విశాఖపట్నం

ఇక విశాఖలోనే సిజిహెచ్‌ఎస్ వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, డిసెంబర్ 27: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డు ఉద్యోగులకు ఇక విశాఖలోనే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సిజిహెచ్‌ఎస్) ద్వారా వైద్య,ఆరోగ్య సేవలు అందనున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్న వీటిని ఇక నుంచి విశాఖలోను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులోభాగంగా వచ్చేనెల 9వ తేదీన కేంద్రమంత్రి వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఈ వైద్య సేవలను పొందే వీలు కల్పిస్తూ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది.
విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు చొరవతో నగరంలోని ఏర్పాటైన ఈ కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ జగత్ ప్రకాష్ ప్రారంభించనున్నారు. ముగ్గురు వైద్యులతో ఉద్యోగులకు ఓపీ వైద్యసేవలు అందనున్నాయి. ప్రత్యేక వైద్యసేవలు అవసరమైన వారికి సిజిఎస్ పథకం జాబితాలో నమోదైన కార్పోరేట్ ఆసుపత్రులు చికిత్స కోసం సిఫారసు చేస్తారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని 120 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండగా, వీటిలో 1.2లక్షల మంది ఉద్యోగులు పించన్‌దారులు ఉన్నారు. వీరందరికీ ఉచిత సేవలు అందిస్తామని హరిబాబు తెలిపారు. అంతేకాకుండా ఆరిలోవ హెల్త్‌సిటీలో వెల్‌నెస్ సెంటర్‌కు శాశ్వత వసతి కోసం 0.30 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఇదిలాఉండగా గత కలెక్టర్ యువరాజ్ చొరవతో వాల్తేరులో ప్రభుత్వ మానసిక వైద్యశాల వద్ద వినియోగంలోనున్న భవనాలను ఆధునీకరించి ఇక్కడే ప్రారంభించేందుకు నిర్ణయించారు. అలాగే సిఎస్‌ఆర్ నిధుల కింద రూ.26 లక్షలు, ఎస్‌డిపి నిధుల నుంచి రూ.10.5లక్షల మేర కేటాయించడంతో వసతి సిద్ధమైందన్నారు.
ఈ నూతనంగా ఏర్పాటుచేసిన భవన సముదాయాలను ఏపీఎంఐడిసి అధికారులు మంగళవారం ఎంపీ హరిబాబు సమక్షంలో సిజిఎస్ అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిజిహెచ్‌ఎస్ అదనపు డైరెక్టర్ డాక్టర్ విజయభాస్కర్, మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి, ఏపీఎంఎస్‌ఐడిఎస్ ఇఇ ఉమేశ్‌కుమార్, బిజెపి నగర అధ్యక్షుడు నాగేంద్ర, పివి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.