S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/19/2015 - 05:15

బెంగళూరు, డిసెంబర్ 18: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బెంగళూరులో వచ్చే వారం ప్రాక్టీస్ మొదలు పెడుతుందని ఆమె తండ్రి హర్వీర్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో గాయానికి చికిత్స పొందుతున్నదని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. వేగంగా కోలుకుంటున్నదని, వచ్చే వారం బెంగళూరు వెళ్లి, ప్రాక్టీస్‌ను ఆరంభిస్తుందని చెప్పాడు.

12/18/2015 - 06:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అంతర్జాతీయ బాడ్మింటన్ స మాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత ఆ టగాడు కిడాంబి శ్రీకాంత్ తొమ్మిదో స్థానికి పడిపోయా డు. ఎనిమిదో స్థానంలో ఉన్న అతను ఇటీవల కాలంలో పరాజయాలను ఎదుర్కోవడంతో ఒక స్థానాన్ని కోల్పో యాడు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ రెండో స్థా నాన్ని నిలబెట్టుకుంది. పివి సింధు 12వ స్థానంలో కొన సాగుతున్నది.

12/18/2015 - 06:16

మనేసర్, డిసెంబర్ 17: ప్రో రెజ్లింగ్ లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన బౌట్స్‌లో ముంబయ గరుడ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరచింది. ముంబయ వారియర్స్‌ను ఎదుర్కొన్న ఈ బృందం 5-2 తేడాతో విజయభేరి మోగించింది. తొలిసారి జరుగుతున్న ఈ టోర్నమెం ట్‌లో వివిధ దేశాలకు చెందిన రెజ్లర్లు పాల్గొంటున్నారు.

12/18/2015 - 06:15

జ్యూరిచ్, డిసెంబర్ 17: సస్పెన్షన్‌కు గురైన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్‌కు ఉచ్చు బిగుసుకుంటున్నది. అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్న అతనిని ఫిఫా ఇటీవలే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అతనితోపాటు సీనియర్ ఉపాధ్యక్షుడు, యూరోపియన్

12/18/2015 - 06:14

ప్రపంచ క్లబ్ కప్ ఫుట్‌బాల్
* ఫైనల్‌కు దూసుకెళ్లిన బార్సిలోనా

12/18/2015 - 06:14

భారత్‌తో సిరీస్‌పై సమాధానం చెప్పలేక పిసిబి ఉక్కిరిబిక్కిరి

12/17/2015 - 06:04

ముంబయి, డిసెంబర్ 16: ఒక క్రికెటర్‌కు సుమారు 2.4 కోట్ల రూపాయలను బిసిసిఐ ఖర్చు చేసింది. ఆశ్చర్యం కలిగించేదైనా ఇది వాస్తవం. వివరాలను బిసిసిఐ తాజాగా తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఆ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాలో వనే్డ ట్రై సిరీస్‌లో భారత్ పాల్గొంది.

12/17/2015 - 06:01

జైపూర్, డిసెంబర్ 16: వివాదాలతో చెట్టపట్టాలేసుకొని నడుస్తున్న రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఎ) అధ్యక్ష పగ్గాలు లలిత్ మోదీకే దక్కడం ఖాయమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌కు కమిషనర్‌గా వ్యవహరించి, ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఈవెంట్‌గా తీర్చిదిద్దిన లలిత్ మోదీని 2013లో ఆ పదవి నుంచి బిసిసిఐ సస్పెండ్ చేసింది.

12/17/2015 - 06:01

దోహా, డిసెంబర్ 16: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)పై అవినీతి ఆరోపణలు వచ్చినా, 2022 వరల్డ్ కప్‌ను నిర్వహించే విషయంలో రెండో అభిప్రాయానికి తావులేదని కతార్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ హసన్ అల్ తవదీ స్పష్టం చేశాడు. ఈ హక్కులను సంపాదించడానికి ఫిఫా అధికారులకు కతార్ భారీగా ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలపై ప్రస్తుతం ముమ్మరంగా విచారణ జరుగుతున్నది.

12/17/2015 - 06:00

ముంబయి, డిసెంబర్ 16: ఆస్ట్రేలియాలో వనే్డ, టి-20 క్రికెట్ సిరీస్‌ల్లో పాల్గొనే టీమిండియాను సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేయనుంది. ఈ టూర్‌లో భాగంగా జనవరి 12 నుంచి 31 మధ్య ఆసీస్‌తో భారత్ 5 వనే్డలు, 3 టి-20 మ్యాచ్‌లు ఆడుతుంది. వనే్డలకు పెర్త్, బ్రిస్బేన్, మెల్బోర్న్, కాన్‌బెరా, సిడ్నీ నగరాలు ఆతిథ్యమిస్తాయి.

Pages