S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెత్తనం (కథ)

లలిత బంధువులింట రాత్రి జరిగే పెళ్లికి రామచంద్రపురం వచ్చింది. వివాహం అయ్యేసరికి తెల్లవారింది. తర్వాత కాలకృత్యాలు ముగించుకుని స్నానం చేసింది. కాఫీ ఫలహారాలు సేవించాక పెళ్లివారి వద్ద శెలవు తీసుకుని ఆటోలో తెలిసిన వారంటికి వెళ్లి అక్కడ ఒక గంట గడిపింది. తర్వాత ఆ ఇంటి కోడలికి చెప్పి నడిచి పాత బస్టాండ్‌కు వచ్చి బయలుదేరబోతున్న కాకినాడ బస్సెక్కింది.
రాత్రి పెళ్లిలో చాలామంది చాలా ఆప్యాయంగా అభిమానంతో మాట్లాడారు లలితతో.

- కృష్ణ మాధవరపు

శబ్ద చమత్కార కవి... వేంకట కవి!

17వ శతాబ్ది ప్రథమార్ధంలో తంజావూరు రఘునాథ భూపతి ఆస్థానంలో చేమకూర వెంకటపతి అనే కవి వుండేవాడు. ఆయన శృంగార రస ప్రధాన గ్రంథాలు రెండు రాశాడు. మొదటిది సారంగధర చరిత్ర. ఇది ఆయన ప్రథమ ప్రయత్నం అవటం వల్ల అంత బాగా కుదరలేదు. అయినా కొన్ని పద్యాలు అద్భుతంగా వుంటాయి. మచ్చుకొక పద్యం.
కలరా యిలరాయనికిం
కులసతి రత్నాంగి భోగ కుటిల శిరోజా
తిలకము చిత్రాంగియు నన
నెల జవ్వను లిరువు రంబుజేందు నిభాస్యల్.

- ప్రయాగ కృష్ణమూర్తి,

‘విధ్వంసక ముఖచిత్రం’ తిలకిద్దాం! (పుస్తక పరిచయం)

పుస్తకం కవి / రచయిత చిరునామా అని ఓ ప్రముఖ కవి కితాబు. నిజమే మరి తన రచనలు ఒక చోట నిక్షిప్తం చేసుకుని ముద్రించుకున్న పుస్తకం కవిని తెలిపే చిరునామా. అయితే దానికి ఓ నలుగురు కవులో, రచయితలో రుజువుపరిచే సాక్ష్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజానికి బాధ్యుడు కవి. సామాజిక స్పృహకు స్ఫూర్తికారకుడు కవి.

రగిలిన భానుడు ( మనోగీతికలు)

వేసవి మండుటెండలో
ఉక్కబోతతో హోరెత్తిపోతుంటే
ఉన్నట్టుండి వీస్తున్న వడగాడ్పులకు
ప్రాణాలు ఆవిరైపోతుంటే
జాతీయ రహదారిపై ఒంటరి పయనం
కాళరాత్రి కన్నా కర్కశంగా
కఠిన హృదయం కలదై
కాలం సాగదీసుకొని
కళ్లల్లో నిప్పులు పోసుకొని
ఈ సమస్త ప్రాణికోటిపై
కసిదీరా కుమ్మరిస్తుంటే
ఇక మనుగడ
మరణ సదృశమే!

- బూడిద శ్రీనివాసరావు,
బుద్దవరం, కృష్ణా జిల్లా.
చరవాణి : 9848736511
***

ఏరువాక ఎదురొచ్చింది!

శబ్ద చమత్కార కవి... వేంకట కవి!

17వ శతాబ్ది ప్రథమార్ధంలో తంజావూరు రఘునాథ భూపతి ఆస్థానంలో చేమకూర వెంకటపతి అనే కవి వుండేవాడు. ఆయన శృంగార రస ప్రధాన గ్రంథాలు రెండు రాశాడు. మొదటిది సారంగధర చరిత్ర. ఇది ఆయన ప్రథమ ప్రయత్నం అవటం వల్ల అంత బాగా కుదరలేదు. అయినా కొన్ని పద్యాలు అద్భుతంగా వుంటాయి. మచ్చుకొక పద్యం.
కలరా యిలరాయనికిం
కులసతి రత్నాంగి భోగ కుటిల శిరోజా
తిలకము చిత్రాంగియు నన
నెల జవ్వను లిరువు రంబుజేందు నిభాస్యల్.

- ప్రయాగ కృష్ణమూర్తి

శిక్షాస్ఫూర్తి ( చిన్న కథ)

‘స్టూడెంట్స్! మీరంతా బాగా చదివి, దేశం గర్వించదగ్గ మేధావులై దేశానికి మంచిపేరు తేవాలి’.. అంటూ అభిలషించారు తెలుగు మాస్టారు. ‘ఇప్పుడున్న పేరు బాగానే ఉందిగా మాస్టారు! భా-ర-త-దే-శం. ఇంకా ఏం మంచిపేరు తేవాలి?’ ఛలోక్తిగా అన్నాడు ఒక విద్యార్థి.
‘ఒహో! నీకు అలా అర్థమైందా? కూర్చో వెధవా!’ అంటూ గదమాయించారు. ఇంతలో మాస్టారి అనుమతితో లోపలికి వచ్చిన ఒక యువతి మాస్టారికి ఒక ఫొటో ఇచ్చి గుర్తుపట్టమన్నది.

దోపిడీ, పీడనల్ని కళ్లకు కట్టిన ‘చొరబాటు’ (పుస్తక పరిచయం)

‘కంచి మేకలు’ కథా సంపుటితో ప్రారంభించి ‘చొరబాటు’తో కథకుడిగా తన స్థానం సుస్థిరం చేసుకున్న కథా రచయిత శిరంశెట్టి కాంతారావు. నాలుగో కథా సంపుటిగా ఆయన ‘చొరబాటు’ను ప్రచురించారు. ఈ కథలన్నీ ఇంతకుముందు వివిధ పత్రికల్లో ప్రచురించినవే. ఇందులో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి. ప్రతి కథలోనూ దోపిడీ, పీడన సామాన్యుని జీవితంలోకి ఎలా చొరబడతాయో దృశ్యమానం చేసి చూపారు రచయిత. చదువరి తన చుట్టూ నిత్యం జరుగుతున్న దోపిడీలను చూస్తున్నా, తనదాకా రానంత వరకు పట్టించుకోడు. కాంతారావు లాంటి సామాజిక బాధ్యత ఏమిటో తెలిసిన రచయిత చెప్పినప్పుడు కాస్త ఆలోచిస్తాడు. ‘అవును నిజమేకదా!’ అనుకుంటాడు.

గంగమ్మా... భువికి రావమ్మా! (మనోగీతికలు)

విష్ణుమూర్తి అంగుష్టమునందు
ఉద్బవించిన గంగమ్మా
ఉర్వి పైకి రావమ్మా
శివుని జటాజూటాలలో
చిక్కుకున్న గంగమ్మ
జగానికి రావమ్మా
పంచభూతాలలో
నీవొకదానివి గంగమ్మా
ప్రాణికోటికంతటికీ
అవసరమైన గంగమ్మా
పృధ్విపైకి రావమ్మా
నీవు లేని జగము నిర్మానుష్యమ్ము
జీవకోటికంతటికీ
నీవే జీవనాధారము
బంగారు పంటలు పండించమ్మా
దుర్భిక్ష్యాన్ని నీవు దూరం చేయమ్మా
నీలోటు మాకెప్పుడూ
రానీయకమ్మా
నిత్యం నిన్ను పూజిస్తుమమ్మా
భగీరథుని కోరిక మేరకు
ఏనాడో భువికి వచ్చినావమ్మా
అపర భగీరథులమై
మానవాళి నీ రాకకు

మహా విజేత 7

చంద్రహాసుడు తన నడుముకు వున్న మోకుని లాగాడు. దాని ఒక కొసను వలయాకారంలో తిప్పి మోకుకు ముడిపెట్టేశాడు. ఉరితాడులా తయారయిందది. కోటగోడకు ఒకటి రెండు అడుగులు ఇవతలకు వచ్చి, గురిచూసి ఆ మోకును బురుజు పైకి విసిరాడు. అతని ప్రయత్నం ఫలించలేదు. మోకుకు పట్టు చిక్కలేదు. నిరాశపడక ఈసారి మరింత వేగంగా, మరింత శక్తితో విసిరాడు. ఇప్పుడు దానికి పట్టు చిక్కింది. లాగిలాగి చూశాడు. ముడి బిగిసింది.
అడివప్పను చూశాడు. అతడు కోటగోడను ఎక్కేస్తున్నాడు.
సంతృప్తిగా ఊపిరిపీల్చి, దక్షణ్ణకు సైగచేసి త్వరత్వరగా బురుజు పైకి చేరిపోయాడు. రక్షణ నిమిత్తం దక్షణ్ణ అక్కడే ఉండిపోయాడు.

-విహారి 98480 25600

ఆకలి పోరాటం (భగత్‌సింగ్ 32)

జైళ్లు, సంకెళ్లు విప్లవకారులను కట్టివేయలేవు. నాలుగు గోడల నడుమ బలవంతంగా బంధిస్తే ఆ బంధనాలలోనే వారు పోరాటానికి దారి వెతుక్కుంటారు. చేతిలో ఆయుధం ఉన్నంతవరకూ విప్లవకారుడు ఆయుధంతో పోరాడుతాడు. అది లేనప్పుడు ఆకలినే ఆయుధంగా మలచుకుంటాడు.
పార్లమెంటు బాంబు కేసు విచారణను ఎంత వేగిరం ముగించి, సాండర్స్ కేసు తాడుతో భగత్‌సింగ్ మెడకు ఎంత త్వరగా ఉరి వేద్దామా అని బ్రిటిషు సర్కారు తొందరపడినట్టే, ఆ సర్కారును బోనులో నిలబెట్టటానికి భగత్‌సింగ్ కూడా తన వ్యూహం తాను పన్నాడు. అతడిని బంధించిన బందిఖానాయే తదుపరి కర్తవ్యాన్ని స్ఫురింపజేసింది.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ

Pages