విశాఖపట్నం

నేడు పలువురి నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం పలువురు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున విజయనగరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగదాంబ సమీపంలోని కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు నామినేషన్ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వతంత్య్ర అభ్యర్థులుగా లీడర్ పత్రిక అధిపతి వివి రమణమూర్తి సహా ఎవి ప్రసాదరావు తదితరులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

డిఫెన్స్ రంగంలో
పరిశోధనలు పెరగాలి

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధనలు మరింతగా పెరిగాలని ఆర్టీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఆకాంక్షించారు. రక్షణ రంగానికి సంబంధించిన కోర్సులు, పరిశోధనలకు ఎయు సహకరించాలని ఎయు అధికారులను వారు కోరారు. ఎయు వైస్ ఛాన్స్‌లర్ జి నాగేశ్వరరావు, ఎయు ఇంజనీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ అవధాని, డైరక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్ వైస్ అడ్మిరల్ ఎస్ ఆర్ శర్మ, ఎయిర్‌ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన వైస్ అడ్మిరల్ ఎస్ ఎస్ శర్మ తదితరులు మంగళవారం సమావేశమై త్రివిధ దళాల్లో చేరేందుకు, ఇందులో పరిశోధనలకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. ఆఫీసర్స్, సెయిలర్ల శిక్షణ పొందిన వారికి సర్ట్ఫికెట్లు ఇవ్వాలని కోరారు. శిక్షణ పొందిన వారికి రక్షణ శాఖ ఇచ్చే సర్ట్ఫికెట్లకు సరిసమానమైన సర్ట్ఫికెట్‌లు జారీ చేయాలని కోరారు. అలాగే డిఫెన్స్ ఆఫీసర్లు ఎంఫిల్, పిహెచ్‌డి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. షిప్ మెయింటెనెన్స్, వెపన్ డిజైన్ అండ్ మెయింటెనెన్స్‌పై పరిశోధనకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని వైస్ అడ్మిరల్ ఎస్‌ఆర్ శర్మ తెలియచేశారు. ఇప్పటికే ఆంధ్రా యూనివర్శిటీ నుంచి డిఆర్‌డిఓ, ఇస్రో, డిఎస్‌టి, డిబిటి వంటి రక్షణ సంస్థలు అద్భుతమైన పరిశోధనలు చేశాయని వైస్‌ఛాన్స్‌లర్ నాగేశ్వరరావు తెలియచేశారు.