S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/20/2016 - 05:33

రియో డి జెనిరో, ఆగస్టు 19: డోపింగ్ కేసులో తనపై నాలుగేళ్ల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) ఇచ్చిన తీర్పు పట్ల రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తానని అతను స్పష్టం చేశాడు. ‘సిఎఎస్ నిర్ణయం తీవ్ర ఆవేదన కలిగించింది.

08/19/2016 - 23:17

రియోడిజెనీరొ: బ్రెజిల్ రాజధాని రియో డిజనీరోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన మహిళల షటిల్ బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారిణి పి.వి.సింధు తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. అద్వితీయస్థాయిలో పోరాడినప్పటికీ స్పెయిన్‌కు చెందిన ప్రత్యర్థి మారియో చేతిలో ఒటమి తప్పలేదు. రజత పతకం సాధించి భారత్ తరపున ఒలింపిక్స్‌లో తొలి రజత పతకాన్ని సాధించిన మహిళగా చరిత్ర సృష్టించింది.

08/19/2016 - 02:27

భారత్‌కు పతకాన్ని అందించిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల సాక్షి మాలిక్‌కు అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన రికార్డే ఉంది. 2014 గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అదే ఏడాది జరిగిన ఇంచియాన్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. భారత్‌కు పురుషుల విభాగంలో కెజి జాదవ్ మొదటిసారి 1952 హెల్సిన్కీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి పెట్టాడు.

08/19/2016 - 02:25

న్యూఢిల్లీ, ఆగస్టు 18: సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్‌లో సాధించిన విజయం యువతీయువకులకు స్ఫుర్తిదాయకంగా నిలుస్తుందని ఆమె తల్లిదండ్రులు సుదేష్ మాలిక్, సుఖ్‌బిర్ మాలిక్ అన్నారు. గురువారం ఉదయం వారు తమను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఏ రంగంలోనైనా పిల్లలు ఉన్నతంగా ఎదగాలంటే వారికి తల్లిదండ్రుల సహాయసహకారాలు అత్యవసరమని పేర్కొన్నారు. అప్పుడే వారు రాణిస్తారని అన్నారు.

08/19/2016 - 02:23

న్యూఢిల్లీ, ఆగస్టు 18: రియో ఒలింపిక్స్‌లో కనీసం రజత పతకాన్ని ఖాయం చేసిన తెలుగు తేజం పివి సింధుకు దేశ అత్యున్నత క్రీడా పుఠస్కారం రాజీవ్ ఖేల్ రత్న లభించడం ఖాయమైంది. బాడ్మింటన్ సింగిల్స్ సెమీ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాను 21-19, 21-10 తేడాతో ఓడించిన సింధు ఫైనల్ చేరి, పతకాన్ని ఖరారు చేసుకుంది. కేంద్రం గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఖేల్ రత్న అవార్డును సంపాదిస్తుంది.

08/19/2016 - 02:22

రియో డి జెనీరో: భారత రెజ్లర్ వినేష్ ఫొగట్ మహిళల 48 కిలోల ఫ్రీస్టయిల్ క్వార్టర్ ఫైనల్ పోరులో గాయపడింది. చైనాకు చెందిన సన్ యనాన్‌తో తలపడిన ఆమె కుస్తీ పడుతున్న సమయంలో మోకాలికి బలమైన గాయమైంది. అయితే, పోరును ఆపకుండా కొంత సేపు కొనసాగించడంతో కాలి కండరాలు చిట్లాయి. నొప్పితో విలవిల్లాడుతున్న వినేష్‌ను స్ట్రెచర్‌పై తరలించాల్సి వచ్చింది.

08/19/2016 - 02:20

రియో డి జెనీరో: ఒలింపిక్స్ సాకర్‌లో బ్రెజిల్‌కు మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. మహిళల విభాగం సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైన బ్రెజిల్ పురుషుల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్టార్ ఆటగాడు, కెప్టెన్ నేమార్ రెండు గోల్స్ చేసి, హోండురాస్‌పై బ్రెజిల్ 6-0 తేడాతో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

08/19/2016 - 02:18

రియో డి జెనీరో, ఆగస్టు 18: మొట్టమొదటిసారి ఒలింపిక్స్ మహిళల ఫుట్‌బాల్‌లో ఫైనల్ చేరాలన్న బ్రెజిల్ ఆశలు గల్లంతయ్యాయి. పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేలిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్వీడన్ 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో జర్మనీతో పోరాటానికి రంగాన్ని సిద్ధం చేసుకుంది. సాకర్‌కు మారుపేరుగా నిలిచే బ్రెజిల్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తూ ఫైనల్ చేరలేకపోవడం అభిమానులను నిరాశ పరచింది.

08/19/2016 - 02:16

రియో డి జెనీరో: భారత మహిళా రెజ్లర్ బబితా కుమారి మొదటి బౌట్‌లో ఓటమిపాలైంది. మహిళల 53 కిలోల విభాగంలో పోటీకి దిగిన ఆమె తొలి రౌండ్‌లో గ్రీస్‌కు చెందిన మరియా ప్రెవొలరచి చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ పోటీల్లో ఆమెకు తదుపరి అవకాశాలు ప్రెవొలరచి విజయాలపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ప్రెవొలరచి ఫైనల్ చేరితే, బబితకు రెపీచేజ్‌లో పోటీపడే అవకాశం దక్కుతుంది.

08/19/2016 - 02:15

రియో డి జెనీరో: జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ మహిళల 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకు ముందు 100 మీటర్ల విభాగంలోనూ విజేతగా నిలిచిన ఆమె ‘సూపర్ డబుల్’ను సాధించింది. హోరాహోరీగా సాగిన 200 మీటర్ల పరుగును ఎలైన్ 21.78 సెకన్లలో పూర్తి చేసింది.

Pages