S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/19/2017 - 03:16

కొండపాక, జూన్ 18: తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సిఎం కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలనేదే సిఎం ఉద్దేశమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం కొండపాక శివారులో సిఎం సభా స్థలి, దుద్దెడ గ్రామ శివారులో హెలిప్యాడ్ స్ధలాన్ని పరిశీలించారు.

06/19/2017 - 03:14

హైదరాబాద్, జూన్ 18: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆవిర్భావంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ వందకోట్ల రూ.ల బడ్జెట్ కేటాయించడమే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో మరో వంద కోట్ల రూపాయలు విడుదల చేసారని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రథమ తెలంగాణ బ్రాహ్మణ మహిళా సదస్సు జరిగింది.

06/19/2017 - 02:46

హైదరాబాద్, జూన్ 18: హైదరాబాద్ నగర రోడ్లు మూడు ప్రమాదాలు, ఆరు మరణాలు అన్నట్లు దడపుట్టిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరంలో గడచిన ఐదు నెలల్లో 968 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 35 మంది మరణించారు. 981 మంది గాయాలపాలయ్యారు.

06/19/2017 - 02:45

హైదరాబాద్, జూన్ 18: భూ కుంభకోణంలో ఇరుక్కున్న తెరాస ఎంపి కె కేశవరావుపై చర్యలు తీసుకోవడంలో సిఎం కెసిఆర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని టిటిడిపి అధికార ప్రతినిధి సతీష్‌మాదిగ ప్రశ్నించారు. అదే దళితుడైన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేశారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని అన్నారు. రాజయ్యకో న్యాయం, కెకె కి ఒక న్యాయమా..? అని నిలదీశారు.

06/19/2017 - 02:45

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లకు కళ్లెం వేయాలంటే ప్రత్యేక విద్యావ్యాపార నియంత్రణ చట్టం తేవాలని రాష్ట్ర విద్యా సదస్సు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నాడిక్కడ జరిగిన రాష్ట్ర విద్యా సదస్సు పలు తీర్మానాలను ఆమోదించింది.

06/19/2017 - 02:44

హైదరాబాద్, జూన్ 18: హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విమానం టేకాఫ్ అయిన అర గంటలో హస్తప్రయోగం చేసిన 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. ఆ మహిళ సదరు వ్యక్తి పక్క సీటులో కూర్చుంది.

06/19/2017 - 02:43

హైదరాబాద్, జూన్ 18: కల్తీ అల్లం,వెల్లుల్లి తయారీ కేంద్రంపై వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. గోదాం నిర్వాహకుడిని అరెస్టు చేసి 4.5 క్వింటాళ్ల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, రసాయన పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

06/19/2017 - 01:35

హైదరాబాద్, జూన్ 18:జోనల్ వ్యవస్థ రద్దుపై ఉద్యోగ వర్గాల్లో తిరిగి చర్చనియాంశంగా మారింది. తెలంగాణ ఆవిర్భవించి కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి జోనల్ వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదన ప్రభుత్వం ముందుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత 371డి ప్రాధాన్యత కోల్పోయిందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ప్రాంతం వారికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 371 డి ఏర్పాటు చేశారు.

06/19/2017 - 01:34

హైదరాబాద్, జూన్ 18: నగరంలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసోల్యూషన్ (ఐసిడిఎఆర్) ఆధ్వర్యంలో జులై 5 నుంచి 9 వరకు 40 గంటల పాటు మీడియేటర్స్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ కార్యాలయం తెలిపింది. ఎంజె రోడ్‌లోని గగన్‌విహార్‌లో నిర్వహించనున్న ఈ ట్రైనింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు తమను సంప్రదించాలని తెలిపింది.

06/19/2017 - 01:33

హైదరాబాద్, జూన్ 18: భారత్‌ను పర్యటించిన విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 19.5 శాతం పెరిగింది. 2016లో 5.27 లక్షలు ఉంటే, 2017లో ఆ సంఖ్య 6.30 లక్షలకు చేరిందని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే ఈ-పర్యాటక వీసా విధానం ద్వారా దేశానికి వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 55.3 శాతం పెరిగిందని తెలిపింది.

Pages