S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/18/2017 - 02:39

హైదరాబాద్, జూన్ 17: రంజాన్ సందర్భంగా 18న ఎల్‌బి స్టేడియంలో సిఎం కెసిఆర్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఇఫ్తార్ విందుపై శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 నుంచి 6 వేల మందికి సరిపడా విందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని మతాలను తమ ప్రభుత్వం గౌరవిస్తూ, పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

06/18/2017 - 02:38

హైదరాబాద్, జూన్ 17 : కల్తీలేని ఆహార పదార్థాలు ప్రజలకు అందేవిధంగా చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అధికారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. హానికరం, నాసిరకం, మిస్‌బ్రాండెడ్ వస్తువుల తయారీపై దృష్టికేంద్రీకరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కల్తీ ఆహారపదార్థాల అమ్మకాలను నివారించాలన్నారు.

06/18/2017 - 02:38

హైదరాబాద్, జూన్ 17: ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 5వ తేదీన అవార్డు టీచర్సు ఇండియా పక్షాన 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నట్టు సంస్థ అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే ఉత్తమ కళాకారులు, ఉత్తమ కవులు, ఉత్తమ గాయకులు, ఉత్తమ ఫొటోగ్రాఫర్లు, ఉత్తమ కొరియోగ్రాఫర్లను కూడా సత్కరిస్తామని అన్నారు.

06/18/2017 - 02:36

హైదరాబాద్, జూన్ 17: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లాస్థాయి అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్. నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

06/18/2017 - 00:45

హైదరాబాద్, జూన్ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో ఏడు సెంటీమీటర్లు, మద్దూరులో ఆరుసెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా దోమలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అన్ని జిల్లాల్లోనూ వాతావరణం చల్లగా ఉంది.

06/17/2017 - 03:17

మిర్యాలగూడ, జూన్ 16: శిరీషది ముమ్మాటికీ హత్యేనని, పోలీసులు హంతకులకు కొమ్ముకాస్తున్నారని ఆమె తండ్రి నెక్కంటి రవీంద్ర, సోదరి భార్గవి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శిరీష సోదరి భార్గవి విలేఖరులతో మాట్లాడుతూ శిరీష ఒంటిమీద గాయాలు ఉన్నాయని, తల వెనుక నుండి రక్తం కారిందని, ఆత్మహత్య చేసుకుంటే రక్తం ఎలా వస్తుందని వారు అనుమానం వ్యక్తం చేశారు.

06/17/2017 - 03:15

హైదరాబాద్, జూన్ 16: బ్యూటీషియన్ శిరీషపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కుకునూరుపల్లి సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఈ విషయం బయటపడుతుందన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష, ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల వెనుక మిస్టరీ వీడిందని, ఇరువురూ ఆత్మహత్య చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ పి. మహేందర్ రెడ్డి తెలిపారు.

06/17/2017 - 03:14

గజ్వేల్, జూన్ 16: రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది పనులకు నిధుల కొరత లేదని, సిఎం కెసిఆర్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని గృహ నిర్మాణ, దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి రాష్ట్ర ఫుడ్ సొసైటీ చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

06/17/2017 - 03:13

ఆత్మకూరు, జూన్ 16: మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలంలోని మేడేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయపొలం వద్ద శుక్రవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని బాలకిష్టాపూర్ గ్రామానికి చెందిన ఈదన్న(44), లక్ష్మన్న(44), పరమేశ్ (28) కలిసి మేడేపల్లి గ్రామ శివారులో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లారు.

06/17/2017 - 02:32

హైదరాబాద్, జూన్ 16:అవిభక్త కవలలు వీణావాణిల బాగోగుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్‌హోంలో ఉన్న వీణావాణిలతో శుక్రవారం మంత్రి ముచ్చటించారు. వీరి బాగోగుల కోసం బడ్జెట్‌లో 6.46 లక్షల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. వాణీ వీణాలను అనుక్షణం జాగ్రత్తగా చూసుకునే ఆయాలకు 4.32 లక్షలు కేటాయించారు.

Pages