S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్ డైమండ్ ఆల్థియా

వింబుల్డన్‌లో శే్వత జాతీయుల ఆధిపత్యానికి గండికొట్టిన తొలి క్రీడాకారిణి ఆల్థియా గిబ్సన్. 1957 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె డార్లెన్ హార్డ్‌పై 6-3, 6-2 తేడాతో విజయభేరి మోగించింది. వింబుల్డన్ టైటిల్ సాధించిన తొలి నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించింది. అంతకు ముందే ఆమె ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ఏంజెలా మోర్టిమెర్‌ను ఓడించి, తొలి గ్రాండ్ శ్లామ్‌ను సాధించింది. టైటిల్ గెలవడం పక్కకు ఉంచితే, మహిళలు లేదా పురుషుల విభాగాల్లో అప్పటి వరకూ ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి నల్లజాతీయులు ఎవరూ అడుగుపెట్టలేదు. 1958లో మరోసారి వింబుల్డన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఆల్థియాకు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం కూడా లభించింది.

- శ్రీహరి

అనధికార ప్రపంచకప్ వింబుల్డన్!

టెన్నిస్ ర్యాకెట్ చేతపట్టిన ప్రతి ఒక్కరికీ వింబుల్డన్ ఒక కల. ఈ టోర్నీ గురించి ఎన్నో కలలు కంటారు. ఎన్నో ఆశలు నింపుకొంటారు. అక్కడి టెన్నిస్ కోర్టుల్లో గడిపిన ప్రతి క్షణాన్ని మధుర స్మృతిగా కలకాలం మదిలో దాచుకుంటారు. అక్కడ క్వాలిఫయర్స్‌ను నెగ్గి మెయిన్‌డ్రా చేరుకుంటే చాలు టెన్నిస్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకున్నందుకు సార్థకత చేకూరిందని అనుకుంటారు. ఇక టైటిల్ గెలిస్తే జన్మధన్యమైందని మురిసిపోతారు. వింబుల్డన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. టెన్నిస్‌లో అనధికార ప్రపంచ కప్ వింబుల్డన్. టెన్నిస్‌లో మాత్రమే కనిపించే విలక్షణమైన పద విన్యాసాలకు, కళాత్మక విలువలకు, క్రీడాస్ఫూర్తికి సజీవ సాక్ష్యం వింబుల్డన్.

- ఎస్‌ఎంఎస్

మెరిసే ట్రోఫీలు

వింబుల్డన్ పురుషులు, మహిళల విభాగాల్లో విజేతలకు ఇచ్చే వెండి ట్రోఫీలు మెరిసిపోతుంటాయి. మహిళలకు బహూకరించే పళ్లెం లాంటి ట్రోఫీని 1884లో తయారు చేశారు. దీనిని ‘వీనస్ రోజ్‌వాటర్ డిస్క్’గా పిలుస్తారు. ఈ ట్రోఫీ చుట్టుకొలత 18.75 అంగుళాలు లేదా 48 సెంటీ మీటర్లు. పురుషుల విభాగంలో చాంపియన్‌కు కప్‌ను బహూకరిస్తారు. దీని ఎత్తు 18.5 అంగుళాలు (47 సెంటీ మీటర్లు), చుట్టుకొలత 7.5 అంగుళాలు (19 సెంటీ మీటర్లు). ఈ రెండు ట్రోఫీలు ఏడాదిలో ఎక్కువ కాలం వింబుల్డన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంటాయి. విజేతలకు నమూనా ట్రోఫీలను అందచేస్తారు.

షరపోవా అరుపులు!

నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించిన కారణంగా రెండేళ్ల సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాతో మ్యాచ్ ఆడాలంటే అందరూ భయపడతారు. ఆమె అద్భుతంగా ఆడుతుందనికాదు.. ఆమె అరుపులను భరించడం చేతగాక. ఒకప్పుడు మోనికా సెలెస్ పెద్దగా అరిస్తే, ఆమె స్థానాన్ని షరపోవా భర్తీ చేసింది. 2009 వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్నప్పుడు ఆమె ఒకసారి అరుపు 105 డిసిబుల్స్‌కు చేరింది. ఒక మోటార్ సైకిల్‌ను నిలబెట్టి, యాక్సిలేటర్‌ను పూర్తి స్థాయిలో పెంచితే వచ్చే శబ్దానికి ఆమె అరుపు సమానం. అంత పెద్దగా అరిచే షరపోవా కోర్టులోకి అడుగుపెడితే, ఎవరైనా భయపడక ఏం చేస్తారు!

బెకర్ ‘ట్రిపుల్’

జర్మనీ ఆటగాడు బోరిస్ బెకర్ 1985లో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆ ఒక్క విజయంతోనే అతను ఒకేసారి మూడు రికార్డులు సృష్టించాడు. 17 సంవత్సరాల 227 ఏళ్ల వయసులో అతను కెవిన్ కూర్టెన్‌ను ఫైనల్‌లో 6-3, 6-7, 7-6, 6-4 తేడాతో ఓడించి, వింబుల్డన్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు విల్‌ఫ్రెడ్ బాడెలే 19 సంవత్సరాల వయసుతో తన పేరిట నమోదు చేసుకున్న రికార్డును బెకర్ అధిగమించాడు. అంతేగాక, ఈ వింబుల్డన్‌ను గెల్చుకున్న తొలి జర్మన్‌గా, తొలి అన్‌సీడెడ్ క్రీడాకారుడిగా కూడా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

‘రఫుస్ కాపలా

వింబుల్డన్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అక్కడ పావురాలు రాకుండా చూసేందుకు ప్రత్యేక శిక్షణనిచ్చిన ‘రఫుస్’ అనే డేగ కాపలా కాస్తున్నది. దీనికి ఒక ట్విటర్ అక్కౌంట్ కూడా ఉంది. ట్విటర్ ఫాలోయింగ్‌లో రఫుస్‌తో మాగీ మే తీవ్రంగా పోటీపడుతున్నది. మాగీ మే అనేది పక్షికాదు.. ఆండీ ముర్రే పెంచుకుంటున్న కుక్క పేరు ఇది. దీనికి సుమారు 27,000 మంది ఫాలోవర్లు ఉన్నారట.

20 కోర్టులు

వింబుల్డన్ కాంప్లెక్స్‌లో మొత్తం 20 గ్రాస్ కోర్టులు ఉన్నాయి. వాటిలో మొదటి కోర్టులోనే కీలక మ్యాచ్‌లు జరుగుతాయి. వర్షం పడితే, వెంటనే కోర్టు ఆరేందుకు వీలుగా ఇరువైపులా భారీ ఫ్యాన్లను సిద్ధం చేస్తారు. ఈ కాంప్లెక్స్‌లో ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ సభ్యుల కోసం ఐదు రెడ్ షేల్ కోర్టులు, నాలుగు క్లే కోర్టులు, ఐదు ఇండోర్ కోర్టులను అందుబాటులో ఉంచుతారు.

భారత్ ఏ విధంగా రాణిస్తుందో

నాలుగు గ్రాండ్ శ్లామ్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఈనెల 27న ఆరంభం కానుండగా, నిరుడు మూడు టైటిళ్లు సాధించిన భారత్ ఈసారి ఏ విధంగా రాణిస్తుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. జూలై 10వ తేదీ వరకు జరిగే 130వ వింబుల్డన్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన నొవాక్ జొకోవిచ్, సెరెనా విలియమ్స్ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగనున్నారు. క్యాలెండర్ శ్లామ్ కోసం ప్రయత్నిస్తున్న జొకోవిచ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశాలున్నాయి.

ఎలావుందీ వారం? (జూన్ 12 నుండి 18 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కార్యాల పట్ల సానుకూలత. ఆర్థిక లావాదేవీల పట్ల నియంత్రణ అవసరం. ఆరోగ్య విషయంలో ఔషధ సేవనంతో ఉపశమనం కలుగుతుంది. కృషికి తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. వాహన సౌఖ్యం. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం చోటు చేసుకుంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855

తొలి చిత్రానికే మంచి కథ దొరికింది

మెగాస్టార్ కుటుంబం నుండి ఓ హీరోయిన్ తెరంగేట్రం చేస్తోంది. ఆమెకోసం అందరూ ఆశ్చర్యంగానే ఎదురుచూస్తున్నారు. దాదాపుగా హీరోల కుటుంబాలనుండి హీరోయిన్లు వచ్చిన విషయం అరుదైనదే. ఇప్పుడు నాగబాబు కుమార్తె ‘ఒక మనసు’ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేస్తున్నారు. మొదటిసారిగా మెగా ఫ్యామిలీనుండి వస్తున్న నటిగా అభిమానులకు వున్న అపోహలు, అనుమానాలు తొలగించడానికి శనివారం ఉదయం ఆమె చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో వివిధ జిల్లాలనుండి వచ్చిన 200లకుపైగా మహిళా అభిమానులను కలుసుకొని వారి ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఆమె చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే విందాం...

Pages