: జిల్లాలోని చారిత్మ్రాతక ప్రాంతాలైన పిల్లలమర్రి, ఉండ్రుకొండ, మట్టంపల్లి, ఫణిగిరి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ తెలిపారు. శనివారం మండలపరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో చారిత్మ్రాతక శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పిల్లలమర్రిలోని ఎర్రకేశవ, నామేశ్వర, చెన్నకేశ్వర, ఆంజనేయ, బ్రహ్మసరస్వతి, త్రికుట ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. ఆలయాలను సందర్శించే భక్తులు కానుకలుగా రూ.500,రూ.1000నోట్లను హుండిలో వేయవచ్చునని ఈ విషయంలో ఎలాంటి అపోహలకు గురికావద్దని స్పష్టంచేశారు. పిల్లలమర్రి గ్రామాన్ని సందర్శనీయ స్థలంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతామన్నారు. గ్రామంలోని ప్రజలంతా తమ ఇంటిలో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. ఎంతో ప్రఖ్యాతి చెందిన ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎంతో చరిత్ర కలిగిన పిల్లలమర్రి గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయానికి సంబంధించిన భూముల వివరాలను సమగ్రంగా సేకరించి ఆలయ భూములకు హద్దులు నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని సర్వే అండ్ ల్యాడ్ రికార్డ్స్ అధికారికి ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వట్టె జానయ్యయాదవ్, గ్రామ సర్పంచ్ సోమగాని లింగస్వామి తదితరులు పాల్గొన్నారు

22న రానున్న రేంవత్‌రెడ్డి రైతుపోరు పాదయాత్ర
* తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల భూపాల్‌రెడ్డి
చిట్యాల, నవంబర్ 19: అన్నంపెట్టే అన్నదాతలను తెరాస ప్రభుత్వం విస్మరించిందని అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతుపోరు పాదయాత్రను చేపట్టారని ఈనెల 22వ తేదీన మండలానికి యాత్ర చేరుకుంటుందని తెదేపా రాష్టక్రార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం శివారులోని కృష్ణాకాటన్ మిల్‌లో శనివారం నిర్వహించిన తెదేపా ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిధిగా భూపాల్‌రెడ్డి హాజరైనారు. తెదేపా సభ్యత్వ నమోదుకార్యక్రాన్ని రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించి సీనియర్ నాయకులకు అందజేశారు. ఈసందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నముకయిన అన్నదాతలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విస్మరించారని అన్నదాతల సమస్యన్నింటిని గాలికొదిలేసి పరిపాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయానికి ప్రోత్సాహాన్నందిస్తామని రుణాలను మాఫీచేస్తామని ఎన్నికల ముందు చెప్పిన సిఎం కెసిఆర్ ఎన్నికల హామీలను విస్మరించడంతో అన్నదాతలు అవస్థలపాలవుతున్నారన్నారు.

ప్రజావ్యతిరేక విధానాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
* డిసిసి అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్
ఆత్మకూర్( ఎం), నవంబర్ 19: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. శనివారం రోజున మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి శ్రధ్దాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయాలను నెరవేర్చాలని, బడుగు, బలహీనవర్గాలకు ఇందిరాగాంధీ ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. కేంద్రంలో ప్రధాని మోడీ నల్లధనం వెలికితీస్తానని 500,1000 రద్దు చేసి చిల్లర నోట్లను ముద్రించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. జిల్లాలు, మండలాలు సరైన పద్దతిలో ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు.ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు