S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/15/2016 - 06:29

రియో ఒలింపిక్స్‌లో భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు పతకం తృటిలో చేజారింది. మహిళల వాల్ట్ ఫైనల్‌లో ఆమె అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ వంటి మేటి స్టార్లకు గట్టిపోటీనిచ్చింది. అసాధారణ ప్రతిభ కనబరచిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. సిమోన్ స్వర్ణ పతకం సాధించగా, మరియా పసెకా (రష్యా), గులియా స్టీన్‌గ్రబర్ (స్విట్జర్లాండ్) వరుసగా రజత, కాంస్య పతకాలను అందుకున్నారు.

08/14/2016 - 07:23

రియో డి జెనీరో, ఆగస్టు 13: భారత అథ్లెట్లు మూకుమ్మడిగా విఫలమవుతున్న తరుణంలో మహిళల స్టీపుల్ చేజ్‌లో లలితా బాబర్ అభిమానుల ఆశను నిలబెట్టింది. 9 నిమిషాల 19.76 సెకన్లలో ఈవెంట్స్‌ను పూర్తి చేసిన ఆమె ఏడో స్థానంలో నిలవడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది.

08/14/2016 - 07:15

రియో డి జెనీరో, ఆగస్టు 13: ఇథియోపియా అథ్లెట్ అల్మాజ్ అయానా మహిళల 10,000 మీటర్ల పరుగులో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న ఆమె 29:31.45 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరింది. 1993 సెప్టెంబర్ 8న బీజింగ్ జరిగిన ఈవెంట్‌లో 29:31.78 నిమిషాలతో చైనా రన్నర్ వాంగ్ జున్ జియా నెలకొల్పిన ప్రపంచ రికార్డును అయానా బద్దలు చేసింది.

08/14/2016 - 07:15

పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో సింగపూర్ యువ స్విమ్మర్ జోసెఫ్ స్కూలింగ్ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 22 స్వర్ణాలతో తిరుగులేని వీరుడిగా ఎదిగిన మైఖేల్ ఫెల్ప్స్‌ను రెండో స్థానానికి నెట్టి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అతను సరికొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించడం విశేషం. స్విమ్మంగ్‌లో పెల్ప్స్ వారసుడు వచ్చాడని క్రీడా పండితులు అంటున్నారు.

08/14/2016 - 07:13

రియో డి జెనీరో, ఆగస్టు 13: అమెరికా స్విమ్మర్ కాటీ లెడెకీ రియో ఒలింపిక్స్ మహిళల స్విమ్మింగ్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నది. 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో ఆమె లక్ష్యాన్ని 8 నిమిషాల 4.79 సెకన్లలో చేరి, గతంలో తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును తానే అధిగమించింది. రియోలో ఆమెకు ఇది నాలుగో స్వర్ణం కావడం విశేషం.

08/14/2016 - 07:13

రియో డి జెనీరో: భారత బాక్సర్ వికాస్ క్రిష్ణన్ రియోలో పతకం సాధించే దిశగా ముందంజ వేశాడు. 75 కిలోల మిడిల్‌వెయిట్ విభాగంలో పోటీపడిన అతను టర్కీకి చెందిన సిపల్ ఆండర్‌ను 3-0 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. సెమీస్‌లో చేరేందుకు అతను ఉజ్బెకిస్తాన్ బాక్సర్ బెటెమిర్ మిలికజీవ్‌ను ఢీ కొంటాడు. ఒకవేళ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెడితే, ఆతర్వాత ఫలితాలతో సంబంధం లేకుండా అతనికి పతకం లభిస్తుంది.

08/14/2016 - 07:12

రియో డి జెనీరో: మహిళల హాకీలో భాగంగా శనివారం అర్జెంటీనాను ఢీకొన్న భారత్ 0-5 తేడాతో చిత్తయింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ పోటీని ఇవ్వలేకపోయిన భారత జట్టు నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించింది. మార్టినా కవలెరో, మరియా గ్రానట్, లెబెచి, అగస్టా అల్డెర్టారిమో, డెల్ఫినా మెరినో అర్జెంటీనాకు గోల్స్ అందించారు. పూర్తి ఆత్మ రక్షణలో పడిన భారత మహిళలు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు.

08/14/2016 - 07:11

రియో డి జెనీరో: పురుషుల షూటింగ్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ విభాగంలో గుర్‌ప్రీత్ సింగ్ ఫైనల్ చేరే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 581 పాయింట్లు సంపాదించిన అతను ఏడో స్థానంలో నిలిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్స్‌లో మొదటి ఆరు స్థానాలు పొందిన వారు ఫైనల్‌కు అర్హత సంపాదిస్తారు. గుర్‌ప్రీత్ ఏడో స్థానంలో నిలవడంతో ఫైనల్ చేరలేక నిష్క్రమించాల్సి వచ్చింది.

08/13/2016 - 04:35

రియో డి జెనీరో, ఆగస్టు 12: రియో ఒలింపిక్స్‌లో అమెరికా సూపర్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ జోరు కొనసాగుతున్నది. స్విమ్మింగ్ పూల్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఫెల్ప్స్ రియో ఒలింపిక్స్‌లో నాలుగవ, మొత్తం మీద 22వ ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. తన సహచరుడు, చిరకాల ప్రత్యర్థి ర్యాన్ లోచెను మరోసారి చిత్తుచేసి, పురుషుల 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లే టైటిల్‌ను సాధించాడు.

08/12/2016 - 03:59

రియో డి జెనీరో: బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు, హైదరాబాదీలు సైనా నెహ్వాల్, పివి సింధు శుభారంభం చేశారు. స్థానిక క్రీడాకారిణి లొహానీ విసెనే్టతో తలపడిన సైనా 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలిచింది. టైటిల్ రేసులో ఉన్నదంటూ పోటీలు ఆరంభానికి ముందే ముద్ర పడిన సైనా తనపై అభిమానులు ఉంచుకున్న ఆశలను వమ్ము చేయకుండా తొలి రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేసి ముందంజ వేసింది.

Pages