S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/14/2018 - 04:35

గోదావరిఖని టౌన్, జనవరి 13: వినూత్న కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతం మరో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును కైవసం చేసుకుంది. రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి పోశం దంపతుల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ రంగవల్లికి ఈ పురస్కారం దక్కింది. శనివారం గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.

01/14/2018 - 04:31

గద్వాల, జనవరి 13: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను, ఉద్యోగ, కర్షకులను, కులవృత్తులందరినీ విస్మరించి తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకోవడం వల్ల తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ విస్తరణలో భాగంగా రెండు రోజుల పర్యటన జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్వహించారు.

01/14/2018 - 04:31

హైదరాబాద్, జనవరి 13: భారతీయ జనతా పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధనరెడ్డి తీరు పార్టీ అగ్రనేతలను ఆందోళనలో పడేస్తోంది. కొద్ది కాలంగా పార్టీ తీరుతెన్నులపై గుర్రుగా ఉన్న నాగం జనార్ధనరెడ్డి బహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

01/14/2018 - 04:30

మహబూబ్‌నగర్, జనవరి 13: పాలమూరు జిల్లా కు వరప్రదాయినిగా భావించే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు నీటిమట్టం పడిపోతోంది. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు రెండు నుండి మూడు టీఎంసీల నీటిమట్టం పడిపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. యాసంగి (రబీ) పంటలు ఈ దఫా పెద్దఎత్తున సాగు చేసిన సందర్భంలో జనవరి మాసంలోనే నీటిమట్టం తగ్గుముఖం పడుతుండటం కూడా రైతుల్లో కలవరం మొదలైంది.

01/14/2018 - 04:04

హైదరాబాద్/రాజేంద్రనగర్, జనవరి 13: నగరంలో డ్రగ్స్ మాఫియా మళ్లీ పడగ విప్పింది. గుట్టుచప్పుడు కాకుండా, చాపకింద నీరులా డ్రగ్స్ నగరానికి సరఫరా అవుతున్నాయి. ఆరు నెలలుగా ఎక్సైజ్, పోలీసు విభాగం అధికారులు డ్రగ్స్‌పై కనె్నర్ర చేసినప్పటికీ డ్రగ్స్ దందా మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది.

01/14/2018 - 04:02

హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ వ్యాప్తంగా విదేశాలకు ఉపాధి కోసం పంపించే ఏజెంట్లంతా నెల రోజుల్లోగా ఈ-మైగ్రేట్‌లో నమోదు చేసుకోవాలని ఐటీ సమాచార శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఈ నిబంధనలను ఖాతరు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

01/14/2018 - 03:59

హైదరాబాద్, జనవరి 13: సర్పంచ్‌లకు విస్తృతమైన అధికారాలు కల్పించాలని పంచాయితీరాజ్ కొత్త చట్టంలో పొందుపరిచారు. పంచాయితీరాజ్ కొత్త చట్టంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం సచివాలయంలో సమావేశమై విపులంగా చర్చించింది. ఇంతకు ముందే నాలుగు సార్లు ఈ ఉపసంఘం సమావేశమై అనేక అంశాలపై చర్చింది. శనివారం తుదివిడత జరిగిన చర్చల తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వద్దకు వెళ్లి, తాము జరిపిన చర్చల వివరాలు తెలిపారు.

01/14/2018 - 03:56

హైదరాబాద్, జనవరి 13: దివంగత మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. శనివారం డాక్టర్ చెన్నారెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి నారాయణ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తన రాజకీయ జీవితానికి చెన్నారెడ్డి మంచి సలహాలు ఇచ్చారని, వాటిని ఇప్పటికీ పాటిస్తుంటానని చెప్పారు.

01/14/2018 - 03:54

హైదరాబాద్, జనవరి 13: ‘రవ్వంత కాదు నిప్పు రవ్వను..’ అని టి.కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఒక చిన్న నిప్పు రవ్వ చాలు మీ కొంప తగులబెట్టేందుకు అని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో హెచ్చరికగా అన్నారు. విద్యుత్తు వెలుగుల వెనక మతలబు ఏమిటో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పునరుద్ఘాటించారు.

01/14/2018 - 03:52

హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ రాష్ట్రానికి సంక్రాంతి కళ వచ్చింది. రాష్ట్రంలోని 31 జిల్లాల రైతాంగం కేసీఆర్ సర్కార్ ప్రకటిస్తున్న వరాలతో రైతాంగం మోములో ఆనందం వెల్లివెరుస్తోంది. తెలంగాణ అవతరించిన తర్వాత నాల్గవ సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రభుత్వం రైతాంగాన్ని ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో విపక్ష పార్టీల్లో అలజడి సృష్టిస్తుండగా, ప్రభుత్వ ఖజానాపై భరించే భారం పడుతోంది.

Pages