S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/20/2017 - 00:19

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వపరంగా ఏదో ఒక లాభం అందించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమగ్రకుటుంబ సర్వేతో పాటు ఇతరత్రా సేకరించిన సమాచారం ప్రకారం ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చడం ద్వారా టిఆర్‌ఎస్ పునాదులను 2019 సాధారణ ఎన్నికల నాటికి మరింత పటిష్టం చేసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. రాష్ట్రం మొత్తంలో 1.09 కోట్ల కుటుంబాలు ఉండగా, 3.63 కోట్ల జనాభా ఉంది.

06/20/2017 - 00:18

హైదరాబాద్, జూన్ 19: ఇంజనీరింగ్ కాలేజీల్లో యుజి కోర్సుల్లో చేరేందుకు సోమవారం నాటికి 35529 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. సర్ట్ఫికెట్ల పరిశీలనకు ఇంతవరకూ 80వేల ర్యాంకుల వరకూ ఆహ్వానించగా అందులో 50,691 మంది హాజరయ్యారు. 19వ తేదీన 68001 ర్యాంకు నుండి 80వేల ర్యాంకు వరకూ అభ్యర్థులను పిలవగా, అందులో 6450 మంది మాత్రమే హాజరయ్యారు.

06/20/2017 - 00:16

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ గురుకులాల్లోని టిజిటి, పిజిటి, పిడి రిక్రూట్‌మెంట్ మెయిన్ పరీక్షలకు ఇదివరకు ప్రకటించిన షెడ్యూలును సవరించింది. సవరించిన షెడ్యూలు ప్రకారం పిజిటి మెయిన్ పరీక్షలు (నోటిఫికేషన్ 13/2017) జూలై 18 నుండి 19 వరకూ, టిజిటి మెయిన్ పరీక్షలు (నోటిఫికేషన్ 14/2017) జూలై 20 నుండి 22 వరకూ, పిడి మెయిన్ పరీక్షలు (నోటిఫికేషన్ 15/2017) జూలై 18వ తేదీన జరుగుతాయి.

06/20/2017 - 00:16

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో అడ్డూ అదుపూ లేకుండా కాలేజీలు సీట్లను అమ్మేస్తున్నాయి. కొన్ని కాలేజీలకు గుర్తింపు లేకున్నా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్న యాజమాన్యాలు సీట్లను గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నాయి. సాధారణ ఫీజులకు అడ్మిషన్లు చేయాల్సి ఉన్నా, కన్వీనర్ కోటా సీట్లు తగ్గడంతో ఈ ఏడాది మేనేజిమెంట్ సీట్లకు గిరాకీ పెరిగింది.

06/19/2017 - 03:50

హైదరాబాద్, జూన్ 18: ముస్లిం, మైనార్టీల విద్యా వికాసానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చా రు. హైదరాబాద్ నాంపల్లిలో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించే ముస్లిం ఆనాధ పిల్లలకు ఆశ్రయం, విద్యా అందించడానికి నిర్మిస్తున్న అనీస్-ఉల్-గుర్బాకు ముఖ్యమంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు.

06/19/2017 - 03:47

హైదరాబాద్, జూన్ 18: బ్యూటీషియన్ శిరీష, కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను జైలుకు తరలించగా, ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ప్రతి కేసును సిసిటివిల ఫుటేజీ ఆధారంగా ఛేదిస్తున్న పోలీసులు ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో సిద్దిపేట పోలీసులు నేటికీ సిసిటివిల ఫుటేజీలను అందజేయలేదనే మీమాంస అధికారులను సందిగ్ధపరుస్తోంది.

06/19/2017 - 03:46

హైదరాబాద్, జూన్ 18:అవయవ మార్పిడులు చేసుకున్న రోగులందరికీ దీర్ఘకాలికంగా లైఫ్ టైమ్ ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని, అలాంటి లైఫ్ సేవింగ్ మెడిసిన్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆపరేషన్ చేయించుకున్న రోగులకు ఈ నిధుల నుంచి మందులు పంపిణీ చేస్తారు.

06/19/2017 - 03:46

హైదరాబాద్, జూన్ 18: కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఏమీ చేయకపోయినా, ప్రచార ఆర్భాటం అధికంగా ఉండేదని కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి విమర్శించారు.

06/19/2017 - 03:42

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణలో అక్రమ అద్దెగర్భం దందా క్రమంగా సాగుతోం ది. ఓ మహిళను అద్దెగర్భానికి ఒకసారి మాత్ర మే అనుమతించాల్సి ఉండగా, రెండు, మూడుసార్లు అదే మహిళను అద్దె గర్భానికి వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెలుగుచూసిన అద్దెగర్భం దందాతో వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖ అప్రమత్తమైంది.

06/19/2017 - 03:18

నల్లగొండ, జూన్ 18: తెలుగు రాష్ట్రాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం డెడ్ స్టోరేజి 510అడుగులకు దిగువగా గత పదేళ్లలో లేని రీతిలో కనిష్ట స్థాయి 501.90అడుగులకు పడిపోవడం జలాశయం ఎదుర్కొంటున్న నీటి కటకటకు నిదర్శనంగా కనిపిస్తుంది. సాగర్ జలాశయంలో నీటి మట్టం అడుగంటుతుండటంతో ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా వాసులతో పాటు జంటనగరాలకు తాగునీటి కటకట పొంచి ఉంది.

Pages