S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవయవదానం గొప్పది

అన్నదానం, వస్తద్రానం కంటే అవయవ దానం చాలా గొప్పది. బ్రెయిన్‌డెడ్ అయిన వారి, కోమాలోకి వెళ్లి సాధారణ పరిస్థితికి రావడం అసాధ్యమైన పరిస్థితులలో క్షతగాత్రుని రక్తసంబంధీకుల అనుమతితో, చట్టపరమైన అనుమతుల ద్వారా అవయవ దానం చేస్తే ప్రత్యక్షంగా మరొక రోగికి పునర్‌జీవితం ప్రసాదించిన వారౌతారు. విదేశాలలో ఈ అవయవ దానంపై మంచి అవగాహన కలిగి నిస్వార్థంగా దానం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మన దేశంలో ఈ విషయంలో ప్రజలలో ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాలలో అవగాహ న చాలా తక్కువ అనీ చెప్పాలి.

డెంగ్యూ కాటు!

అనంతపురం, సెప్టెంబర్ 23 : జిల్లాలో డెంగ్యూ, విష జ్వరాలు మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. వివిధ వ్యాధుల బారిన పడి ఆసుపత్రులో మృతి చెందిన చిన్నారుల సంఖ్య శుక్రవారానికి ఐదుకు చేరగా, మరో మహిళ కర్నూలులో మృతి చెందింది. వీరిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ముగ్గురు డెంగ్యూ బారిన పడి తుది శ్వాస వదిలారు. ఈనెల 15న అనంతపురం నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు, 22న ధర్మవరానికి చెందిన శ్రీజ(14) బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా ఇద్దరిలో ఒకరు హిందూపురం ఆస్పత్రిలో, అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని సిఐసియులో విషజ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

బాలయ్య.. రావాయ్యా!

హిందూపురం, సెప్టెంబర్ 23 : నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు బాలకృష్ణ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాలయ్య స్థానికంగా ఉండకపోవడం.. ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారం పట్ల దృష్టి కేంద్రీకరించకపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. తన వందో సినిమా బిజీలో ఉన్న బాలకృష్ణ వీలైనప్పుడు మాత్రం ఇక్కడికి విచ్చేస్తూ సందడి చేసి వెళ్లిపోతున్నారన్న ఆందోళన నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జిల్లాస్థాయి ఆసుపత్రిగా గుర్తింపు కలిగిన హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో కీలకమైన డాక్టర్ పోస్టులు, నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జిల్లాకు 50వేల క్వింటాళ్ల పప్పుశెనగ

అనంతపురం, సెప్టెంబర్ 23: జిల్లాకు 50 వేల కింటాళ్ల పప్పుశెనగ విత్తనాలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. ఇందులో ఎపి సీడ్స్ ద్వారా 30వేల క్వింటాళ్లు, ఎపి ఆయిల్ ఫెడ్ ద్వారా 20వేలు క్వింటాళ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. 2016-17 సంవత్సరం రబీకి సంబంధించి పప్పుశెనగ పంపిణీపై శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరాలోపుపొలం ఉన్న రైతులకు 25 కిలోలున్న ఒక బ్యాగు(సంచి), ఆపైన పొలం ఉన్న రైతు గరిష్టంగా రెండు బ్యాగులు (50కిలోలు) పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ప్రాథమిక చికిత్స కేంద్రాలుగా ఆర్‌ఎంపి క్లినిక్‌లు..

అనంతపురం, సెప్టెంబర్ 23 : ఆర్‌ఎంపి క్లినిక్‌లు ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(ప్రైమరీ హెల్త్ సెంటర్స్)గా కొనసాగనున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన మెడికల్ కోర్సులు చదవని వారు సైతం ఆస్పత్రుల పేరుతో బోర్డులు పెట్టి క్లినిక్‌లు నడుపుతూ ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నట్లు జిల్లాధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే జిల్లాలో డెంగ్యూ ప్రబలిన నేపథ్యంలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థ పరిధిలో ఆర్‌ఎంపిల క్లినిక్‌లను ఈనెల 17 నుంచి మూసివేయించారు.

మురికికూపంగా నల్లమాడ!

నల్లమాడ, సెప్టెంబర్ 23:పారిశుద్ధ్యంపై ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పరిశుభ్రతా చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో నల్లమాడ మాత్రం మురికి మాడగా మారుతోంది. మండల కేంద్రమైన నల్లమాడ విషయానికొస్తే బస్టాండ్ పరిసరాల్లో వున్న ప్రధాన దారి వంతెన వద్ద చెత్తాచెదారాలు, మురికినీటి నిల్వలు అధికమై దోమల అభివృద్ధి కేంద్రంగా మారింది. గ్రామంలోని సత్యమ్మవీధి, పాత మసీదు కాలనీ, ఎస్సీకాలనీ, గ్రామ సర్పంచ్ ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారాలు, మురికినీరు అధికంగా ఉంటూ దోమలు చెలరేగుతున్నాయి.

అక్రమ కట్టడాలు, లేఔట్లను ఉపేక్షించం

హిందూపురం టౌన్, సెప్టెంబర్ 23 : మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలు, అక్రమ లేఔట్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి తులసీరాం నేతృత్వంలో సిబ్బంది శుక్రవారం స్థానిక చౌడేశ్వరి కాలనీలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవన సముదాయాన్ని కూల్చివేశారు. అలాగే టీచర్స్ కాలనీలో సర్వే నెంబర్ 389/2ఏ, కొట్నూరులో సర్వే నెంబర్ 62, 66/1ఎ2, దండురోడ్డులో సర్వే నెంబర్ 361/2తోపాటు సర్వే నెంబర్లు 431/7, 431/11లలో వేసిన అక్రమ లేఔట్లను తొలగించారు. ఇకపై ఎవరైనా అక్రమంగా లేఔట్లు వేయడం, ఇళ్ల నిర్మాణాలు చేయరాదన్నారు.

పచ్చదనాన్ని కొనసాగించాలి

గుంతకల్లు, సెప్టెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిశుభ్రత, పచ్చదనాన్ని కొనసాగించాలని రైల్వే డివిజినల్ మేనేజర్ అమితాబ్‌ఓజా పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక డిఆర్‌ఎం కార్యాలయంలోని సమావేశ భవనంలో రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం కింద చేపట్టిన పరిశుభ్రత, పచ్చదనం మరింత విస్తతంగా చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్‌తో పాటు రైల్వే కాలనీలు, రైళ్లలో సైతం పరిశుభ్రత పాటించాలన్నారు. రైల్వేలో ఈనెల 17 నుండి 25 వరకూ జరిగే స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని దాదాపు 86 మంది అధికారులు పర్యవేక్షిస్తారన్నారు.

స్వచ్ఛ్భారత్‌లో భాగంగా ‘రైల్వే సంవాద్’

హిందూపురం టౌన్, సెప్టెంబర్ 23 : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైల్వే అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ప్రయాణికుల కోసం అమలు చేస్తున్న సదుపాయాల గురించి స్టేషన్‌లో ప్రయాణికులతో అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిఎన్ భరత్ తివారి, డాక్టర్ ప్రతిమ, స్టేషన్ మాస్టర్ సతీష్‌రెడ్డి, ఎస్సై షాజీ, సోమప్ప, ఎస్‌డబ్ల్యుఆర్‌ఎంయూ కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రావతార్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 23:ఎస్‌ఎ.రావతార్ ఫ్యాక్టరీలో తొలగించిన 183 మంది కార్మికులను వెంటనే విధుల్లకి తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని పరిగి మండలంలో గల ఎస్‌ఎ.రావతార్ ఫ్యాక్టరీలో తొలగింపబడ్డ కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా శుక్రవారం సంఘీభావ సభ నిర్వహించారు.

Pages