S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

చిలమత్తూరు, సెప్టెంబర్ 23 : మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో నివాసం ఉంటున్న ఆర్షియాభాను (13) గత బుధవారం కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అయితే బెంగళూరులో చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పితో బాధ పడుతుండటంతో భరించలేక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించగా అక్కడ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. మృతురాలు స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేడు గొల్లపల్లి కాలువకు నీరు విడుదల

అనంతపురం, సెప్టెంబర్ 23 : జీడిపల్లిలో నిల్వ ఉంచిన హంద్రీనీవా నీటిని శనివారం గొల్లపల్లి రిజర్వాయర్ కాలువకు విడుదల చేయనున్నారు. పంపనూరు గ్రామ సమీపంలోని శింగంపల్లి వద్ద నేటి ఉదయం 10.45 గంటలకు జిల్లా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ కోన శశిధర్ విడుదల చేయనున్నారు.

నగర పాలక సమావేశం రసాభాస.!

కడప,సెప్టెంబర్ 23: కడప నగర పాలక సంస్థలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వైకాపా, టిడిపి పాలక వర్గ సభ్యులు పరస్పరం మాటలయుద్ధానికి దిగారు. దీంతో సభ రసాభాసగా మారింది. వైకాపానేత, నగర పాలక మేయర్ కె.సురేష్‌బాబు అధ్యక్షతన సమావేశం జరిగినా ఆయన పెద్దగా నోరుమెదపలేదు. ఇరుపార్టీలకు చెందిన కార్పొరేటర్లు నగరంలోజరిగిన అభివృద్ధి పనులు నాసిరకంగా జరిగాయని అధికారులపై విరుచుకుపడ్డారు.

26న జిల్లాకు మంజునాథ్ కమిటీ రాక..

కడప,సెప్టెంబర్ 23: కాపులు (బలిజలు)లను బిసి జాబితాలో చేర్చేందుకు మంజునాధ్ కమిటీని ఏర్పాటుచేయడం ఆ కమిటీ జిల్లాకు ఈనెల 26న జిల్లాకు రావడంతో కాపు సంఘం, బిసి కులసంఘాలు తమ వాణిని విన్పించేందుకు సిద్దమయ్యారు. కాపు సంఘం రాష్టన్రేతలు, ప్రభుత్వ సూచనల మేరకు మంజునాథ్ కమిటీ వద్ద వారి స్థితిగతులను, వెనుకబడిన తనాన్ని తదితర విషయాలపై మంజునాథ్ కమిటీ ఎదుట విన్పించాలని శుక్రవారం పలు సంఘాలు కలిసి సమావేశమై నిర్ణయించారు. బిసిల్లో కులాల వారీగా జిల్లాస్థాయి నేతలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నేతలు మంజునాథ్ కమిటీ వద్ద వాడివేడిగా తమ వాదనలు విన్పించేందుకు ఎడతెరిపిలేకుండా గత వారం రోజులుగా సమావేశం నిర్వహిస్తున్నారు.

ఇద్దరు ఎంపిడిఓలపై వేటు..

కమలాపురం, సెప్టెంబర్ 23: కమలాపురం మండలం పొడదుర్తి గ్రామపంచాయతీలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతి చోటు చేసుకోవడంతో ఇందుకు బాధ్యులను చేస్తూ ఇద్దరు ఎంపిడిఓలను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎంపిడివో కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఈ పనులకు సంబంధించి మండలంలో పనిచేస్తున్న ఎంపిడిఓ ప్రభాకరరెడ్డి ఇక్కడ పనిచేసి బదిలీపై చెన్నూరు మండలానికి వెళ్లిన ఎంపిడిఓ వెంకటరమణారెడ్డిని సస్పెన్షన్ చేయగా టెక్నికల్ అసిస్టెంట్, ఈసి లను విధుల నుంచి తొలగించగా ఇద్దరు ఉపాధి ఏపివో లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసారు.

గండికోటకు ఆరు టిఎంసిల నీరు కేటాయించాలి

పెండ్లిమర్రి,సెప్టెంబర్ 23: కృష్ణాజలాలపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మధ్య వాగ్వివాదం జరుగుతున్న సందర్భంగా ఆంధ్రరాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి కృష్ణా నికరజలాల వాటాను తేల్చాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పెండ్లిమర్రిలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరవులో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాలకు కృష్ణానికర జలాలను ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 121 టిఎంసిలు వచ్చేలా ఏర్పాటుచేశారని, ఆ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి గాలేరు-నగరి ప్రాజెక్టుకు నీరు చేరక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు.

గణపతి సచ్చిదానందస్వామీజీకి యోగా నేర్పింది ప్రొద్దుటూరే...

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 23: గణపతి సచ్చిదానందస్వామి దత్తపీఠాలను దేశవ్యాప్తంగా స్థాపించిన పరమపూజ్యులైన స్వామీజీకి ప్రొద్దుటూరు పట్టణమే యోగా నేర్పిందని, ఇలాంటి ప్రొద్దుటూరు విశిష్టమైందని దత్తపీఠం రెండవ పీఠాధిపతి శ్రీశ్రీ దత్తవిజయానందతీర్థస్వామీజీ అన్నారు. దత్త పీఠాల్లోనే రెండవ పీఠంగా వెలుగొందుతున్న ప్రొద్దుటూరులోని శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థాన సముదాయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13వ చాతుర్మాసం మైసూర్ దత్తపీఠంలో అత్యంత వైభవంగా, పవిత్రంగా భక్తులచే ఆధ్యాత్మిక చింతనతో సాధన చేయడం జరిగిందని, సాధన ద్వారా మనిషిలో నూతన శక్తి ఉద్భవిస్తుందన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు : ఎంపిడిఓ

లక్కిరెడ్డిపల్లె,సెప్టెంబర్ 23: మండలంలోని పారిశుద్ధ్యం పనులు వెంటనే చేపట్టాలని స్థానిక ఎంపిడివో సభాభవన్‌లో ఎంపిడివో స్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్దప్రాతిపదికన వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులవల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నారు. తహశీల్దార్ శ్రీరాములునాయక్ మాట్లాడుతూ దోమల నివారణపై ప్రజల్లో చైతన్యం తేవాలని వారికి అవగాహన కల్పించాలన్నారు.

అనాథ పిల్లలకు ప్రభుత్వ సహాయం

గాలివీడు, సెప్టెంబర్ 23: మండలంలోని గుండ్లచెరువు గ్రామ పంచాయతీ పసుపులవాండ్లపల్లెకు చెందిన ముగ్గురు అనాథ బాల బాలికలను ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని సర్వశిక్షా అభియాన్(రాజీవ్ విద్యామిషన్) రాష్ట్ర సాంకేతిక సహాయకులు డాక్టర్ పెంచలయ్య పేర్కొన్నారు. శుక్రవారం గురునాథపురం ప్రాథమికోన్నత పాఠశాలలో అనాథ పిల్లలను పరామర్శించి వారి తల్లిదండ్రుల మృతిపై వారితో ఆరా తీశారు. పసుపులవాండ్లపల్లెకు చెందిన మంజుల, చిన్నరమణ, షర్మిల దంపతులకు రెడ్డ్భిరతి, రెడ్డిమహేష్, తేజేశ్వణిలు సంతానం కలరు. అయితే చిన్నరమణ టీబీ వ్యాధికి గురై రెండేళ్ల క్రితమే మృత్యువాతకు గురయ్యారు.

16,17న గండికోట వారసత్వ ఉత్సవాలు : కలెక్టర్

కడప,సెప్టెంబర్ 23: గండికోట వారసత్వ ఉత్సవాలు అక్టోబర్ 16,17వ తేదీల్లో గండికోటలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కెవి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో గండికోట ఉత్సవాల నిర్వహణకు ఏర్పిటుచేసిన కమిటీలతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంస్కృతి, వైభవం, సాహిత్యం ఉట్టిపడే విధంగా గండికోట వారసత్వ ఉత్సవాలు నిర్వహించేందుకు వివిధ కమిటీల సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గండికోట వారసత్వ ఉత్సవాల్లో జాతీయస్థాయి, రాష్టస్థ్రాయి, జిల్లాస్థాయిలో పేరుపొందిన కళాకారులతో రెండురోజులు కార్యక్రమాలు ఉంటాయన్నారు.

Pages