S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/09/2018 - 17:21

అమరావతి: ఎమ్మెల్సీలను పవన్ కల్యాణ్ గేలి చేయడం రాజ్యంగం విరుద్ధమని, ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/09/2018 - 14:11

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 13న రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఏపీ కాంగ్రెస్ వ్వవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్ చాందీ వెల్లడించారు. ఆయన సోమవారం బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

07/09/2018 - 14:08

హైదరాబాద్: శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందులో భాగంగా పరిపూర్ణనంద స్వామిని జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధం చేశారు. పోలీసు యంత్రాంగం భద్రతన కట్టుదిట్టం చేశారు. దీంతో పరిపూర్ణనంద ఇంటికే పరిమితమయ్యారు.

07/09/2018 - 14:06

హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై నగర పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మహేశ్ పోలీసుల అనుమతి లేకుండా నగరంలోకి రాకూడదని ఆంక్షలు విధించారు. ఈమేరకు పోలీసు అధికారిక ప్రకటన విడుదలైంది.

07/09/2018 - 14:04

సింగపూర్: సింగపూర్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించారు. నదుల అనుసంధానం నేడు ఎంతో అవసరమని అన్నారు. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని తెలిపారు. తాగునీరు, వ్యవసాయానికే కాకుండా పారిశ్రామిక అవసరాలకు కూడా తగినంత నీరు అందిస్తామని తెలిపారు.

07/09/2018 - 04:17

హైదరాబాద్: అమెరికాలో కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి శరత్ పార్ధీవ దేహాన్ని రెండు రోజుల్లో హైదరాబాద్ తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శరత్ మృతిపై అమెరికాలో ఉన్న దౌత్య సిబ్బందితో మాట్లాడుతున్నామని చెప్పారు. హత్య ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తమకు సమాచారం అందించారని అన్నారు.

07/09/2018 - 03:23

ఖమ్మం, జూలై 8: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నాగార్జునసాగర్ కాల్వల ఆధునీకరణ పనులు ఈ నెలాఖరులోగా ముగియనున్నాయి. దశాబ్దకాలంగా ఆధునీకరణ పనులు జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంపై ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నెలాఖరులోగా ముగించాలని నిర్ణయం తీసుకున్నారు.

07/09/2018 - 02:22

తిరుపతి, జూలై 8: తిరుమల శ్రీవారికి భక్తులు భక్తితో తలనీలాలు సమర్పించేందుకు వీలుగా హెచ్‌వీసీ వసతి సముదాయాల వద్ద నూతన మినీ కల్యాణకట్టను ఆదివారం టీటీడీ ప్రారంభించింది. విశాఖపట్నానికి చెందిన దాత సీతం సుధాకర్‌రాజు రూ.1.2 కోట్లతో నూతన కల్యాణకట్టను నిర్మించి టీటీడీకి అందించారు. ఇందులో 24 మంది క్షురకులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు సేవలందిస్తారు.

07/09/2018 - 02:13

తిరుపతి, జూలై 8: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ఆలయ అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

07/09/2018 - 02:13

అమలాపురం, జూలై 8: అరచేతిలో పట్టే ఆండ్రాయిడ్ ఫోను తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోవడానికి కారణమయ్యింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమలాపురం రూరల్ మండలం వనె్నచింతలపూడి గ్రామానికి చెందిన ఒక యువతికి, ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 7వ తేదీ శనివారం ఉ.

Pages