S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/11/2018 - 13:54

భద్రాచలం: వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో 30.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

07/11/2018 - 12:19

విజయవాడ: తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె గత 12 రోజుల నుంచి కొనసాగుతుంది. దీంతో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారటంతో ప్రైవేటు కార్మికులతో పనులు చేయిస్తుండగా.. మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితుల తలెత్తాయి. పోలీసు స్టేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు.

07/11/2018 - 12:15

హైదరాబాద్: నగరం నుంచి స్వామి పరిపూర్ణానందను తరలించారు. ఆయనను ఆర్నెళ్ల పాటు నగరం నుంచి డీజీపీ బహిష్కరించిన విషయం విదితమే. గత ఏడాది నవంబర్‌లో జరిగిన హిందూసేన సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ నగరం నుంచి బహిష్కరించినట్లు పోలీసులు వెల్లడించారు.

07/11/2018 - 04:43

ఖమ్మం: 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటై, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అవటం ఖాయమని ఏఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు.

07/11/2018 - 02:08

మలికిపురం, జూలై 10: తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని కేశనపల్లి వెస్ట్ స్ట్రక్చర్‌లో ఓఎన్జీసీ బావుల నుండి గ్యాస్, చమురు లీకేజీల పరంపర కొనసాగుతోంది. సోమవారం తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లో లీకేజీ ఏర్పడగా, మంగళవారం గొల్లపాలెంలో మరోసారి లీకేజీ చోటుచేసుకుంది. వరుస లీకేజీ ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

07/11/2018 - 01:10

తిరుపతి, జూలై 10: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఈనెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అన్నారు.

07/11/2018 - 01:06

హైదరాబాద్, జూలై 10: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని పోలీసులు ఇంకా గృహ నిర్బంధంలోనే ఉంచారు. జూబ్లీహిల్స్‌లో స్వామి బస చేసిన నివాసం నుంచి ఆయన్ను బయటకు రానీయడం లేదు. ఆ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించి, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయన్ను కలిసేందుకు వచ్చిన వారినీ అనుమతించడం లేదు. మీడియానూ దూరంగానే ఉంచారు. చివరకు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.

07/11/2018 - 01:06

తిరుపతి, జూలై 10: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు విశేషంగా విచ్చేసే భక్తులకు సేవలు అందించడానికి శ్రీవారి సేవ స్లాట్‌ను ఈ నెల 12న టీటీడీ విడుదల చేయనుంది. అక్టోబర్ 10 నుంచి 18 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జేఈఓ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో 12 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ను అందుబాటులో ఉంచుతారు. ఆసక్తిగలవారు తమ ఆధార్‌కార్డు ద్వారా నమోదు చేసుకోవచ్చు.

07/11/2018 - 01:48

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ చార్జిషీట్ ప్రజల ముందుంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ వెల్లడించారు. మంగళవారం ఇక్కడ తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మార్పు కోసం చేపట్టిన బీజేపీ జన చైతన్య యాత్రకు విశేష స్పందన వచ్చిందని చెప్పారు.

07/11/2018 - 00:56

హైదరాబాద్, జూలై 10: పంచాయతీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి దాటవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సీఎం కేసీఆర్ మంగళవారం స్పందిస్తూ ప్రకటన చేసారు.

Pages