S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమడ ఆధునికీకరణకు రూ. 240 కోట్లు

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 23: నల్లమడ వాగు ఆధునికీకరణ పనులకు అవసరమైన 240 కోట్ల రూపాయల నిధులు త్వరలో మంజూరు చేయిస్తానని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రత్తిపాడు ఎండిఒ కార్యాలయంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వరద ముంపునకు గురైన పంటల నష్టం అంచనాపై నియోజకవర్గ స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ భారీవర్షాల వల్ల ప్రతి ఏడాది నల్లమడ ముంపుతో వేలాది ఎకరాలు నష్టపోవాల్సి వస్తుందని, వాగు ఆధునికీకరణకు 240 కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంత ప్రజలు, రైతులను ఆదుకుంటామన్నారు.

అభివృద్ధి నిరోధకశక్తి జగన్

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 23: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డంకులు సృష్టిస్తూ నిరోధక శక్తిగా మారారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ ధ్వజమెత్తారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోదాపై విద్యార్థులు, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పార్లమెంటులో ప్రత్యేకహోదాపై జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి 16 మాసాలు జైలు జీవితం గడిపిన జగన్ తన నేర చరిత్ర గురించి ప్రజలకు చెప్తే బాగుంటుందని ఎద్దేవాచేశారు.

జలదిగ్బంధంలో గ్రామాలు

పెదనందిపాడు, సెప్టెంబర్ 23: నల్లమడవాగు పరివాహక ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులో వర్షపునీరు పెరగడంతో పలుచోట్ల కరకట్టలకు గండ్లుపడి ఛిన్నాభిన్నమయ్యాయి. దీం తో వందలాది ఎకరాల్లో వేసిన మినుము, ప్రత్తి, మి ర్చి, వరి, మొక్కజొన్న పంటలు వరదనీటిలో కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అతివృష్టి సమయాల్లో ఎప్పటికప్పుడు దశాబ్దాలుగా పాత కథ పునరావృ తం అవుతుండటంతో ఈ ప్రాంత రైతాంగం పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇటు గుంటూరు, అటు ప్రకా శం జిల్లా వైపు దాదాపు 20 వేల ఎకరాల్లో వరదనీరు ప్రవహిస్తోంది.

కాంగ్రెస్, వైకాపా కలిస్తే మేయర్ పీఠం కష్టమే!

కర్నూలు, సెప్టెంబర్ 23:కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలు డిసెంబర్ చివర, జనవరి 15వ తేదీ లోపు నిర్వహించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఓటరు సవరణ కార్యక్రమం చేపట్టిన అధికారులు ఆ పని పూర్తయిన వెంటనే ఎన్నికల నిర్వహణకు సిద్ధపడాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనప్రాయంగా ఆదేశాలు సైతం అందాయి. దీంతో ఎన్నికలకు అధికార పార్టీ టిడిపితో పాటు వైకాపా, కాంగ్రెస్ సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయంపై టిడిపి చేయించిన సర్వే వారిలో గుబులు రేకెత్తిస్తోంది.

ఆక్రమణలతోనే వరద ముప్పు!

కర్నూలు, సెప్టెంబర్ 23:‘ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదు, అక్రమ కట్టడాలు కూల్చేస్తాం, వరద బారి నుంచి ప్రజలను రక్షిస్తాం’ వరదల సమయాల్లో జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ తలారి వరకూ ఇవే మాటలు వల్లె వేస్తున్నారు. వరద సమయంలో ప్రజలను పరామర్శించి వారికి అంతో ఇంతో నష్టపరిహారం చెల్లించి ఆ తరువాత అన్నీ మరచిపోతున్నారు. మళ్లీ ఏడాది తరువాత అదే వరద, అవే మాటలు ఇలాగే ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ ఒక ఆక్రమణలు తొలగించలేదు, వరద ఆగలేదు.. ఇదీ నంద్యాల, ఆత్మకూరు పట్టణాల్లోని ప్రజల మనోగతం. వర్షాకాలంలో ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు ఈ రెండు పట్టణాల్లోని కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరుతోంది.

వర్షాలతో తీరిన తుంగభద్ర బెంగ!

ఆదోని, సెప్టెంబర్ 23: వర్షాలు విస్తృతంగా కురుస్తుండడంతో తుంగభద్ర దిగువ కాలువ కింద పంటలు పండిం చే రైతులకు తుంగభద్ర నీటి బెంగ తీరింది. వర్షంనీరు రైతన్నలను ఆదుకుంది. అందువల్ల ఆయకట్టు భూము ల్లో వేసిన పంటలు వర్షపునీరు ఆదుకోవడంతో పచ్చగా పంటలు కళకళలాడుతున్నాయి. తుంగభద్ర డ్యాంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు 50 టిఎంసిల నీళ్లు మాత్రమే ఉండడం వల్ల 10 రోజులకు ఒక్కసారి నీటిని విడతల వారిగా సరఫరా చేసేందుకు తుంగభద్ర బోర్డు అధికారులు, కర్నాటక అధికారులు చర్యలు తీసుకున్నారు. విడతల వారి నీటి సరఫరా వల్ల తుంగభద్ర దిగువ కాలువ కింద పండించే పంటలు దెబ్బతింటాయని రైతన్నలు తీవ్ర ఆందోళన కలిగింది.

నగరంలో వేగంగా అభివృద్ధి పనులు

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 23:నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తవుతాయని రాజ్యసభ సభ్యులు టిజి.వెంకటేష్ తెలిపారు. రాయలసీమ యూనివర్శిటీకి నీరందించేందుకు నగరంలోని టెలికాంనగర్‌లో రూ. 1.8 లక్షలతో చేపట్టిన తాగునీటి సరఫరా లైన్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, రైతు రుణమాఫీ, పింఛన్ల మొత్తం పెంపు, కరవు, తుపాన్లు, తదితర కారణాలతో సిఎం చంద్రబాబు గత రెండేళ్లలో నగరాభివృద్ధికి సక్రమంగా నిధులు విడుదల చేయలేకపోయారన్నారు. అయితే ప్రస్తుతం నిధుల కొరత లేదని, 24 గంటల పాటు పని చేసే సిబ్బంది కావాలన్నారు. రాబోయే మూడేళ్లలో నగరంలో ఏ కాలనీలో సిసి రోడ్డు లేదు అనే సమస్య ఉండదన్నారు.

చెరువుల్లో పూడికతీతకు సర్వే

కర్నూలు, సెప్టెంబర్ 23:జిల్లాలోని నీటిపారుదల చెరువులో ముళ్లకంపలను తొలగించి పూడికతీత పనులు చేపట్టేందుకు సర్వే ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 23మండలాల తహశీల్దార్లు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 23 మండలాల పరిధిలో ఉన్న చెరువుల్లో ముళ్లపొదలు తొలగించేందుకు ఇరిగేషన్, సర్వే, రెవెన్యూ, ఎస్‌ఆర్‌ఇజిఎస్ అధికారులు సమన్వయంతో సర్వే పనులు ప్రారంభించాలన్నారు. ముళ్ల కంపలను తొలగించిన అనంతరం ఏ చెరవులో ఎంత లోతు పూడిక తీయాలో ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

గోరుకల్లు రిజర్వాయర్‌ను సందర్శించిన అధికారులు

పాణ్యం, సెప్టెంబర్ 23: మండల పరిధిలోని కొండజూటూరు గ్రామంలో గోరుకల్లు రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసుకున్నందున గోరుకల్లు గ్రామంలో నీటి బుగ్గ లు ఉద్ధృతమైన సంగతి తెలిసిందే. వాటి ఉద్ధృతిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లోగడ రాజకీయ నాయకులు, అధికారు లు, ఈ గ్రా మాన్ని సందర్శించారు. శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి గోరుకల్లు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఒక ప్రాంతంలో నాలుగు అడుగుల గుంత తవ్వగా అక్కడ నీటి బుగ్గలు ఉబకడం పరిశీలించారు.

మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ. 25.63 లక్షలు

మహానంది, సెప్టెంబర్ 23: మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల ద్వారా రూ.25,63,148లు ఆదాయం లభించినట్లు ఇఓ డా.శంకర వర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మహానంది పుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయాల హుండీలను ఇఓ, చైర్మన్ పాణ్యం ప్రసాద్‌ల ఆధ్వర్యంలో లెక్కించారు. ఆలయంలోని అభిషేక మండపంలో నిర్వహించిన ఈ లెక్కింపులో ఆలయంలోని హుండీల ద్వారా రూ.25,53,695లు రాగా, అన్నదానం హుండీ ద్వారా రూ.9453లు ఆదాయం లబించినట్లు ఆయన తెలిపారు.

Pages