S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకేంద్రుడి క్లాస్‌రూమ్

కె.రాఘవేంద్రరావు దర్శకుడుగా ఉన్నాడు అంటే ఆ చిత్రం హిట్ అయినట్లే. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినట్లే. ఆయన కెరీర్‌లో అనేక హిట్స్ ఉన్నాయి. రాఘవేంద్రరావు మార్క్ అనేది ప్రతీ చిత్రంలో ఆయన చూపారు. అందుకే ఆయనను అభిమానులు దర్శకేంద్రుడు అని పిలుచుకుంటారు. దాదాపు 100 సినిమాలకుపైగా రూపొందించిన ఆయన తాజాగా సినీపాఠాలను చెప్పడానికి సిద్ధమయ్యారు. కమర్షియల్ చిత్రాలతోపాటు క్లాసికల్ చిత్రాలను రూపొందించిన ఆయన, తన 50 ఏళ్ళ సినీ అనుభవాలను పాఠాలుగా చెప్పనున్నారు. పాటల చిత్రీకరణలో తన మార్క్ ఎలా వుంటుందో, అదేవిధంగా ఈ పాఠాలు బోధించడంలో కూడా ఆయన కొత్త పంథాను ఎన్నుకున్నారు.

యధార్థ సంఘటనలతో హ్యాపీ బర్త్‌డే

చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతిసేథి, సంజన, శ్రవణ్ కీలక పాత్రల్లో పల్లెల వీరారెడ్డి (చె గువేరా) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. ఈ చిత్రాన్ని శ్రీనందన్ మూవీస్ పతాకంపై మహేష్ కల్లె నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి దర్శకుడు వీరారెడ్డి మాట్లాడుతూ- కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ ఇదని, ఒకే ఇంట్లో ఓ జంటకు ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్రమని, రాత్రి 8 నుంచి 12గంటల మధ్య ఏం జరిగింది అనేది సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందించామని, ముఖ్యంగా ఇందులోని 15 నిమిషాల గ్రాఫిక్స్ హైలెట్‌గా నిలుస్తాయని అన్నారు.

నవ్వడమే ఒక టానిక్

పార్క్‌కి వెళ్లినప్పుడల్లా ఓ గమ్మతె్తైన దృశ్యం కనపడుతుంది. ఓ ఇరవై మంది నిల్చోని బిగ్గరగా నవ్వుతూ కన్పిస్తారు. సరదాగా మాట్లాడుతూ నవ్వుకోవడం కాదు. నవ్వాలని నవ్వడం. దాన్ని ఓ క్లబ్‌గా కూడా పిల్చుకుంటారు. అదే లాఫింగ్ క్లబ్. జీవితంలో నవ్వడం మరిచిపోయి ఉదయం అందరూ జమకూడి నవ్వుతూ ఉంటారు.
నవ్వడం మంచిదే. నవ్వుతూ ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఎదుటి వారు క్రింద పడితే వాళ్లని చూసి నవ్వడం ఎంత తప్పో, నవ్వకుండా ఒక్కరోజు గడపడటం అంతకన్నా పెద్ద తప్పు.

-జింబో 94404 83001

చివరి షెడ్యూల్‌లో ఆక్సిజన్

గోపీచంద్, రాశీఖన్నా జంటగా జగపతిబాబు ముఖ్యపాత్రలో ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా వివరాల గురించి దర్శకుడు జ్యోతికృష్ణ తెలియజేస్తూ, గోపీచంద్‌కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలని, ఆయన హీరోగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రమిదని, ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిందని అన్నారు.

నయాపైస (సండేగీత)

వీడి తల మీద నయాపైస పెట్టినా పైసకి ఎవరూ కొనరు అన్న మాటని వినేవాళ్లం. పైస అంటే ఏమిటో ఇప్పుడు ఆశ్చర్యం.

ఆదిత్యకు అంతర్జాతీయ అవార్డు

భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై బాలల చిత్రంగా రూపొందించిన చిత్రం ‘ఆదిత్య’. ‘క్రియేటివ్ జీనియస్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అమెరికాలోని లాస్‌ఏంజిలిస్‌లో నిర్వహించిన జెన్రీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలల చిత్ర ప్రదర్శనకు ఎంపికై ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది.

త్వరలో 21 సెంచరీ లవ్

గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా బి.ఆర్.ఎస్.ఐ పతాకంపై గోపీనాధ్ దర్శకత్వంలో పోల్కంపల్లి నరేందర్ రూపొందించిన చిత్రం ‘21 సెంచరీ లవ్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గోపీనాధ్ మాట్లాడుతూ, స్నేహమూ ప్రేమా ఆకర్షణలో పడి నేటి యువతరం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని, పలువురికి ఈ చిత్రం చూపిస్తే అందరూ అభినందించారని, తొలి కాపీ సిద్ధమైందని అన్నారు. ‘గుంటూరు టాకీస్’ ద్వారా ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, నేటి యువతరానికి ఈ సినిమా వందశాతం నచ్చుతుందని తెలిపారు.

నేడు అ ఆ విజయోత్సవం

నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన తారాగణంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ రూపొందించిన చిత్రం ‘అ ఆ’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక ఈనెల 12న గుంటూరులో జరపనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ, అన్ని కేంద్రాల్లో విజయఢంకా మ్రోగిస్తున్న ‘ఆ ఆ’ చిత్రం విజయాన్ని అందుకున్న సందర్భంగా ప్రేక్షకులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడానికి విజయోత్సవ వేడుకను నిర్వహిస్తున్నామని తెలిపారు.

భారీ పారితోషికం!

బాలీవుడ్‌లో తక్కువ సినిమాలు చేసినా క్రేజ్ పరంగా మాత్రం ఎక్కువే గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ పరిణీతి చోప్రా. త్వరలోనే ఈమె సౌత్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. మహేష్‌బాబు హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కే చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఓకె చెప్పిందట. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ భారీ సినిమా కోసం పరిణీతి తీసుకున్న రెమ్యూనరేషన్ అందరికీ షాక్ ఇస్తోంది. దక్షిణాదిలో ఇప్పటివరకూ ఎవరూ తీసుకోని మొత్తాన్ని ఆమె తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటివరకు దక్షిణాదిలో టాప్ హీరోయిన్లు అయిన అనుష్క, కాజల్, తమన్నా లాంటివారు రెండు కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు.

Pages