S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జేబుల్లో మొక్కలు

పూలకుండీల్లో, గార్డెన్‌లో మొక్కలు పెంచడంలో మజా ఏముంది. ఇలా జీన్ ఫ్యాంట్ జేబుల్లోనూ మొక్కలు పెంచొచ్చు అంటున్నారు కొందరు ఔత్సాహికులు. పశ్చిమ లండన్‌లో ఇలా తీగలకు వేళ్లాడదీసిన బట్టల జేబుల్లో మొక్కలు పెంచడం ఇప్పుడు ఓ ఫ్యాషన్ అయిపోయింది.

భారతి

పూబాల

ఫ్యాషన్ ప్రపంచం ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. పూలతోటలోకి వచ్చిన ఓ మోడల్ ఇలా పూలపొదమాటునుంచి అందాలు ఆరబోస్తోంది. లండన్ ఫ్లవర్ షోలో ఆమె ఇలా కన్పించింది.

మనిషిలాంటి చెట్టు

ఈ 65 అడుగుల చెట్టును హఠాత్తుగా చూస్తే అచ్చం మనిషిలా ఉందికదూ. చాలామంది పర్యాటకులు దీనిని చూసి అవాక్కవుతున్నారు. రెండు చేతులు, తల, మొండెం, రెండు కాళ్లు ఉన్నట్లు ఈ భారీ వృక్షం మనిషిని పోలినట్లు ఉండటంతో పెద్దసంఖ్యలో జనం వస్తున్నారు. కానీ దానిని చూసి ఆశ్చర్యపోవడమే కాదు ఒకింత భయపడుతున్నారటకూడా. బల్గేరియాలోని బాల్కన్ పర్వతశ్రేణుల్లో ఈ వృక్షం ఇప్పుడు పెద్ద ఆకర్షణగా మారిపోయింది. ఈ చెట్టు ఫోటోను సోలెంట్ ఫొటోగ్రాఫర్ డెయాన్ కొస్సెవ్ ప్రపంచానికి అందించాడు.

లొట్టిపిట్టల పుష్కరం

రాజస్థాన్‌లోని పుష్కర ప్రాంతంలో ఈమధ్య స్థానిక సంప్రదాయ పద్ధతుల్లో ఉత్సవాలు నిర్వహించారు. అక్కడ ఒకదాని పక్కన ఒకటి వ్యతిరేక దిశలో నిల్చున్న రెండు ఒంటెలు దూరంనుంచి ఇలా కనిపించి కనువిందు చేశాయి. చూడటానికి రెండుతలల ఒంటెలా ఉన్నా అక్కడ ఉన్నవి రెండు ఒంటెలే.

అంధుల కోసం ఇలా...

ఏనుగు ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ చూపులేనివారికి ఎలా తెలుస్తుంది. అందుకే ఇదిగో ఇలా నేలమీద జారబడిన ఓ ఏనుగును తాకి తెలుసుకుంటున్నారు వారంతా. ఇది థాయ్‌లాండ్‌లోని ఓ జూలో నిర్వహిస్తున్న క్లాస్. ఇక్కడున్న రెండు ఏనుగులు ఇలా నేలమీద పడుకుంటాయ్. అంధులు, వికలాంగులు వచ్చి వాటిని తాగి, వాటి శరీరభాగాల గురించి తెలుసుకుంటారు. దీనికోసం ఆ రెండు ఏనుగులకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. ఈ ఫొటోలు కన్పిస్తున్న ఏనుగు పేరు క్యాన్ మియాంగ్.

ఒంటికాలితో ఈదే హంస

అలనాటి రాజహంసల మాట కాదుగానీ..ఈనాటి హంసల(స్వాన్)కూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నీళ్లలో ఈదేటపుడు అవి ఒంటికాలితోనే వెళతాయి. ఓ కాలును మడిచి వీపుపై పెట్టి ఈతకొడతాయి. మగహంసలకు పురుషాంగం ఉంటుంది. పక్షుల్లో ఈ ప్రత్యేకత వీటికే ఉంది. సాధారణంగా నేలపైకి వచ్చి ఆహారం తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడవు. వీటికి కోపం ఎక్కువే. ప్రమాదం ఉందని తెలిస్తే...అవి ఎదురుదాడి చేస్తాయికూడా. ప్రతీ హంసకు కనీసం 25వేల ఈకలు ఉంటాయి. తెల్లహంసలు దక్షిణ అమెరికాలోను, నల్లహంసలు ఆస్ట్రేలియాలోనూ కన్పిస్తాయి. గంటకు 60 కి.మీ దూరం ఎగురగల ఈ పక్షులు ఎక్కువదూరం ప్రయాణించవు.

ఎస్.కె.కె.రవళి

నీళ్లపై పరిగెట్టే తొండ

మధ్య అమెరికాలో కన్పించే ఈ తొండలు నీటి ఉపరితలంపై అతివేగంగా పరిగెడతాయి. అదీ వెనుక రెండు కాళ్లతోనే. ఏసుక్రీస్తు నీటిపై నడిచాడన్న విశ్వాసం మేరకు వీటినీ ‘జీసస్ క్రైస్ట్ లిజార్డ్’గా పిలుస్తారు. శత్రువునుంచి ముప్పు ఉంది అన్నప్పుడు మాత్రమే ఇవి అలా నీళ్లపై పరుగులుతీస్తాయి. నిమిషంలో 30 మీటర్ల దూరం ఇవి అలా ప్రయాణించగలవు. పిల్లలైతే మరీ వేగంగా నీటిపై ప్రయాణిస్తాయి. ముదురు జేగురు, ఆకుపచ్చటి రంగుల్లో కన్పించే వీటి శరీరంలో 70శాతం తోక ఉంటుంది. వీపుపై మూపురం, పదునైన పళ్లు, కాళ్లకు ప్రత్యేకమైన వేళ్లు ఉంటాయి. అతి తేలికగా ఉండటం వల్ల ఇది అతివేగంగా నీటిపై తేలుతూ వెళ్లిపోతుంది. ఆకులకింద చాలాకాలం ఇవి బతికేయగలవు.

దీని లాలాజలం విషం

ఎలుకలా కన్పిస్తున్నప్పటికీ ఆ జాతికి ఎటువంటి సంబంధం లేని ఈ ‘ట్రీ ష్రూ’ ఓ క్షీరదం. నీటిపై బుడగలు సృష్టిస్తూ వాటిపైనుంచి పరిగెట్టడం వీటి ప్రత్యేకత. వీటి పృష్ట్భాగంలో ఉండే గ్రంధులవల్ల అవి మరణించినప్పుడు ఓ రకమైన రసాయనం వెదజల్లబడుతుంది. వీటిని శత్రువులు చంపేసినా ఈ వాసన భరించలేక తినకుండా వెళ్లిపోతాయి. అన్నట్లు వీటి పళ్లలో విషం ఉంటుంది. ఆ విషం లాలాజలంలో కలిసి శత్రువుల ప్రాణాలు తీస్తుంది. అది ఎంత ప్రమాదకరం అంటే ఒక పంటినుంచి వచ్చే విషంతో 200 ఎలుకలను చంపగలవు. నిమిషానికి 700 సార్లు దీని గుండె కొట్టుకుంటుంది. రోజంతా ఇది ఆహారం తింటూనే ఉండాలి. ఓ పూట ఆహారం లేకపోతే ఇది మరణిస్తుంది.

టార్గెట్ టాలీవుడ్డే!

తెలుగులో ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’, ‘బస్‌స్టాప్’, ‘కేరింత’ చిత్రాలతో మంచి అభినయం వున్న నటిగా అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య మంచి మార్కుల్నే కొట్టేసింది. ఆయా చిత్రాలో ఈ అమ్మడు చేసిన పాత్రలు టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి..ఆకట్టుకున్నాయి కూడా. అయితే టాలీవుడ్ మాత్రం ఈమె వైపు చిన్నచూపునే చూస్తోంది. కారణాలు తెలియకపోయినా, కనీసం తెలుగమ్మాయి అయినందుకైనా అవకాశాలు ఇవ్వాలిగా అని కొందరంటే ‘ప్చ్..చూద్దాంలే’ అంటూ దాటేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కోలీవుడ్ మాత్రం శ్రీదివ్యకు మంచి అవకాశాలే ఇస్తోంది. అక్కడ విశాల్ హీరోగా నటించిన ‘మరుదు’ తెలుగులో ‘రాయుడు’గా వచ్చింది.

-సమీర్

తెలివైందే!

బాలీవుడ్‌లో ‘బాజీరావు మస్తానీ’ చిత్రం తర్వాత విన్ డీజిల్ సరసన ‘ట్రిపుల్ ఎక్స్: ది జాండర్ కేజ్’ చిత్రంతో హాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన దీపికా పదుకొనే పరిస్థితి ప్రస్తుతం బాలీవుడ్‌లో అంత ఆశాజనకంగా లేదని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. హిందీలో యువ కథానాయికల జోరు కొనసాగుతుండడంతో ఇలాంటి తారల కెరీర్ రోజు రోజుకీ మసకబారుతోందని అంటున్నారు. హాలీవుడ్‌లో ‘ట్రిపుల్ ఎక్స్’ చిత్రంలో నటిస్తూ ప్రస్తుతం అక్కడ బిజీగానే వుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో హాలీవుడ్ తప్ప బాలీవుడ్ చిత్రాలే లేవనీ అంటున్నారు. దీంతో ఇక బాలీవుడ్‌కు దూరమైనట్టేనా? అని దీపికాను అడిగితే- ‘‘అలా అని ఎందుకనుకుంటున్నారు?

Pages