నల్గొండ

ప్రజల ఆశయాలకు అనుగుణంగా కెసిఆర్ పాలన: జూపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, జనవరి 21: ప్రజల ఆశయాలకనుగుణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన కొనసాగుతుందని రాష్ట్ర పంచాయతిరాజ్‌శాఖమంత్రి జూపల్లి క్రిష్ణారావ్ అన్నారు. శనివారం బీబీనగర్ మండలంలోని రావిపహడ్ గ్రామంలో ఎన్ ఆర్ ఇ జి ఎస్ 13లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామపంచాయితి నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతు ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణా అభివృద్ధి సాదించాలంటె ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటె విద్య, ఉపాధి, సాగు, త్రాగునీటి, వైద్య రంగాలలో అభివృద్దిసాధించినపుడె బంగారు తెలంగాణ సాద్యవౌతుందని తెలిపారు. అనంతరం ఉపాధి హామి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలోగల జనాభకనుగుణంగా 100రోజుల పనికల్పించి ప్రజల అవసరాలు తీర్చాల్సిన భాద్యత అధికారులపై ఉందని ప్రతి ఒక్కరికి పనికల్పించి జాబ్ కార్డులు ఇవ్వాలన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని గ్రామాల అభివృద్ధికోసం రాష్ట్ర స్థాయినుండి గ్రామ స్థాయివరకు ప్రజాప్రతినిధులందరు కలిసి కట్టుగా పనిచేసి అభివృద్ధిసాదించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని నిధులను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలో జమచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ అనితారామచంద్రన్, ఎమ్మెల్యే గొంగిడి సునిత, పైళ్లశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సి కర్నెప్రభాకర్ డిఆర్‌డిఒ పిడి వెంకట్రావ్, ఎంపిపి గోలిప్రణితపింగల్‌రెడ్డి, జడ్పిటిసి సందిగారి బస్వయ్య, వైస్ ఎంపిపి కొంతం లింగయ్యగౌడ్, గ్రామ సర్పంచ్ రాసాల రవికుమార్‌యాదవ్, ఎంపిడివొ ఎం.వెంకయ్య, తహసిల్దార్ వై.అశోక్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బొక్క జైపాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పిట్టల అశోక్, నాయకులు పంజాల సతీష్‌గౌడ్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

చట్టసభల సమయం వృథా చేయొద్దు
నల్లగొండ రూరల్, జనవరి 21 : ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో విమర్శలు చేస్తూ చట్టసభల సమయం వృధా చేస్తే తెలంగాణ సమాజం తగిన సమయంలో బుద్ది చెబుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కమిటీ, మండల కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టసభలను కుటుంబ షోగా నిర్వహించారు. ప్రజా సమస్యలు చర్చించకుండా సి ఎం అడ్డుతగిలారని, ఎన్నికల వాగ్ధానాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకే నిధులు కేటాయించడం తగదన్నారు. శాసనసభను సామాన్య సమస్యలపై ఐదు రోజులు చర్చించాలంటూ తమ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. భూసేకరణ చట్టం ప్రతులను సభ్యులకు ఇవ్వకుండా చర్చను ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. 2016-17లో కేటాయించిన బడ్జెట్ ఏ మేరకు ఖర్చుచేశారో తెలపాలన్నారు. సిపి ఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెన్న అనంతరామశర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, బండా శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.