S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/20/2017 - 02:48

హైదరాబాద్, జూన్ 19: ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను టిపిసిసి ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, పార్టీ సీనియర్ నేతలు కేక్ కట్ చేశారు.

06/20/2017 - 02:17

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతీ రుతుపవనాలు బలంగా ఉండటంతో వర్షాలు బాగా కురుస్తున్నాయి. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, వికారాబార్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇన్‌చార్జి) డాక్టర్ కె. నాగరత్న తెలిపారు.

06/20/2017 - 02:17

హైదరాబాద్, జూన్ 19: ముస్లింల రిజర్వేషన్లకు ప్రధాని నరేంద్రమోదీ ఒప్పుకున్నారని సిఎం కెసిఆర్ చెప్పడం పచ్చి అబద్దమని బిజెపి నేత నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. కేవలం కెసిఆర్ అసత్య ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు.

06/20/2017 - 02:13

హైదరాబాద్, జూన్ 19: కొత్తగా ఏర్పాటు చేసిన సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సెమీ-అటానమస్ హోదా ఇచ్చారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఈ కాలేజీకి సెమీ-అటానమస్ హోదా ఇవ్వాలంటూ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమణి 2017 ఏప్రిల్ 20 న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

06/20/2017 - 02:13

హైదరాబాద్, జూన్ 19: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింప చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 15 నుంచి సమ్మె చేస్తున్న కార్మికులపై సింగరేణి యాజమాన్యం నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ నిర్బంధాన్ని ఆపాలని కోరారు.

06/20/2017 - 02:12

హైదరాబాద్, జూన్ 19: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న పద్మజ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. టెక్ మహీంద్రలో పనిచేస్తున్న గిరీశ్ నరసింహకు, పద్మజకు గత సంవత్సరం ఏప్రిల్ 20న వివాహమైంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి.

06/20/2017 - 02:12

డార్జిలింగ్, జూన్ 19: ప్రత్యేక గూర్ఖాలాండ్‌ను కోరుతూ గూర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తలు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనలు సోమవారం మరింత తీవ్రంగా మారింది. డార్జిలింగ్ ప్రాంతం గూర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తల ఆందోళనలతో అట్టుడికింది. పరిస్థితి అదుపుతప్పటంతో ఈ కొండప్రాంత వీధుల్లో భద్రతాదళాలు కవాతు చేశాయి. నేడు కూడా ఇంటర్నెట్ సర్వీసులు ఆగిపోయాయి.

06/20/2017 - 02:10

హైదరాబాద్, జూన్ 19: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో మరో ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు. హైదరాబాద్ నగరశివారులోని రామంచంద్రాపురంలో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు విచారణ ఎదుర్కొంటుండగా తాజాగా ముంబయి పోలీసులు మరో ఇద్దరు సురేందర్, అతని భార్య రాధారత్నంలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

06/20/2017 - 00:20

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణలో కోటి ఎకరాలకు సాగులోకి తెచ్చే ప్రయత్నం ఒకవైపు సాగుతుండగా, దానికి తగినట్టు గోదాముల నిర్మాణం చేపట్టినట్టు మార్కెటింగ్ శాఖ తెలిపింది. 74 కోట్ల రూపాయల నాబార్డ్ సహాయంతో మరో 34 గోదాములను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

06/20/2017 - 00:19

హైదరాబాద్, జూన్ 19: మరో భారీ సమ్మేళనానికి హైదరాబాద్ వేదిక కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకూ హైదరాబాద్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగనుంది. ఈ సమ్మేళనానికి 15వేల మంది శాస్తవ్రేత్తలు, విద్యావేత్తలు ప్రత్యేక ప్రతినిధులు, పరిశోధకులు హాజరుకానున్నారు. ఈసారి సైన్స్ కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున నోబెల్ గ్రహీతలు కూడా పాల్గొంటారని సమాచారం.

Pages