S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/06/2018 - 00:49

తిరుపతి, ఏప్రిల్ 5: కేంద్రంపై యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఫోటోలు తీసుకోవడం తప్ప చేసింది ఏమీలేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.

04/06/2018 - 00:46

విజయవాడ, ఏప్రిల్ 5: భావితరాలు తనను గుర్తుంచుకునేలా డాక్టర్ జగ్జీవన్‌రామ్ ఆశయాల మేరకు రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తూ ఆయన ఆశయాలను ముందు తరాలకు అందిస్తూ ముందుకు వెళతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గురువారం స్థానిక రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ 111వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

04/05/2018 - 17:35

విజయవాడ: అమరావతి రాజధానిపై రాసిన పుస్తకాల ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా బందరు రోడ్డులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీఎత్తున పోలీసులను మోహరించారు. బందరు రోడ్డుకు ఇరువైపులా ఈ రెండు పుస్తకావిష్కరణ సభలు జరుగుతున్నాయి. ఐవైఆర్ రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ అనే పుస్తకాన్ని సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆవిష్కరించనున్నారు.

04/05/2018 - 17:34

అమరావతి: అందుబాటులో ఉన్న మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనపై కార్యాచరణ రూపొందించేందుకు ఆయన ఈ భేటీ కొనసాగించారు. ఈ భేటీలో యనమల, అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు ఉన్నారు.

04/05/2018 - 16:32

వరంగల్:కాగ్ అనేది వాచ్ డాగ్. సుప్రీంకోర్టుతో సమానం. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన కాగ్ అద్దంలో కేసీఆర్ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. కేసీఆర్ పాలనలో కావాలనే తప్పిదాలు చేశారు. ఆప్పును ఆదాయంగా లోటును రెవూన్యుగా చూపిస్తున్నారని అన్నారు.

04/05/2018 - 16:29

మంగళగిరి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారంనాడు ఆందోళన చేశారు. ఆంజనేయ స్వామి రోడ్డులోని ఎన్టీయార్ విగ్రహానికి నల్లరిబ్బన్ కట్టారు. అంతేకాదు చీపుర్లతో రోడ్లను శుభ్రం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మహిళలంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని అన్నారు.

04/05/2018 - 21:25

విజయవాడ: సచివాలయం పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవటంతో అమరావతికి వచ్చారని అన్నారు. తాత్కాలిక సచివాలయం పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి.. ఇపుడు మాట మారుస్తున్నారని అన్నారు.

04/05/2018 - 12:51

విజయవాడ: జిల్లాలో జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. రామవరప్పాడు రింగ్‌ వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

04/05/2018 - 02:30

హైదరాబాద్, ఏప్రిల్ 4: భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం కేసుల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సమర్పించిన కేసులకు, కోర్టు సేకరించిన కేసులకు మధ్య చాలా తేడా ఉందని హైకోర్టు పేర్కొంది.

04/05/2018 - 02:14

హైదరాబాద్, ఏప్రిల్ 4: ‘మనకు తాడూ బొంగరం లేదంటారా? అదెలా తిరుగుతుందో చూపిద్దాం. ప్రగతి భవన్ గడీని బద్దలు కొడదాం’ అని తెలంగాణ జన సమితి (టీజేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ జన సమితికి తాడూ బొంగరం లేదంటారా? అంటూ తెరాస వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Pages