S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉక్కు పిడికిలి

నేనే వీరుడినని జబ్బచరిచి చెప్పగలిగే ధీశాలి అతడు...
పిడికిలి బిగించి పంచ్ విసిరితే ప్రత్యర్థి మట్టికరవాల్సిందే...
అతడు గుండెనిండా ఊపిరి తీసి మాట విసిరితే...ముష్టిఘాతమే...
బరిలో దిగకముందే హూంకరించి శత్రువును భయపెట్టే కండలవీరుడాయన...
యుద్ధానికైనా సమఉజ్జీలుండాలని నమ్మి వియత్నాంపై యుద్ధం వద్దని
దేశాన్ని ఎదిరించిన యోధుడు..
మాటలో.. చేతలో పంచ్...
జీవితం చివరివరకూ అదే ధోరణి... 74 ఏళ్ల..వృద్ధాప్యంలోనూ తగ్గని కసి...

-విశ్వమిత్ర

ఆంతర్యం! (కథానిక)

అవంతిక రాజ్యం కార్తికేయ మహారాజు పాలనలో సుఖశాంతులతో సుభిక్షంగా సాగుతూ ఉండేది. కార్తికేయ మహారాజుకు ఒక్కగానొక్క కొడుకు నిత్యయవనుడు. అతను చిన్న నాటి నుండి అతి గారాబంగా పెరిగాడు. తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది వ్యవహారం. కార్తికేయ మహారాజు తనకు అరవై ఏళ్లు దాటాక సన్యాసం స్వీకరించాలని చాలా కాలం క్రితం నిర్ణయించుకోవడంతో రాజ్యాధికారాన్ని కుమారుడికి అప్పగించి బయలుదేరాడు. నిత్యయవన మహారాజు మంచి శరీర సౌష్టవం, రూపం గల వ్యక్తి. తను దినములో ఎక్కువ భాగం తన వ్యిక్తిగత ఆరోగ్యం, అంద చందాల మీదనే ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు. రాజ్యపాలన గురించి గానీ, ఆర్థికాభివృద్ధి గురించి కానీ ఆలోచించేవాడు కాదు.

- చావలి శేషాద్రి సోమయాజులు,

కార్పొరేట్ కల్చర్ (మినీకథ)

వెంకటరాఘవపురంలో మునసబుగా పని చేసాడు నవనీతంనాయుడు. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లతో అతని ఇల్లు నిత్యం కళకళలాడుతుండేది. అతని మనవడు నవీన్. అతను ఐఐటి ఖరగ్‌పూర్‌లో బిటెక్ చేస్తున్నాడు. అక్కడే అశ్విని అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకు ఇంట్లో వాళ్ల నుండి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాదని అతను భావించాడు. అయితే విషయం తెలిసిన నవనీతంనాయుడు మండిపడ్డాడు. ‘‘ఇంటా వంటా లేని పనులు చేస్తావా?’’ అంటూ మనవడి మీద విరుచుకుపడ్డాడు. పెద్దత్త కూతురు స్వప్నని చేసుకోవాలని ఆజ్ఞ జారీ చేశాడు. అయితే నవీన్ తాత వ్యతిరేకతను పట్టించుకోలేదు.

- ఎం.వి. స్వామి, చోడవరం, విశాఖ జిల్లా - 531036. సెల్ : 9441571505.

నిజాయితీ కవిత్వం నల్లమల నందివర్ధనాలు

తన తల్లి కీర్తిశేషులు భారతమ్మకి భక్తిశ్రద్ధలతో అంకితమిచ్చిన డాక్టర్ కురుమేటి కిశోర్‌కుమార్ కవితా సంపుటి ఈ నంది వర్ధనాలు. నంధ్యాలలో ప్రముఖ దంత వైద్యుడిగా ఉంటూ మరో వంక సాహితీప్రియత్వం, రచనా పటిమ గల సవ్యసాచి. ఇది వీరి ప్రథమ రచన. చేయి తిరిగిన అనుభవం ఉన్నట్లు రాశారు ఆయన. ఇందులో మొత్తం 56 కవితలున్నాయి. అన్నీ వైవిధ్యంగా సాగాయి. కొన్ని భారతీయ సంస్కృతికి అద్దం పడతాయి. కొన్ని భౌగోళిక, ప్రాకృతిక సౌందర్యాన్ని సందర్శింపజేస్తాయి. కొన్ని సామాజిక స్పృహను కలిగిస్తాయి. మరికొన్ని జీవకారుణ్యాన్ని, శాంతిని బోధిస్తాయి. అన్నింటిలో మానవతావాదం తొణికిసలాడుతుంది.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు, సెల్ : 9293327394.

ట్రాఫిక్ జామ్!

రైతుబజారు దగ్గర ఆదివారం వచ్చిందంటే చాలు నడవడానికి కూడా దారి ఉండదు. రెండు వైపులా తోపుడుబళ్లు, వాటి మధ్యలో వాహనాల పార్కింగ్. రోడ్లపైనే అమ్మకాలు సాగిపోతుంటాయి. లోపలికెళ్లడానికి విపరీతమైన శ్రమ. అటు నుండి కూరగాయాల బ్యాగుతో రావడం మరీ శ్రమ. కొంచెం దూరంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇద్దరుంటారు. మెయిన్‌రోడ్డుపై వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు గానీ ఇటు వైపు చూడరు.
రాజుకి ప్రతి ఆదివారం రైతుబజారుకు వెళ్లాలంటే ఇబ్బంది. వాహనం పార్కింగ్ ఓ శ్రమ. లోపలికి వెళ్లడం కష్టం. బయటికి రావడం అబ్బో ఓ తెలుగోడా! ఏమిటీ క్రమశిక్షణ లేని వ్యక్తిత్వం! వీరు మారరా’ అనుకున్నాడు.

-మల్లారెడ్డి రామకృష్ణ, బుడితి

ప్రేమకానుక

మా అమ్మాయి స్వీడన్‌లో చదువుకుంటున్నది. సెలవులు వచ్చాయని రెండు వారాలపాటు మళ్లీ ఇక్కడికి వచ్చింది. ఉన్న కొద్దికాలంలోను కనీసం ఒక వారం ఆమె చెన్నైలో గడిపింది. చక్కగా పథకం వేసుకుని మద్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లోని సంగీత కచేరీలను వినడానికే తాను వచ్చిందని నాకు అర్థమయింది. హైదరాబాద్‌లో ఉన్న కొద్దికాలంలోను బుక్‌ఫెయిర్ జరుగుతున్నదని తనకు తెలుసు. మామూలుగానయితే నేను నా పిల్లలతో కలిసి బుక్ ఫెయిర్‌కు వెళ్లి పుస్తకాలు కొనడం అలవాటు. మా పాపకు ఈసారి ఆ వీలు కుదరలేదు. తన నేస్తాలతో కలిసి వెళ్లినట్టుంది. ఒక రాత్రి తన పద్ధతిలో టట్టడాయ్! అంటూ ఇంట్లోకి వచ్చి నాకొక సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.

కె.బి. గోపాలం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

వాండ్రంగి కొండలరావు, పొందూరు, శ్రీకాకుళం జిల్లా
హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఇతర మతాల నుంచి హిందూమతంలోకి వచ్చే వారెవ్వరూ బహుశా లేరు. ఎందుకీ పరిస్థితి వచ్చిందంటారు?
హిందూ మతస్థులు ఆ విషయం మీద శ్రద్ధ పెట్టక. వివిధ కారణాల వల్ల బయటికి పోయిన వారిని వెనక్కి తీసుకురావటం ఎంత అవసరమో గుర్తించక. కాలానికి తగ్గట్టు ఆచారాలను, సంప్రదాయాలను సంస్కరించి, నయానో భయానో అందరినీ ఒక దారికి తెచ్చి మతాన్ని కాపాడగల దార్శనిక ప్రజ్ఞావంతులు హిందూ సమాజంలో లేక.

జీరోసైజ్‌కు మారండిలా..

అమ్మా! నువ్వు చాలా అందంగా ఉన్నావు.కాని లావుగా ఉన్నావు అని కూతురు రిషిత చేసిన పెదవి విరుపు కామెంట్ 32 ఏళ్ల అనిషా బెనర్జీని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. కూతురు చెప్పిన చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మళ్లీ పాత అనిషాగా ఎలా మారాలా అనే ఆలోచనలో పడింది. ఎలాగైనా సన్నబడాలి అని సంకల్పదీక్ష తీసుకుంది. ఆరునెలల పాటు శ్రమించింది. మళ్లీ పాత అనిషా బెనర్జీగా మారిపోయింది. విచిత్రంగా 74 కిలోలు బరువు ఉన్న ఆమె 54 కిలోలకు తగ్గిపోయి జీరోసైజ్‌కు మారిపోయింది. కోల్‌కతాకు చెందిన ఈ అమ్మ తాను సన్నబడటానికి ఏమేమి తిన్నాను, ఎలాంటి వ్యాయమం చేశానో వివరిస్తూ ఫొటోలతో సహా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.

పజిల్ 579

అడ్డం

ఆధారాలు

నిశాపతి

ఆరోగ్యంగా ఎదిగేలా వ్యాక్సిన్లు...

బిడ్డ పుట్టిన వెంటనే కెవ్వున కేక వేస్తే ఆ తల్లికి ఎంతో ఆనందం. పుట్టిన బిడ్డకు వెంటనే పాలివ్వాలని ఆరాటపడే తల్లి ఆ బిడ్డ ఏటేటా ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన వ్యాక్సిన్లు కూడా ఇప్పించేందుకు ఆసక్తి కనబర్చటం లేదు. పిల్లలు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా, భవిష్యత్తులో ప్రాణంతకమైన జబ్బులు రాకుండా అవసరమయ్యే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. డిటిపి, తట్టు తదితర అంటువ్యాధులు రాకుండా ఇచ్చే టీకాలను ఇప్పించటంలో తల్లిదడ్రులు శ్రద్ధచూపటం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలో రెండు వంతుల మంది పిల్లలకు వ్యాక్సినే్ల వేయించటం లేదని మిచిగాన్ యూనివర్శిటీవారు చేసిన సర్వే వెల్లడైంది.

Pages