S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/31/2018 - 03:34

హైదరాబాద్, జనవరి 30: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలను సైతం జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని గత పదేళ్ల నుండి చెబుతున్న ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి కూడా ప్రయోగ పరీక్షలకు జంబ్లింగ్ నుండి మినహాయించింది. ప్రయోగపరీక్షల నిర్వహణలో లోటుపాట్లను సరిదిద్దుకున్న ఇంటర్ బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా, జంబ్లింగ్ విధానం అమలు చేయకపోవడంతో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

01/31/2018 - 03:34

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ ఇంటి పార్టీలోకి మంగళవారం పెద్ద సంఖ్యలో అడ్వకేట్లు చేరారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో అడ్వకేట్ ఉమామహేశ్వర రావు నేతృత్వంలో సుమారు వంద మంది అడ్వకేట్లు పార్టీలో చేరారు. డాక్టర్ చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వారికి స్వాగతం పలికారు.

01/31/2018 - 03:33

హైదరాబాద్, జనవరి 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జకారం ప్రాంతంలో రిజర్వు అడవుల విధ్వంసంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అటవీ శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్సు కూడా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

01/31/2018 - 03:19

మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 30: సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీజేఎసీ చైర్మన్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హల్‌లో రైతు సమస్యలు పరిష్కారానికి ఉమ్మడి జిల్లా రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు కోదండరాం ముఖ్యఅతిథిగా హజరయ్యారు.

01/31/2018 - 03:16

ఆదిలాబాద్,జనవరి 30: కొండ కోనల నడమ మారుమూల గిరిజన గూడెం సోమినిలో సమ్మక్క సారక్క జాతరను పురస్కరించుకొని 58 ఆదివాసీ గిరిజన జంటలకు మంగళవారం సంప్రదాయబద్ధంగా సామూహిక వివాహాలు వేడుకగా జరిగాయి.

01/31/2018 - 03:13

హైదరాబాద్, జనవరి 30: మహాత్మ గాంధీ ఆశయాలు దేశానికే కాదు ప్రపంచానికీ ఆదర్శమని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మహాత్మ గాంధీ 90వ వర్ధంతి సందర్భంగా మంగళవారం గాంధీ భవన్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూల దండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకుని రావడంలో మహాత్మ గాంధీ చేసిన కృషి అమోఘమని అన్నారు.

01/31/2018 - 03:11

నల్లగొండ, జనవరి 30: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసులో పోలీసులు వాస్తవాలను మరుగుపరిచి సీఎం కేసీఆర్ చెప్పమన్నట్లుగా కట్టుకథ వినిపించారని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యు డు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

01/31/2018 - 03:09

నల్లగొండ, జనవరి 30: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని అనుచరుడి హత్యను అడ్డం పెట్టుకుని కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ లబ్ధికోసం తనపైన, ప్రభుత్వంపైన అసత్య ఆరోపణలతో రాజకీయ డ్రామాలు వేస్తున్నారని నకిరేకల్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నా రు.

01/31/2018 - 02:41

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం మధ్య సమన్వయం సాధించి రైతాంగానికి మెరుగైన సేవలు అందిస్తామని వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సాంకేతిక వనరుల సమీకరణ వినియోగంపై రెండో వర్క్‌షాప్ మంగళవారం ఇక్కడ జరిగింది.

01/31/2018 - 02:40

హైదరాబాద్, జనవరి 30: హైదరాబాద్‌లో 2018 ఫిబ్రవరి 10 జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఉభయ తెలుగు రాష్ట్రాల లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ బి.ఆర్. మధుసూదన్‌రావు తెలిపారు. మంగళవారం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కాంపౌండ్‌లో (పురాని హవేలి) నిర్వహించే ఈ లోక్ అదాలత్‌లో ప్రధానంగా ప్రమాదాలకు సంబంధించిన బీమా, బ్యాంకుల కేసులు పరిష్కరిస్తామన్నారు.

Pages