S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరల్డ్ ఎకనమిక్ ఫోరం అవార్డుకు ‘వాటర్ హెల్త్’ ఎంపిక

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన స్కెవాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్ధ జాతీయ స్ధాయిలో ఐదు సంస్ధలను సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వికాస్ షా ఆఫ్ వాటర్ హెల్త్ ఇండియా సంస్ధను ఎంపిక చేశారు.

రేపు హైదరాబాద్‌లో జియో టెడెక్స్ సదస్సు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్ధ రిలయన్స్ జియో ఇన్ఫ్‌కామ్ సంస్ధ ఈ నెల 25వ తేదీన టెడెక్స్ హైదరాబాద్ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ సంస్ధ ప్రకటించింది. టెడెక్స్ హైదరాబాద్ డిజిటల్ కనెక్టివిటీ పేరుతో ఈ సదస్సును నిర్వహిస్తారు. గచ్చిబౌలి లోని సంధ్య కనె్వన్షన్ సెంటర్‌లో ఈ సదస్సును ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు ప్రారంభిస్తారు. ఈ వేదికపై 13 అసాధారణ వినూత్న ఆవిష్కరణలపై వివరిస్తారు. ప్రఖ్యాత డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సరుూద్ తాజి, పర్వతారోహకుడు జాహ్నవి శ్రీపెరంబదూరు తదితరులు పాల్గొంటారు.

కొత్త సిపిఎస్‌ఇ ఇటిఎఫ్‌కు మేనేజర్‌గా ఐసిఐసిఐ

ముంబయి, సెప్టెంబర్ 23: సుమారు రూ.6 వేల కోట్ల కార్పస్ నిధితో ప్రభుత్వ రంగ కంపెనీల స్టాక్స్‌తో ఏర్పాటు చేయబోయే రెండవ సిపిఎస్‌ఇ ఎక్స్‌చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)ను నిర్వహించడానికి ప్రభుత్వం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌ను మేనేజర్‌గా నియమించింది. ఈ ఫండ్ నిర్వహణకోసం పోటీ పడ్డ ఇతర ఫండ్ మేనేజింగ్ సంస్థల్లో రిలయన్స్ హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, యుటిఐ, కోటక్, బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

బాండ్లకు పెట్టుబడుల పరిమితిని వేలం వేయనున్న బిఎస్‌ఇ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రూ.4615 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు విదేశీ ఇనె్వస్టర్లకు పెట్టుబడి పరిమితులను బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి బిఎస్‌ఇ సోమవారం వేలం వేయనుంది. సోమవారం మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 3.30- 5.30 గంటల మధ్య బిఎస్‌ఇకి చెందిన ‘ఇబిడ్‌ఎక్స్‌చేంజి’ ప్లాట్‌ఫామ్‌పై ఈ వేలం నిర్వహిస్తారు. ఈ డెట్ వేలం కోటాలతో విదేశీ ఇనె్వస్టర్లు తాము ఒనుగోలు చేసిన పరిమితి దాకా వీటిలో పెట్టుబడి పెట్టడానికి హక్కు లభిస్తుంది.

రెండు బీమా సంస్థలతో ఆంధ్రా బ్యాంకు ఒప్పందం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రా బ్యాంకు తమ ఖాతాదారులకు ఆరోగ్య, సాధారణ బీమా వసతి కల్పించేందుకు సిగ్నా టిటికె కంపెనీ లిమిటెడ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థలతో కార్పొరేట్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలతో తాము కుదుర్చుకున్న పొత్తు వలన ఖాతాదారులకు విస్తృతమైన ప్రయోజనాలు ఒనగూడుతాయని, బీమా పథకాలను ఎంపిక చేసుకోవడంలో ఖాతాదారులకు పలు ప్రత్యామ్నాయాలు లభిస్తాయని ఆంధ్రా బ్యాంకు తెలిపింది.

ఢిల్లీ నుంచి విశాఖకు మూడో విమాన సర్వీసు

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ఢిల్లీ నుంచి విశాఖకు మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు విశాఖ నుంచి విమానాల రాకపోకలకు అవరోధంగా నిలిచాయి. అయితే విశాఖ విమాన ప్రయాణికుల విజ్ఞప్తికి స్పందించిన పౌర విమానయాన శాఖా మంత్రి పి అశోక్ గజపతిరాజు ఢిల్లీ నుంచి మరో సర్వీసును విశాఖకు నడిపేందుకు అంగీకరించారు. ఈ నెల 28 నుంచి ఇండిగో సంస్థ ఢిల్లీ నుంచి విశాఖకు విమాన సర్వీసును ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీకి విశాఖ నుంచి స్పైస్ జెట్ ఒక సర్వీసును నడుపుతోంది.

అనివార్య విలీనం!

కాలానుగుణంగా అనివార్యమైన మార్పులను స్వాగతించాల్సిందే! ఏ వ్యవస్థలోనైనా మార్పుతోనే రాణింపు ఉంటుందన్న వాస్తవం ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కాలం చెల్లిన, వర్తమానానికి ఏ మాత్రం ఉపయోగపడని ఎన్నో చట్టాలకు దశలవారీగా కేంద్రం చరమగీతం పాడుతున్న నేపథ్యంలో తాజాగా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కూ స్వస్తి పలికి దాన్ని వార్షిక సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం అభినందనీయ పరిణామం. రైల్వే ప్రత్యేక బడ్జెట్ వల్ల కలిగే ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకు ఇది ఆలవాలంగా మారిందన్నది ఎంతైనా వాస్తవం. సమాజంలో పాతుకుపోయిన కొన్ని సంప్రదాయాలను వదిలించుకోవడం ఎంత కష్టమో..

లక్ష్యం నెరవేరిందా..?

స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి మరింత చొచ్చుకుని వెళ్ళాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావించింది. ఆ దిశగా అడుగులు వేసి ఈ నెల 19, 20 తేదీల్లో నగరంలో స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేసినా, ఏ మేరకు ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందన్న ఆత్మావలోకనంలో నేతలు పడ్డారు. ఎందుకంటే రెండు రోజుల సమావేశంలో పూర్తిగా రాజకీయంగా శిక్షణా తరగతులు జరగలేదు. మరోవైపు కనీసం స్థానిక ప్రజాప్రతినిధులకు విధులు, నిధుల గురించి తెలియజేయలేదు. కేవలం ప్రసంగాలతో ముగించారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి

నయామిజాన్ని పెంచి పోషించిందెవరు?

‘‘అన్ని ప్రత్యామ్నాయాల తర్వాత ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థ దుర్మార్గమైన పరిపాలనే అందిస్తుంది కానీ ప్రజా సమస్యలన్నిటికీ సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపదు...’’ అన్న విన్సిటన్ చర్చిల్ మాటలతో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ, ప్రజాస్వామిక వ్యవస్థలు ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాల్ని విశే్లషిస్తే ఈ మాటల్లో నగ్న సత్యం కనపడుతుంది.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162

నరమేధానికి అంతం లేదా!

ఎటు చూసినా బాంబులు అది రెస్టారెంటైనా కావొచ్చు, పాఠశాలైనా కావొచ్చు లేదా మసీదు, చర్చి, దేవాలయమైనా కావొచ్చు. ఐ.ఎస్ ఉగ్రవాదుల నరమేధం కొనసాగుతోంది. తాజాగా ఢాకాలో పేలుడు జరిగిన కొద్దిసేపటికి ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ ఆలీ ఆబాదీ కరాదాలోని ఘటనా స్థలికి వస్తే ‘దొంగ’గా అభివర్ణిస్తూ ప్రధాని కాన్వాయ్‌పై రాళ్ళు, చెప్పుల వర్షం కురిపించారు. ఈ ఘటనకు కారకుడు ఉగ్రవాదుల్లో బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీలీగ్ నేత ఎస్.ఎం.ఇంతియాజ్ తనయుడు రోహన్ ఇంతియాజ్ ఉన్నాడని మరో అవామీలీగ్ నేత ముకుల్ చౌదరి ఆరోపించారు.

- ఈవేమన

Pages