విశాఖపట్నం

ముగిసిన నామినేషన్ల ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల దాఖలు కార్యక్రమం సోమవారంతో ముగిసింది. చివరి రోజు సోమవారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 14మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో లగుడు గోవిందరావు, టి పరమేశ్వర సూర్య చంద్ర, జి రవీంద్ర కుమార్, కె సింహాద్రప్పడు, గంటా పాపారావు, రెడ్డి వెంకటరమణ, బివైవి సత్యనారాయణ, సిహెచ్ శేషగిరిరావు, బి లక్ష్మీ నారాయణ, బి లక్ష్మీ సిమ్మ, కె ఉదయశ్రీ, కె జైరూప్, చల్లా ఎర్రినాయుడు, పి సురేష్‌కుమార్ ఉన్నారు. ఈ నెల 13న నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనప్పటి నుంచి శనివారం వరకూ 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పిడిఎఫ్ నుంచి ఎ అజశర్మ, కాంగ్రెస్ నుంచి యడ్ల ఆదిరాజు, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పివిఎన్ మాధవ్, స్వతంత్ర అభ్యర్థులుగా వివి రమణమూర్తి సహా పలువురు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తి కాగా, 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అనంతరం 23 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. వచ్చే నెల 9న ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించనున్నారు.