S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/22/2016 - 06:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తరుణంలో తమ సిఫార్సులను అమలు చేయడంపై బిసిసిఐ అధికారులు ఏం చేస్తారో చూద్దామని విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా అన్నారు. అతని ఆధ్వర్యంలోనే సుప్రీం కోర్టు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో చేసిన సూచనలను అమలు చేసేందుకు బిసిసిఐ వెనకాడుతున్నది.

10/22/2016 - 06:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్‌లో పాల్గొనే సమయంలో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) అధికారులు రేస్ జరుగుతున్న సమయంలో స్టాల్స్‌లో ఎక్కడా కనిపించలేదని, తనకు మంచినీళ్లు ఇచ్చే వారు కూడా కరవయ్యారని రన్నర్ ఒపి జైష చేసిన ఆరోపణలపై విచారణ పూర్తయన తర్వాత కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. జేషకు ఎదురైన దుస్థితికి ఆమె కోచ్ నికోలయ్ స్నెసరెవ్ ప్రధాన కారకుడని వ్యాఖ్యానించింది.

10/22/2016 - 06:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు చావుదెబ్బ తగిలింది. ఈ సిఫార్సులను డిసెంబర్ 3వ తేదీలోగా అమలు చేసి తీరాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

10/21/2016 - 01:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో చివరి వరకూ హోరాహోరీగా సాగిన రెండో వనే్డలో న్యూజిలాండ్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ సూపర్ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 242 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది.

10/21/2016 - 01:08

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ బి ఉమేష్ యాదవ్ 0, టామ్ లాథమ్ ఎల్‌బి కేదార్ జాదవ్ 46, కేన్ విలియమ్‌సన్ సి ఆజింక్య రహానే బి అమిత్ మిశ్రా 118, రాస్ టేలర్ సి రోహిత్ శర్మ బి అమిత్ మిశ్రా 21, కొరీ ఆండర్సన్ ఎల్‌బి అమిత్ మిశ్రా 21, ల్యూక్ రోన్చీ సి ధోనీ బి అక్షర్ పటేల్ 6, మిచెల్ సాంట్నర్ నాటౌట్ 9, ఆంటన్ డెవిసిచ్ సి అక్షర్ పటేల్ బి జస్‌ప్రీత్ బుమ్రా 7, టిమ్ సౌథీ బి జస్‌ప్రీత్ బుమ్రా 0, మాట్ హె

10/21/2016 - 01:06

కువాన్‌టన్ (మలేసియా), అక్టోబర్ 20: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. గురువారం తన తొలి మ్యాచ్‌లో జపాన్‌ను ఢీ కొన్న భారత్‌కు రూపీందర్‌పాల్ సింగ్ విజృంభణ అండగా నిలిచింది. అతను డబుల్ హ్యాట్రిక్‌తో రాణించగా, భారత్ 10-2 గోల్స్ తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది.

10/21/2016 - 01:04

హైదరాబాద్, అక్టోబర్ 20: మోకాలికి శ స్త్ర చికిత్స చేయంచుకొని కోలుకుంటున్న భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వా ల్ వచ్చే నెల జరిగే చైనా ఓపెన్‌కు హాజర య్యే అవకాశాలున్నాయ. తాను ప్రాక్టీస్ ఆ రంభించానని, చైనా ఓపెన్‌లోగా కోలుకుం టానని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

10/21/2016 - 01:04

ఒడెన్స్, అక్టోబర్ 20: డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ టోర్న మెంట్‌లో భారత స్టార్ పివి సింధు ఓటమిపాలై నిష్క్రమిం చింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వా త మొదటిసారి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ఆమె మొదటి రౌండ్‌లో హి బింగియావోను 21-14, 21-19 తేడాతో ఓడిం చింది. అయతే, రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన సయా క తకహషి చేతిలో 13-21, 23-21, 18-21 తేడాతో ఓడింది.

10/21/2016 - 01:03

అహ్మదాబాద్, అక్టోబర్ 20: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో థాయిలాండ్‌ను ఢీకొనేందుకు భారత్ సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఈ టోర్నీలో జయాపజయాల పట్టకను చూస్తే, భారత్ కంటే థాయ్ మెరుగైన స్థితిలో కనిపిస్తుంది. భారత్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా, రెండు పరాజయాలను చవిచూసింది. థాయ్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచింది.

10/20/2016 - 07:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: న్యూజిలాండ్‌పై మరోసారి దాడి చేసేందుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డను టీమిండియా ఇంకా 101 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న విషయం తెలిసిందే.

Pages